pizza

Sai Dharam Tej changes his name to Sai Durga Tej
My mother should always be with me. That's why I added my mother's name to my new name Sai Durga Tej: Supreme Hero Sai Durga Tej (Sai Dharam Tej) who announced his name change at 'Satya' press meet
మా అమ్మ ఎప్ప‌టికీ నాతోనే వుండాలి.. అందుకే నా పేరులో మా అమ్మ పేరును క‌లిపి నా పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నాను: స‌త్య ప్రెస్‌మీట్‌లో త‌న పేరును మార్చుకున్న‌ట్లు ప్ర‌కటించిన సుప్రీమ్‌హీరో సాయి దుర్గ తేజ్ (సాయి ధ‌ర‌మ్‌తేజ్‌)

You are at idlebrain.com > news today >

09 March 2024
Hyderabad

Hero Sai Durga Tej stands at the top of the list of actors who have displayed a responsibility towards society, love towards the country and utmost respect towards women. Many service programs have already been conducted under his aegis. The actor also donates some of his earnings to charity. Along with an old age home in Vijayawada, he also took charge of children in a school of over 100 pupils in a village in Telangana.

'Satya', a musical short feature in which he acted in the lead role, displays great respect for women and love for soldiers. This musical short feature was produced by Sai Durga Tej's own company Vijaya Durga Productions under the banner of Dil Raju Productions. Colors Swati acted as his wife in it. Harshit Reddy and Hanshita are its producers.

On the occasion of Women's Day on Friday, a special show of this film was screened for the media. On this occasion, popular producer Dil Raju said that, last year, the banner was made a stronger force. "We have produced a good short feature 'Satya'. Sai Dharam Tej always strives to do his part for society. This is a movie in which the entire team along with him wants to do their bit for society. I believe that all our efforts will give good results," Dil Raju added.

Hero Sai Durga Tej said that there are three great women in his life. "My grandmother Anjana Devi, my mother Vijaya Durga and my younger sister Madhavi are the ones. They are my biggest sources of happiness. When I came to know that this film is being made by my friends director Naveen Vijay Krishna and Harshit, I volunteered with a request to make me a part of such a great film. Naveen brought out a new angle in me through 'Satya'. The film has been screened in around 25 film festivals so far. Many awards have also been won," the hero added.

Director Naveen said that it was Harshit's idea to tell this short feature from the soldier's point of view. "Sai and I liked the idea and joined the efforts. There are many great women in India. Everyone should know about them. Everyone should know the story of our heroes. Today women are leading in all fields. There is nothing they cannot achieve if they set their mind to it. So far, our film has received 25 international awards at international film festivals where it has been screened," he added.

Harshit Reddy said that a song given by Shruti Ranjani was the inspiration for this short film. "Naveen and Sai are good friends. We are happy to produce a purposeful feature in our combination with Sai Durga Tej's banner," he said. Child actress Sai Tejaswini also participated in this meeting.

My mother should always be with me: Sai Durga Tej
"Ever since I started her film career, I wanted to start a production company in my mother's name. That is why I started Vijaya Durga Productions in the name of my mother and produced this film in association with Dil Raju Productions. My mother should always be with me. That is why I am changing my name to Sai Durga Tej from now on," the Virupaksha actor said.

మా అమ్మ ఎప్ప‌టికీ నాతోనే వుండాలి.. అందుకే నా పేరులో మా అమ్మ పేరును క‌లిపి నా పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నాను: స‌త్య ప్రెస్‌మీట్‌లో త‌న పేరును మార్చుకున్న‌ట్లు ప్ర‌కటించిన సుప్రీమ్‌హీరో సాయి దుర్గ తేజ్ (సాయి ధ‌ర‌మ్‌తేజ్‌)

సమాజం పట్ల బాధ్యత, దేశం ప‌ట్ల ప్రేమ, మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం వున్న క‌థానాయ‌కుల్లో జాబితాలో ముందు వ‌రుస‌లో వుంటారు హీరో సాయి దుర్గ తేజ్. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ సామాజిక కోణంలోనే ఆలోచించి మ‌హిళల ప‌ట్ల త‌న‌కున్న అమిత‌మైన గౌర‌వం, సైనికుల ప‌ట్ల వున్న ప్రేమ‌తో ఆయ‌న ప్రధాన పాత్ర‌లో న‌టించిన మ్యూజిక‌ల్ షాట్ ఫీచ‌ర్ స‌త్య‌. క‌ల‌ర్స్ స్వాతి ఆయ‌న‌కు భార్య‌గా న‌టించిన ఈ మ్యూజిక‌ల్ షాట్ ఫీచ‌ర్‌ను దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంతో క‌లిసి సాయి దుర్గ‌తేజ్ సొంత సంస్థ విజ‌య దుర్గ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ షాట్ ఫీచ‌ర్‌ను నిర్మించింది. హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మాత‌లు. కాగా శుక్ర‌వారం మ‌హిళా దినోత్సం సంద‌ర్భంగా ఈ చిత్రం ప్ర‌త్యేక షోను మీడియాకు ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో చిత్రం గురించి మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గ‌త సంవ‌త్సరం ఈ సంస్థ‌లో బ‌ల‌గం నిర్మించాం. మ‌ళ్లీ స‌త్య లాంటి ఓ మంచి షాట్ ఫీచ‌ర్‌ను నిర్మించాం. ఈ సోసైటీకి త‌న వంతుగా ఏమైనా చేయాల‌ని నిత్యం త‌ప‌న ప‌డ‌తాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఆయ‌న‌తో పాటు ఈ సినిమా టీమ్ అంతా స‌మాజానికి త‌మ వంతు ఏమైనా చేయాల‌ని చేసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా మా అంద‌రి ప్ర‌య‌త్నం మంచి ఫ‌లితాన్ని ఇస్తుంద‌ని నమ్ముతున్నాను అన్నారు. హీరో సాయిదుర్గ‌తేజ్ మాట్లాడుతూ నా జీవితంలో ముగ్గురు గొప్ప మ‌హిళ‌లు వున్నారు. మా అమ్మ‌మ్మ అంజ‌నా దేవి గారు, మా అమ్మ విజ‌య దుర్గ , మా పిన్ని మాధ‌వి. వీరే నా బిగ్గెస్ట్ హ్య‌పీనెస్‌. ఇక ఈ సినిమా నా స్నేహితులు న‌వీన్‌, హ‌ర్షిత్ చేస్తున్నార‌ని తెలియ‌గానే, ఇంత గొప్ప సినిమాలో నేను భాగ‌మ‌వుతాన‌ని అడిగి జాయిన్ అయ్యాను. ఈ సినిమా ద్వారా న‌వీన్ నాలో కొత్త యాంగిల్‌ను తీసుకొచ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 25 ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ఈ చిత్రం ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. చాలా అవార్డులు కూడా వ‌చ్చాయి అన్నారు. ద‌ర్శ‌కుడు న‌వీన్ విజ‌య‌క్రిష్ణ మాట్లాడుతూ సోల్జ‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షాట్ ఫీచర్ ను చెప్పాల‌నేది హ‌ర్షిత్ ఐడియా. ఆ ఐడియా న‌చ్చి నేను, సాయి జాయిన్ అయ్యాం. ఇండియాలో ఎంతో గొప్ప మ‌హిళ‌లు వున్నారు. అలాంటి వాళ్ల కొంత మంది వాళ్ల గురించి అంద‌రికి తెలియాలి. చాలా మంది వీర‌నారిల క‌థ అంద‌రికి తెలియాలి. నేడు మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ముందున్నారు. వారు అనుకుంటే సాధించ‌నిది ఏమీ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మా చిత్రానికి 25 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు వ‌చ్చాయి. ఎన్నోఅంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్ ఈసినిమాను ప్ర‌ద‌ర్శించాం అన్నారు. హ‌ర్షిత్ రెడ్డి మాట్లాడుతూ శ్రుతిరంజ‌ని అందించిన షాట్ సాంగ్‌కు ఈ షాట్ ఫీచ‌ర్‌కు ప్రేర‌ణ‌గా నిలిచింది. న‌వీన్, సాయి నేను మంచి స్నేహితులం, మా కాంబినేష‌న్‌లో ఓ మంచి ప‌ర్ప‌స్‌ఫుల్ ఫీచ‌ర్‌ను, సాయిధ‌ర‌మ్ తేజ్ ఓన్ బ్యాన‌ర్‌తో క‌లిసి ఇది నిర్మించినందుకు ఆనందంగా వుంది అన్నారు. ఈ స‌మావేశంలో బాల‌న‌టి సాయి తేజ‌స్విని కూడా పాల్గొన్నారు.

మా అమ్మ ఎప్ప‌టికీ నాతోనే వుండాలి: సాయి దుర్గ‌తేజ్
సినిమా కెరీర్ ప్రారంభించిన‌ప్ప‌టి నుండి నాకు మా అమ్మ‌పేరు మీద ఓ నిర్మాణ సంస్థ‌న ప్రారంభించాల‌ని వుండేది. అందుకే అమ్మ పేరు మీద విజ‌య‌దుర్గ ప్రొడ‌క్ష‌న్స్ ను ప్రారంభించి, దిల్ రాజు ప్రొడ‌క్షన్స్‌తో క‌లిసి ఈ సినిమా నిర్మించాను. అమా అమ్మ ఎప్పుడూ నాతోనే వుండాలి. అందుకే ఇక నుంచి నా పేరును సాయి దుర్గ‌తేజ్‌గా మార్చుకుంటున్నాను అని తెలిపారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved