pizza

Vikranth and Chandini Chowdary's "Santhana Prapthirasthu" produced by Madhura Sreedhar Reddy and Hariprasad Reddy launched grandly
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాణంలో లాంఛనంగా ప్రారంభమైన మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు"

You are at idlebrain.com > news today >

19 May 2024
Hyderabad

"Santhana Prapthirasthu," a musical family entertainer, has been officially launched by producers Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy. The film stars Vikranth and Chandni Chowdary in the lead roles.

The movie's formal launch took place today in Hyderabad. Produced under the banners of Madhura Entertainment and Nirvi Arts, "Santhana Prapthirasthu" is directed by Sanjeev Reddy. Notably, the screenplay is penned by Sheikh Dawood Ji, known for his work on films like "Venkatadri Express," "Express Raja," and "Ek Mini Katha."

At the launch event, the camera was switched on by producer and businessman Ambika Krishna, while Vasudha Foundation Chairman Mantena Venkata Ramaraju sounded the clapboard. Madhura Sreedhar Reddy directed the first shot, and the both producers handed over the script to director Sanjeev Reddy.

Director Sanjeev Reddy stated, "The film is a musical family entertainer. From children to adults, the movie appeals to everyone. We are addressing a contemporary issue in an entertaining manner. The story revolves around a Warangal girl and a Hyderabad boy, portraying a problem faced by a newly married couple."

Producers Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy expressed their happiness at the formal launch, thanking Ambika Krishna and Mantena Venkata Ramaraju for their contributions. They emphasized that "Santhana Prapthirasthu" is a good musical family entertainer with Sunil Kashyap composing the music. Regular shooting is set to begin on the 8th of next month, with filming in the areas surrounding Hyderabad and Warangal.

The cast includes Vikranth, Chandini Chowdary, Vennela Kishore, Abhinav Gomatam, Muralidhar Goud, Jeevan Kumar, Thagubothu Ramesh, and Rachcha Ravi.

*Technical Team:*

- *Costume Designers:* Aswat Bhairi, K Pratibha Reddy
- *Production Designer:* Sivakumar Maccha
- *Cinematography:* Mahi Reddy
- *Music Director:* Sunil Kashyap
- *Dialogues:* Kalyan Raghav
- *Executive Producer:* A Madhusudan Reddy
- *Story, Screenplay:* Sanjeev Reddy, Sheikh Dawood G
- *Publicity Design:* Mayabazar
- *Producers:* Madhura Sreedhar Reddy, Nirvi Hariprasad Reddy
- *Director:* Sanjeev Reddy

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాణంలో లాంఛనంగా ప్రారంభమైన మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు"

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఇవాళ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా...వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజు క్లాప్ నిచ్చారు. మధుర శ్రీధర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ స్క్రిప్ట్ ను దర్శకుడు సంజీవ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదు. వాళ్లను రప్పించేలా మూవీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఉంటూనే ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తున్నాం. వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య కథ జరుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా మూవీలో తెరకెక్కిస్తున్నాం. అన్నారు.

నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ - ఈ రోజు మా సినిమా సంతాన ప్రాప్తిరస్తు లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేసిన అంబికా కృష్ణ గారికి, క్లాప్ నిచ్చిన వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజుకి కృతజ్ఞతలు. మంచి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సునీల్ కశ్యప్ మా చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. అన్నారు.

నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్స్ - అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - శివకుమార్ మచ్చ
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
మ్యూజిక్ డైరెక్టర్ - సునీల్ కశ్యప్
డైలాగ్స్ - కల్యాణ్ రాఘవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎ మధుసూదన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే - సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
పబ్లిసిటీ డిజైన్ - మాయాబజార్
ప్రొడ్యూసర్స్ - మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
డైరెక్టర్ - సంజీవ్ రెడ్డి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved