pizza

Positive Word of Mouth Incresing for "Aarambham" - Team at Success Meet
"ఆరంభం" సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ పెరుగుతోంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

You are at idlebrain.com > news today >

11 May 2024
Hyderabad

"Aarambham" stars Mohan Bhagath, Supritha Satyanarayan, Bhushan Kalyan, and Ravindra Vijay in pivotal roles. Produced by Abhishek VT under the banner of AVT Entertainment and directed by Ajay Nag V, this emotional thriller hit the screens yesterday, garnering positive feedback from various locations where it was released. In light of this, a success meet for the film was held today at Hyderabad's Prasad Labs.

During the program, Executive Producer Vinay Reddy Mamidi stated, "Our movie 'Aarambham' premiered in theaters yesterday. While I won't say it was a full house on the first day, viewers have praised the emotion and drama. We've received encouraging messages on our production house's social media pages, prompting us to organize this success meet. We look forward to your continued support."

Producer Abhishek VT remarked, "Every screening of our movie is seeing 60 to 70 percent occupancy. Yesterday evening, we received positive feedback from theaters, attracting more audience members. Your support allows us to create films with innovative concepts. We hope for your ongoing support."

Music director Sinjith Yerramilli shared, "Audiences are responding positively to our film, with many reviewers praising its quality. Despite modest initial openings for a smaller production, word of mouth has been steadily growing since yesterday. I encourage everyone to catch 'Aarambham' over the weekend; it's a delightful experience you won't want to miss."

Director Ajay Nag V expressed, "Although our film didn't release in as many theaters as we'd hoped, viewers who watched it have given positive feedback. At premiere shows, friends and relatives appreciated our efforts, with some audiences even giving standing ovations during the climax. We've put in a lot of effort for the theatrical release, and I urge everyone to experience the film in theaters for the full impact."

Actor Bhushan Kalyan added, "Even though 'Aarambham' is made by newcomers, it's crafted with the expertise of seasoned professionals. While audience turnout in theaters has been slow, we hope for increasing support for this new endeavor."

Hero Mohan Bhagath expressed gratitude to the audience, stating, "We appreciate the support for 'Aarambham.' We believed in this story's appeal to Telugu audiences, and the response so far has been encouraging. Despite initial apprehensions, collections picked up from the evening shows, thanks to media support and positive reviews. I invite families to enjoy 'Aarambham' together."

"ఆరంభం" సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ పెరుగుతోంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ రెడ్డి మామిడి మాట్లాడుతూ - మా "ఆరంభం" సినిమా నిన్న థియేటర్స్ లోకి వచ్చింది. ఫస్ట్ డేనే మా మూవీకి హౌస్ ఫుల్స్ అవుతున్నాయని చెప్పను. కానీ చూసిన వాళ్లంతా మూవీలో ఎమోషన్ బాగుంది, డ్రామా బాగుందని చెబుతున్నారు. మా ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా పేజెస్ కు మెసెజెస్ పంపిస్తున్నారు. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి సక్సెస్ మీట్ పెట్టాలని అనుకున్నాం. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. అన్నారు.

నిర్మాత అభిషేక్ వీటీ మాట్లాడుతూ - మా సినిమాకు ప్రతి షో 60, 70 పర్సెంట్ ఫిల్ అవుతున్నాయి. నిన్న ఈవెనింగ్ థియేటర్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ప్రేక్షకులు ఇంకా మరింత మంది మా మూవీ చూసేందుకు రండి. మీరు ఆదరిస్తేనే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేయగలం. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి మాట్లాడుతూ - మా మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. రివ్యూస్ కూడా అప్రిషియేట్ చేస్తూ వచ్చాయి. నా ఫేవరేట్ రివ్యూవర్స్ చాలా మంది మూవీ బాగుందని రాశారు. నాకు తెలిసిన డైరెక్టర్స్ కూడా నిన్న సినిమా చూసి వాళ్లకు నచ్చిందని చెప్పారు. చిన్న సినిమాకు ఓపెనింగ్స్ భారీగా ఉండవు. కానీ మెల్లిగా పికప్ అవుతాయి. నిన్న సాయంత్రం నుంచి మౌత్ టాక్ పెరిగింది. శని, ఆదివారాలు వీకెండ్ మీరు ఆరంభం మూవీ చూడండి. రెండు గంటల పద్నాలుగు నిమిషాలే నిడివి. సెకండాఫ్ అయితే మీకు తెలియకుండా కంప్లీట్ అవుతుంది. మంచి ప్లెజెంట్ మూవీ మీరు థియేటర్ లో చూస్తే ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

దర్శకుడు అజయ్ నాగ్ వి మాట్లాడుతూ - ఎక్కువ థియేటర్స్ లో మా సినిమా రిలీజ్ కాలేదు. అదొక్కటే ప్రేక్షకుల నుంచి వస్తున్న కంప్లైంట్. మూవీ చూసిన వాళ్లు మాత్రం బాగుందని చెబుతున్నారు. మేము వేసిన ప్రీమియర్ షోలో స్నేహితులు, బంధువులు సినిమాను మెచ్చుకున్నారు. నిన్న ఒక థియేటర్ కు వెళ్లి చూస్తే క్లైమాక్స్ కు స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది. మేమంతా కొత్త వాళ్లం. మా సినిమాకు ప్రేక్షకులు అలా రెస్పాన్స్ ఇవ్వడం హ్యాపీగా అనిపించింది. యూత్ ఆడియెన్స్ మంచి సినిమాలను ఓటీటీలో వెతికి మరీ చూస్తారు. మీరంతా ఆరంభం మూవీని థియేటర్ లో చూడండి. ఇది ఓటీటీలో వచ్చేవరకు ఆగవద్దు. ఎందుకంటే మేము ఎంతో ఎఫర్ట్ పెట్టి థియేటర్ రిలీజ్ కోసం సినిమాను రెడీ చేశాం. థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ మా సినిమాను చూడండి. మీకు నచ్చుతుంది. మౌత్ టాక్ తో పాటు కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మరో ఒక ట్రెండు రోజుల్లో షోస్ ఫుల్ అవుతాయని ఆశిస్తున్నాం. అన్నారు.

నటుడు భూషణ్ కల్యాణ్ మాట్లాడుతూ - అజయ్, అభిషేక్, మోహన్, సింజిత్..ఇలా ఆరంభం కొత్త వాళ్లు చేసిన సినిమా అయినా అలా ఉండదు. ఎక్సీపిరియన్స్ ఉన్న వాళ్లు తీసిన సినిమాలా ఉంటుంది. ఇప్పుడు థియేటర్స్ కు ప్రేక్షకులు ఎక్కువగా రావడం లేదు. కానీ కొత్త వాళ్లు చేసిన ఈ ప్రయత్నానికి ఆడియెన్స్ సపోర్ట్ ఇవ్వాలి. క్రమంగా మా మూవీకి ప్రేక్షకుల రాక మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో మోహన్ భగత్ మాట్లాడుతూ - ఆరంభం మూవీని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్ కు థ్యాంక్స్. మేము ఈ సినిమా చేసేప్పుడు ఇలాంటివి మలయాళంలో చేసి తెలుగులో డబ్ చేయండి అప్పుడు మన వాళ్లు చూస్తారు. ఇలా నేరుగా తెలుగులో చేస్తే అంతగా రెస్పాన్స్ ఉండదు అన్నారు. కానీ మేము ఈ కథను నమ్మాం. తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని బిలీవ్ చేశాం. రిలీజ్ రోజున మార్నింగ్, మ్యాట్నీ షోస్ కు భయం వేసింది. కానీ ఈవినింగ్ నుంచి కలెక్షన్స్ పికప్ అయ్యాయి. మీడియా మాకు బాగా సపోర్ట్ చేసింది. రివ్యూస్ ఎంకరేజింగ్ గా వచ్చాయి. అన్నారు. మీరు ఆరంభం మూవీని ఫ్యామిలీతో కలిసి చూడండి ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved