pizza

Cyber Crime Complaint lodged against individuals who are part of orchestrated attacks and planned negative campaigns targeting The Family Star movie and actor Vijay Deverakonda
హీరో విజయ్ దేవరకొండను కించపరుస్తూ, "ఫ్యామిలీ స్టార్" సినిమాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

You are at idlebrain.com > news today >

07 April 2024
Hyderabad

"The Family Star," starring Vijay Devarakonda, has recently been released and is enjoying success, largely supported by family audiences. The film is running in theatres now. However, there has been a very evident attack on the movie and actor. Which has become a discussion point amongst all audience and social media users.

These people made negative posts about "Family Star" before its release and make attempts to target Vijay Devarakonda negatively. Some of these Social Media handles have been observed to become active as soon as a Vijay film is up for release.

Sri Venkateswara Creations, the production company behind "Family Star," took notice of these activities. Vijay Devarakonda's personal manager, Anurag Parvataneni, and the president of Vijay Devarakonda's fan association, Nishant Kumar, filed a complaint with the cybercrime police, providing screenshots, as well as information on social media groups and accounts involved, supplied by the production house.

The complaint alleges that certain individuals are intentionally misleading the audience with negative publicity about "Family Star," adversely affecting the movie's box office performance. Upon receiving the complaint and preliminary evidence, the police pledged to investigate and pursue legal action against the perpetrators.

This is not the first instance of social media campaigns being launched to spread negative propaganda and disparage Vijay Devarakonda's character around the release of his films. In the case of "Family Star," it appears that negative campaigns are being waged out of malice towards Vijay Devarakonda. It is also noted that many viewers who watched the movie reviewed it as a good film and expressed concern publicly about the attacks and reviews to the team.

హీరో విజయ్ దేవరకొండను కించపరుస్తూ, "ఫ్యామిలీ స్టార్" సినిమాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు. ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటెన్షనల్ గా కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ విషయంలో కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు సైతం సినిమా మీద యూట్యూబ్ లో సోషల్ మీడియా లో నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారనీ,మూవీ బాగుందని చెప్పడం గమనార్హం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved