pizza
Chiranjeevi donates Rs 5 crore to Jana Sena
జనసేనానికి శ్రీ చిరంజీవి గారి ఆశీర్వాదాలు
జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం
You are at idlebrain.com > News > Functions
Follow Us


8 April 2024
Hyderabad

Actor and Jana Sena president Pawan Kalyan on Monday called on his big brother megastar Chiranjeevi on the sets of the latter’s Vishwambhara at Muchintal in Hyderabad outskirts. On this occasion, Chiru had donated a cheque of Rs 5 crore to Pawan Kalyan for electioneering purposes.

Pawan dropped by the sets at around 10 am on Monday along with another brother Naga Babu. Chiru received both of them warmly. Pawan became emotional after getting the blessings from Chiru. With Jana Sena clocking a decade in politics, Pawan was waiting to seek blessings from Chiru and as it transpired on Monday, Pawan’s joy knew no bounds.

In a statement released to the media later, Jana Sena party mentioned that Global star Ram Charan will also be lending his financial assistance to the party.

Andhra Pradesh is among the states where elections are slated to be held alongside the Lok Sabha polls. The voting for the state’s 175 assembly seats will be held on May 13, with the counting of votes to take place on June 4. Pawan is fighting against YS Jagan’s YSRCP in an alliance with TDP and BJP.

జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం

జనసేనకు విజయోస్తు.... విజయీభవ అని పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారు తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు శ్రీ నాగబాబు గారు చెంతనుండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది. సోమవారం ఉదయం పదిగంటలకు లొకేషన్ కు చిన్నన్న శ్రీ నాగబాబు గారితో కలసి లొకేషన్ కు చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ చిరంజీవి గారు ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. శ్రీ చిరంజీవి గారి ఆశీర్వచనం అందుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీ చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి గారి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి – అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీ వెనుక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరులు ముగ్గురూ కొంత సేపు సంభాషించుకున్నారు.

ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టి.వి.లో ఆ దృశ్యాన్ని చూసిన శ్రీ చిరంజీవి గారు తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతోపాటూ ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయలకు చెక్కును శ్రీ చిరంజీవి గారు సిద్ధం చేసి మరునాడే అందచేశారు.

శ్రీ చిరంజీవి గారి తనయుడు, గ్లోబల్ స్టార్ గా పేరుగాంచిన శ్రీ రామ్ చరణ్ గారు సైతం తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.

శ్రీ చిరంజీవి గారు చెక్కును అందించిన తరుణంలో జనసేన ప్రధాన కార్యదర్శులు శ్రీ నాగబాబు గారు, శ్రీ టి.శివశంకర్ గారు, కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి శ్రీ వి.అజేయ కుమార్ గారు, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరి ప్రసాద్ గారు పాల్గొన్నారు.

 

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved