Ś
pizza

The Telugu Film Directors Association has invited Telangana Chief Minister Revanth Reddy to the Director's Day event tomorrow
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రేపు జరగబోయే డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానించిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్

You are at idlebrain.com > news today >

18 May 2024
Hyderabad

The Telugu Film Directors Association is organizing Director's Day celebrations tomorrow at Hyderabad's LB Stadium. The association members extended an invitation to Chief Minister Revanth Reddy for this ceremony. Association President Veerashankar, Vice President Vashishta, and Directors Anil Ravipudi and Harish Shankar handed over the invitation to Chief Minister Revanth Reddy yesterday evening. The association members mentioned that the Chief Minister would attend the ceremony. TFDA President Veerashankar highlighted that Chief Minister Revanth Reddy has a strong vision for the development of the Telugu film industry and believes that the CM will make Tollywood the hub of world cinema.

TFDA President Veera Shankar stated, "I, along with Harish Shankar, Anil Ravipudi, Vashishta, and others, met Chief Minister Revanth Reddy yesterday evening. I was delighted that the CM spoke with us about the film industry for about an hour when he was initially supposed to speak for just five minutes. The CM's vision for the development of the film industry was surprising. Chief Minister Revanth Reddy said that Tollywood should become the world's cinema hub and that the government will provide support in that direction. We suggested that it would be beneficial to establish a world-class film institute in Hyderabad. We are organizing this event to commemorate Director's Day worldwide. The Chief Minister confirmed that he would definitely attend."

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రేపు జరగబోయే డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానించిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్

రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించబోతోంది తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్. ఈ వేడుక రావాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వస్తానని చెప్పినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని, ప్రపంచ సినిమాకు టాలీవుడ్ హబ్ గా మారేలా చేద్దామని సీఎం చెప్పినట్లు టీఎఫ్ డీఏ అధ్యక్షుడు వీరశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా

టీఎఫ్ డీఏ ప్రెసిడెంట్ వీర శంకర్ మాట్లాడుతూ - నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వశిష్ట మరికొందరు వెళ్లి కలిశాం. ఐదు నిమిషాలు మాట్లాడాలని వెళ్తే సుమారు గంట సేపు మాతో సినిమా ఇండస్ట్రీ గురించి సీఎం మాట్లాడటం హ్యాపీగా అనిపించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి సీఎం గారి విజన్ కు ఆశ్చర్యం వేసింది. ప్రపంచ సినిమా హబ్ గా టాలీవుడ్ మారాలని, ఆ దిశగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాం. డైరెక్టర్స్ డే ను ప్రపంచమంతా గుర్తుపెట్టుకునేలా ఈ ఈవెంట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా వస్తామని మాటిచ్చారు. అని చెప్పారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved