pizza

'Maname Raja' from Sharma & Ambani crosses 1 million
1 మిలియన్ కొట్టిన 'శర్మ & అంబాని' సింగిల్‌

You are at idlebrain.com > news today >

05 April 2024
Hyderabad

A good comedy entertainer from Tollywood is soon going to be presented to the audience. The movie 'Sharma & Ambani', starring Bharath Thippireddy, Dhanya Balakrishna, and Keshav Karri in the lead roles, is getting ready for release. This film is set to be released on the prominent OTT platform ETV Win app on April 11th. The film unit has already started promotions. The posters released from this film have received a good response. The first single, titled "We are the Kings," released recently, has received a positive response from the audience. This video has gone viral on social media and has garnered 1 million views on YouTube in just three days. Shashank Alamuru & Maha have composed this song beautifully. This audio track, presented as a great dance number, has captivated the audience. The lyrics written by Kittu Vissapragada have become another attraction for this song's composition. Prudhvi Chandra and Prateek Nag have sung this song. As for the movie, it has been crafted as a crime comedy entertainer that promises to deliver hearty laughs to the viewers. Directed by Karthik Sai, under the banner of Neya Digital Solutions, produced by Anil Palla and Bharath Thippireddy, 'Sharma & Ambani' has been made.

1 మిలియన్ కొట్టిన 'శర్మ & అంబాని' సింగిల్‌

టాలీవుడ్ నుంచి ఓ మంచి కామెడీ ఎంటర్టైన్ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ కర్రి ముఖ్య పాత్రలలో నటించిన 'శర్మ & అంబాని' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటిటి వేదిక ఈ టీవి విన్‌ యాప్‌లో ఏప్రిల్ 11న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన మనమే రాజా అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూ ట్యూబ్‌లో కేవలం మూడు రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. శశాంక్ ఆలమురు & మాహా ద్వారా ఈ పాటను వినసొంపుగా కంపోజ్ చేశారు. మంచి డ్యాన్స్ నంబర్‌గా స్వరపరిచబడిన ఈ ఆడియో ట్రాక్, ఆడియెన్స్‌ను తన్మయం చేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన సాహిత్యం.. ఈ పాట కంపోజిషన్‌కు మరో ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను ప్రుధ్వి చంద్ర, ప్రతీక్ నాగ్ ఆలపించారు. ఇకపోతే.. ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు తెప్పించే క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. కార్తిక్ సాయి దర్శకత్వంలో, నేయా డిజిటల్ సొల్యూషన్స్ బ్యానర్ కింద, అనిల్ పల్లా మరియు భరత్ తిప్పిరెడ్డి నిర్మాణంలో 'శర్మ & అంబాని' రూపొందింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved