pizza

First Time Ever: Public To Launch Maruthi Nagar Subramanyam First Look Through QR Code
హీరోగా రావు రమేష్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు ప్రేక్షకులే ముఖ్య అతిథులు... క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' లుక్ విడుదల చేయండి!

You are at idlebrain.com > news today >

12 March 2024
Hyderabad

In a new advancement in the film industry, the makers of Rao Ramesh starrer Maruthi Nagar Subramanyam unveiled the first look poster of the film through a QR code. Here is a look into innovative move from the makers of the family entertainer.

A new promotional video featuring Rao Ramesh in three different avatars - One being Rao Ramesh himself, the other being KGF Raghavan, and the last one being Vijayawada Mavayya(Seethamma Vakitlo Sirimalle Chettu). The interesting conversation between the three of them regarding Rao Ramesh's full fledged entertainment in Maruthi Nagar Subramanyam.

Towards the end, Rao Ramesh announces that the public is the reason why he is here today and he is taking the occasion to get the public involved with the first look launch poster of Maruthi Rao Subramanyam.

"The public is the reason why I could reach this stage. So I want the public to launch the first look poster of my film. I request people to scan the QR code that is seen in the end of the video to launch the first look poster" Rao Ramesh said.

The makers are estimating that at least 50,000 and potentially lakhs of people could be simultaneously launching the first look poster through the QR code. This is a new trend in the film industry and an inclusive plan to get the common public and cinegoers unveil the first look poster.

The poster is an intriguing one with Rao Ramesh seen in an energetic avatar with a red lungi and a massy look. The poster looks vibrant and instantly grabs the attention.

Maruthi Nagar Subramanyam has wrapped up the shoot and is heading for release soon. The first look poster sets the tempo for the forthcoming promotional campaign of the film. More promotional content will be out soon.

The film is directed Lakshman Karya and produced by PBR Cinemas and Lokamaatre Cinematics.

Starring : Rao Ramesh , indraja , Ankith koyya , Ramya Pasupuleti , Harsha Vardhan , Ajay and Annapurnamma, praveen.

Story, Screen play , Dialogues & Direction – Lakshman Karya Banners : PBR CINEMAS & LOKAMAATRE CINEMATICS Producers - Bujji Rayudu Pentyala, Mohan Karya
Co – producers - Rushi Marla , Siva Prasad Marla Line producer - Sri Hari Udayagiri
Music – Kalyan Nayak
Cinematography – MN Balreddy
Editor - Bonthala Nageswara Reddy
Art director – Suresh Bhimagani
Styling – Nishma Thakur
Creative head [ PBR cinemas ] – Gopal Adusumalli
Lyrics – , Oscar winner Chandra bose , Bhaskara Bhatla, kalyan Chakravarthy Sound design – Venkatesh Kindhibavi
Publicity design – Ananth Kancherla
PRO – Pulagam Chinnarayana
Co – director - Shyam Mandala
Chief associate director - Harsha Vardhan Chitimireddy
Direction team – Satya Punganur, Swaroop Kodi , PA Naidu
Di – Annapurna Studios, Hyderabad
Colorist – Surya Prakash
Dubbing – Prasad labs, Hyderabad
Digital pro : cinema chronicle
Vfx : SHARATH KERNAKOTA & Venkata Ramana Gunti

హీరోగా రావు రమేష్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు ప్రేక్షకులే ముఖ్య అతిథులు... క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' లుక్ విడుదల చేయండి!

రావు రమేష్... తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడు అనిపించుకున్న నటుడు. అగ్ర హీరోలు సైతం అతనితో నటించాలని కోరుకునే ప్రతిభావంతుడు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్... ఇప్పుడు కథానాయకుడిగా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమా చేశారు.

రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. ఆయన సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందుతోంది. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఫస్ట్ లుక్ విడుదల ప్లాన్ చేశారు.

'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కెజియఫ్'లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ రావు రమేష్ ముందు ప్రత్యక్షం అయ్యారు. 

'ఎప్పుడూ సగం సగం ఎంటర్‌టైన్ చేయడమేనా? ఫుల్లుగా మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం ఉందా? లేదా? అని! క్యారెక్టర్లు, సినిమా చేస్తున్నాం అంటే సరిపోయిందా? ప్రేక్షకులకు చక్కగా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసి ఒక్కసారైనా పంపాలి కదా!' అని విజయవాడ మావయ్య అడిగితే... 'ఎస్! హి ఈజ్ రైట్. ఇది హాట్ ఇష్యూ, స్వీట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ! నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి' అని గట్టిగా అడిగారు. అప్పుడు రావు రమేష్ ''ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది. చేశాను. రిలీజ్ అవుతుంది' అని చెప్పారు. సినిమా పేరేంటో? అని విజయవాడ మావయ్య అడిగితే... 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అని చెప్పారు. పేరు బావుందని విజయవాడ మావయ్య చెబితే... సినిమా ఇంకా బావుంటుందని రావు రమేష్ తెలిపారు. 

సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ''మారుతి నగర్ సుబ్రహ్మణ్యం... ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి'' అని విజ్ఞప్తి చేశారు.

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మోహన్ కార్య.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved