pizza
Post mortem - Republic by Deva Katta
రిపబ్లిక్ పై పోస్ట్‌మార్టం
You are at Home > Movies > Post Mortem
Follow Us

Ritesh Rana

What is this post mortem?
ప్రముఖ వెబ్‌ సైట్ Idlebrain.com పోస్ట్‌మార్టం అనే ప్రత్యేకమైన కాలమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు వున్న సినిమా సమీక్షల స్థానంలో ఇంకా పూర్తి స్థాయిలో సినిమాలపై విశ్లేషణలు అందించేందుకు ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఏదైనా సినిమా అస్సలు హిట్ / ఫ్లాప్ ఎందుకు అయ్యింది. దర్శకులు, నటీనటుల బలాబలాలు వంటి వాటిపై ఖచ్చితమైన రివ్యూను అందించనున్నారు.

దీనిలో భాగంగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ పై పోస్ట్‌మార్టంను చుద్దాం. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత థియేటర్లలో తర్వాత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5లోనూ రిలీజ్ అయ్యి పలు విమర్శకుల ప్రేఖ్శకుల మన్ననలందుకుంది. జీ5 OTT రిలీజ్ సందర్భంగా, దర్శకుడు దేవ్‌కట్టా ఈ సినిమాకు సంబంధించి తనకు తాను చేసుకున్న విశ్లేషణ ఇది.

13 December 2021
Hyderabad

కధ మూలాలు (THE GENESIS) :
నా కథలన్నీ ఒక టాపిక్ మీద బలమైన ఆలోచనతొనో, లోతైన దృక్పధంతోనో, కలవరంతోనో ప్రారంభమవుతాయి. దీని ఆధారంగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకుంటాను. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ అదేలా ఉంటుందో తెలీని అజ్నానంలో బతుకుతున్నాం” అన్న అలోచన, దృక్పధం, కలవరమే ఈ ‘‘రిపబ్లిక్’’ సినిమాకు బీజం. ఆటోనగర్ సూర్య రాస్తున్నప్పుడే మన వ్యవస్థ గురించి ఆ నిర్ణయానికి వచ్చాను. ఇదోక రాడికల్ స్టేట్మెంట్ అనిపించినా, ఇది నూటికి నూరు శాతం నిజం అన్న విషవయం మనందరికీ తెలుసు. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోలేక ఒక భ్రమలో బతుకుతుంటాం. ఈ (అ)ప్రజాస్వామ్య ముసుగులో మన వ్యవస్థ ఫైల్ అవడానికి కారకులెవరు? మనమీ భ్రమలో కూరుకుపోవడానికి కారణమేంటి? మన అజ్నానమా? మన బాధ్యతారాహిత్యమా? మన ఆలోచనా సంస్కృతా? ఆ చేదు నిజాన్ని ఒప్పుకోడానికి భయమా? హిట్లర్ నుంచి గడాఫీ వరకూ చరిత్రను పరిశీలిస్తే, ఆ దేశ ప్రజల ఆలోచనా తీరే వాళ్ళ చూట్టూ ఉన్న రాజకీయ పరిణామంగా మారింది. మనల్ని మనం పరిశీలించుకుంటే, మన దీర్ఘకాల స్వప్రయోజనాలకు వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామా? రిపబ్లిక్‌లో ఈ ప్రశ్నలన్నింటినీ ఇతివృత్తంగా విశ్లేషించి, బహిర్గతం చేయాలనుకున్నాను. పరిపూర్ణమైన, సుస్థిరమైన వ్యవస్థ అంటే ఏంటి? అదసలు సాధ్యమేనా? మనుషులందరూ నిజాయితీగా మరియు హేతుబద్ధంగా ఉండాలని మనం ఆశించలేము! అవకాశమిస్తే ప్రతి మనిషీ అవినీతికి పాల్పడతాడు, అహేతుకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు వ్యవస్థ నిర్మాణాంలోనే, ఏ వ్యక్తికైనా, వ్యవస్థకైనా ఉన్న అధికారాన్ని చెక్స్ అండ్ బాలెన్సెస్ రూపంలో నియంత్రించినప్పుడే అది స్థిరమైన వ్యవస్థ అవుతుంది కదా? ఈ అన్వేషనే మా “రిపబ్లిక్”. ఈ చర్ఛని రోగికీ, రోగ లక్షణాలకీ పరిమితం చెయ్యదల్చుకోలేదు. రొగం గురించీ, ఆ రోగానికి విరుగుడు గురించి ఒక నిర్ధిష్టమైన సమస్య ద్వారా ఉదహరిస్తూ చర్చించాలనుకున్నాను. ఆ సమస్య ద్వారా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్నీ, సుస్థిరమైన ప్రభుత్వాన్నీ నిర్వచించాలనుకున్నాను. స్క్రీన్‌ప్లే పరిభాషలో దీన్నే "ప్లాట్ డివైజ్" (కధాంశం) అంటారు. అదే "ప్లాట్ డివైజ్" ని ఒక ఉపమానంగా ఎత్తి చూపుతూ, నిర్మాణంలోనే మన వ్యవస్థని కూల్చేస్తున్న నేరస్తులందరినీ (సినిమా విలనే కాదు, ఓటర్ తో సహా) నిర్భయంగా బహిర్గతం చెయ్యాలనుకున్నాను. కధ చెప్పడానికి ఒక సూపర్ విలన్, ఒక సూపర్ హీరో అవసరం, కానీ సమస్యకి నేనిచ్చే పరిష్కారం కూదా ఒక ఫాంటసీ అయితే ఆ కధకి అర్ధం లేదు, అందులో జీవం లేదు. అలాంటి కధ మూడు రొజుల తరువాత మట్టిలో కలిసి పోతుంది. పైగా నేను చర్చించే సమస్యని అలాంటి ఫాంటసీ ఇంకా ఆజ్యం పోసి పోశిస్తుందే కానీ ఆర్పలేదు. ఎలాగూ అందరూ సూపర్ హీరో కధలే చేస్తున్నారు కాబట్టి, నేను ఒక రియల్ హీరోలో ఉన్న సూపర్ హీరోని చూద్దామనుకున్నాను. వ్యవస్థ హద్దుల్ని కాపాడే ఒక సైనికుడ్ని అతని వీర మరణాన్ని గ్లోరిఫై చేద్దామనుకున్నాను. బోర్డర్లో ఫైట్ చేసే సైనికుడు ఏడాదికో సారి శత్రువుని ఫేస్ చేస్తే, నా సైనికుడు రోజూ వ్యవస్థ లో వున్న అతి కీచకమైన శత్రువులతో పోరాడుతున్నాడు. నా దృష్టిలో ఈ సైనికుడు ఇంకా గొప్ప హీరో.

“నా దృష్టిలో అభిరాం చావు సరిహద్దుల్లో పోరాడే సైనికుడి చావు కన్నా వీరొచితమైంది. సరిహద్దు బయటున్న శత్రువులు మన మీద ఐయిదేళ్ళకో పదేళ్ళకో ఒక సారి దాడి చేస్తే, సరిహద్దు లోపలున్న అప్రజాస్వ్యామ్య శత్రువులు మన జీవితాల మీద ప్రతి రొజూ దాడి చేస్తున్నాయి. అభి లాంటి సైనికుడు ప్రతి రోజూ ఆ శత్రువులతో పోరాడుతున్నాడు.” #రిపబ్లిక్

ఉధ్ధేశం (THE INTENT):
ప్రపంచంలో ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ కోరికలూ లక్ష్యాలూ తీర్చుకోవడం కోసం దైనందినం పోరాడుతుంటారు. మనందరి ప్రాధమిక అవసరాలూ, కోరికలూ, లక్ష్యాలూ ఒకటే. అవి కేవలం నలుగో అయిదో ఉంటాయి. కానీ భూమి మీదున్న ఎనిమిదొందల కోట్ల మంది జనాభా ఆ నలుగైదు అవసరాల్ని ఎనిమిదొందల కోట్ల దారుల్లో వెతుకుతుంటాయ్. అందుకే మనం ఎనిమిదొందల కోట్ల పాత్రలౌతాం. మన అవసరాల్ని తీర్చుకునే ప్రయత్నంలో మృగాలుగా మారకుండా చూడగలిగేదే చట్టం, న్యాయం, వ్యవస్థ, ప్రభుత్వం. మనమంతా “ఒక ప్రాణం”. ఆ “అనైకప్రాణాన్ని” కాపాడేదే వ్యవస్థ. నా దృష్టిలో ఆ “అనైక ప్రాణ” రక్షణే “మంచి”, ఆ ప్రాణ భక్షణే “చెడు”. ఇదే నాకు తెలిసిన ధర్మం. ఈ ధర్మాన్నే ఉపోద్ఘాతంగా సినిమా ప్రారంభంలోనే డెవిల్ ఫిష్ సీక్వెన్స్ ద్వారా చెప్పడం జరిగింది.

పరిశొధన (RESEARCH):
నా లక్ష్యాన్ని సాధించడానికి ప్రజాస్వామ్యం గురించి, “రిపబ్లిక్” గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. పొలిటికల్ స్కాలర్స్ కూడా సినిమాని తప్పు పట్ట కూడదు. గ్రీకు తత్వవేత్తలు ప్రజాస్వామ్యంపై వ్యక్త పరిచిన ఆలోచనల నుంచి, తొలి రిపబ్లిక్ అయిన రోమన్ సామ్రాజ్యం వరకు, నేటి జయప్రకాశ్ నారాయణ్ వంటి ఆధునిక మేధావులు ప్రజాస్వామ్యం గురించి వ్యక్త పరిచిన అలోచనలను స్టడీ చేశాను. పర్యావరణాన్నీ, ప్రాణాన్నీ, మనిషినీ, సమాజాన్ని ఒకటిగా చూసే (natural law) ‘‘సహజ ధర్మాన్ని’’ అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాను. ప్రకృతినీ, మనిషి నైజాన్నీ అర్ధం చేసుకున్నప్పుడే, పరిపాలనపై సమర్ధవంతమైన అవగాహన వస్తుంది. Apple Podcasts లో అమిత్ వర్మ కండక్ట్ చేసే ‘‘ ది సీన్ అండ్ ది అన్‌సీన్’’లో నుంచి వివిధ అంశాల మీద వందల గంటలు పాడ్‌కాస్ట్‌లను విన్నాను. ప్లేటో రిపబ్లిక్ , నీషే ఫిలాసఫీ’, శివమ్ శంకర్ రాసిన ‘‘How to Win an Indian Election’’, కపిల్ కోమిరెడ్డి రాసిన ‘‘Malevolent Republic’’ వరకు అనేక పుస్తకాలు చదివాను.

“మనిషిలో ఉన్న ధర్మం వలనే ప్రజాస్వామ్యం సాధ్యం!
అదే మనిషిలోని అధర్మం కోసం ప్రజాస్వామ్యం అవసరం!” – రీన్హోల్డ్ నిబుహ్ర్

ఈ రిసర్చ్ లో నేను తెలుసుకున్న మొదటి విషయం; నా కధా వస్తువు (plot device) ఒక పర్యావరణ సమస్యగా ఉన్నప్పుడే ప్రభుత్వం గురించి, ప్రజాస్వామ్యం గురించి, చట్ట న్యాయాల గురించి తటస్థమైన దృక్పధాన్ని వ్యక్తపరచ గలను. ఈ క్రమంలో నేను ఎంచుకున్న పర్యావరణ సమస్య ‘‘ కొల్లేరు ’’. అది మన తెలుగు సంస్కృతిలో భాగం. ఆ చెరువుని నేను మన వ్యవస్థకు రూపకంగా (as a Metaphor) తీసుకున్నాను. కొల్లేరు గురించి సినిమాలో చూపించినవన్నీ పాక్షికంగా నిజం, ఎక్కువ భాగం కల్పితం కాబట్టి దాని పేరు ‘‘తెల్లేరు’’గా మార్చుకున్నాను. ఈ కధా వస్తువు నా ఆలోచనలో ఉన్న అంశాలన్నిటినీ వ్యక్త పరచడానికి అవకాశమిచ్చింది. అందరికీ సొంతమైన ప్రకృతిని చంపుతూ ఆ విష విలయాన్నే జీవనోపాధిగా చేసుకున్న వర్గం ఒకటి, ఈ అకృత్యం వల్ల బాధింపబడుతున్న రైతు వర్గం ఒకటి, ఈ విషవలయంలో ప్రజల్ని ప్రభుత్వా ఉద్యోగుల్నీ ఇరికించి లబ్ధి పొందుతున్న రాయకీయ నాయకురాలు, ధర్మం కోసం పోరాడే కధా నాయకుడు, కుల సమీకరణలు, వీధి రౌడీలు, పోలీసులు, సివిల్ సర్వెంట్లు, ఆరోగ్య అధికారులు, వైద్యులు, బాధితులు, నేరస్తులు ఇలా ఈ కధా వస్తువుతో అన్నీ ఒక ప్యాకేజీగా వచ్చాయి. పరిశొధనలో తెలుసుకున్న వాస్తవాల ఆధారంగా చేసుకుని సరస్సును కాకుండా వ్యవస్థను ప్రతిబింబించడం, నిర్వచించడమే నా లక్ష్యం. కధలో చర్చించాల్సిన అంశాలను బట్టి ఆ చర్చకు అవసరమైన విధంగా పాత్రలు (characters), వాటి నేపథ్యాలు (behaviour), ఉద్దేశ్యాలను (motifs) దిజైన్ చెయ్యడం జరిగింది.

కాలక్రమం (TIMELINES):
చాలా ఏళ్ళగా ఈ ఐడియా నా మైండ్ లో ఉన్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే పూర్తి చేయడానికి 4 నెలలు పట్టింది. తరవాత సినిమా కోసం ప్రిపరేషన్ చేయడానికి 3 నెలలు, షూటింగ్ 64 రోజులు, పోస్ట్ ప్రొడక్షన్‌ 3 నెలలు పట్టింది.

తారాగణం (CASTING):
తేజ్ ఒక రోజు జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా, సరదాగా మాట్లాడుతూ ఈ ఐడియా చెప్పాను; ‘‘మనమందరం ప్రజావ్యామ్యంలో ఉన్నామన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఆ ప్రజా స్వామ్యం ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. అది తెలియచెయ్యడమే ఈ కధ లక్ష్యం”. తెజ్ కి ఈ అలోచన విపరీతంగా నచ్చింది.. దాని మీద ఫోకస్ గా వర్క్ చెయ్యమని, రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ వచ్చాడు. అలా యాధృఛ్ఛికంగా కుదిరి, ఈ సినిమా మేం ఇద్దరం కలిసి చేసినందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఈ మూవీ స్క్రిప్ట్ తొలి డ్రాఫ్ట్ లో విలన్ పాత్ర ఒక డెబ్బై యేళ్ళ రాజకీయ నాయకుడు. ఆ క్యారెక్టర్‌ని ఫీమేల్ గా మారిస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని తేజ్ రిక్వస్ట్ చేశాడు. సెకండ్ డ్రాఫ్ట్ లో విలన్ పాత్రని ఫీమేల్ గా మార్చి రాస్తున్నప్పుడు కధలో చాలా లోతైన భావం కనిపించింది. విలన్ హీరో రిలేషన్ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఆ డ్రాఫ్ట్ లోనే డార్విన్ సీన్ (సెకండ్ హాఫ్ లో విశాఖా వాణీ ఆభిరాం మధ్య సీన్) పుట్టింది. ఆ సీన్ కధకి అయువు పట్టుగా మారింది. మొదటి నుంచి దశరథ్ పాత్రలో జగపతిబాబు గారిని తప్ప ఎవరినీ ఊహించుకోలేక పోయాను. ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్‌గా ఫిక్స్ చేసి మిగిలిన నటీనటులందరినీ ఆడిషన్ చేసి ఫైనల్ చేశాం. రాహుల్ రామకృష్ణ మంచి యాక్టర్ కాబట్టి రొటీన్ కి భిన్నంగా ఒక సీరియస్ క్యారెక్టర్ లో చూడాలనిపించింది.

BEING SINCERE TO THE IDEA (ఆలోచన పట్ల నిజాయితీగా ఉండటం)
‘‘సాయిధరం తేజ్ దేవా కట్టా సినిమా చేస్తున్నాడు, దేవా కట్టా సాయిధరం తేజ్ సినిమా చెయ్యట్లేదు, ఇందులో మరో మాట లేదు’’ అంటూ తేజ్ ఎప్పుడూ గుర్తు చేసేవాడు. అయినా ఇంకా నా కెరీర్‌లో అంతుచిక్కని ఒక Instant Theatrical Blockbuster లేదు కదా అని మొదట కొంత అభద్రతా భావంతో అప్రోచ్ చేశాను. కథ మూడ్ నుంచి పక్కకు జరిగి కామెడీలు బంతుల్లా ఎగిరే ఫైట్ లు చెయ్యడం పెద్ద ఛాలెంజ్ కాదు, కానీ అవి నా కధల్లో ఉన్న నిజాయితీని చంపేస్తాయ్. ఆటోనగర్ సూర్యా దానికి నిదర్శనం. ఇప్పటిదాక నేను నిజయితీగా తీసిన సినిమాలే థియేటర్ లో కాకపోయినా తరవాతైనా జనాల్లోకి బలంగా వెళ్ళాయి. ఎప్పుడూ నేను ఆ బలాన్ని నమ్ముకునే సినిమా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. తరచు సినిమాలు చేస్తూ నా సినిమా చూడాలనుకునే ఆడియెన్స్ ని క్రమేణా బిల్డ్ చేసుకోవాలి. కామెడీ చేయాలంటే కామెడీ సినిమా తీయాలి...పాటలు కావాలంటే మ్యూజికల్ తీయాలి. అందరిలాగా ఒక “బఫే” ను అందించడానికి ప్రయత్నించి ఫైల్ అయ్యే బదులు నా కళా ప్రక్రియకు కట్టుబడి ఉండడం ముఖ్యామని తెలుసుకున్నాను. ఈ సినిమా ఇన్‌స్టంట్ థియేట్రికల్ మాస్ పుల్లర్‌ కాకపోయినా పర్లేదు, సిన్సియర్ ఫిల్మ్ మేకర్‌గా ప్రస్థానం తర్వాత నేను కోల్పోయిన రెస్పెక్ట్ ని తిరిగి తెచ్చుకుంటే చాలు అని, నా ఆలోచనల్ని ఎక్కువ కలుషితం కానివ్వకుండా, చిత్తశుద్ధితో అప్రోచ్ చేశాను.

GENERAL AUDIENCE’ VERSUS CLIMAX IMPACT (జనరల్ ఆడియన్స్ మరియు క్లైమాక్స్ ఇంపాక్ట్):

ఈ ఐడియా డెవలప్ చెయ్యడం మొదలు పెట్టిన రోజు నుంచి నేనూ, తేజ్, సతీష్ (క్రియేటివ్ ప్రోడ్యూసర్), స్క్రీన్ ప్లే పార్టనర్ కిరణ్‌ ఒక విషయంలో మాత్రం క్లియర్ గా ఉన్నాం; చివరి పది నిమిషాలు మార్చినట్లయితే ఈ సినిమా ఒక రొటీన్ కమర్షియల్ సినిమా అవుతుంది. మూడు రోజులు థియేటర్ లో చూసి మర్చిపోతారు. ఇది జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా కావాలంటే చివరి పది నిమిషాలు పదిలంగా ఉండాలని బలంగా డిసైడ్ అయ్యాం.

థియేటర్ లో కొంత మాస్‌ను కోల్పోయినప్పటికీ, మా సెన్సిబిలిటీస్ వున్న వారికి మాత్రం ఈ సినిమాని సిన్సియర్ గా అందిస్తే చాలనుకున్నాం. ఈ రోజు ఈ సినిమాతో మేము గెలుచుకున్న ప్రతి ఒక్క మనసు వెయ్యి టికెట్లతో, లక్ష గొంతుకలతో సమానం. ఇది ధైర్యంతో తీసిన సినిమా, హార్డ్ హిట్టింగ్, అవుట్ స్టాండింగ్, మాస్టర్ పీస్, క్లాస్సిక్, ధైర్యంగా చేసిన ప్రయోగం, ప్రత్యేకమైన చిత్రమ్ లాంటి మాటలు కేవలం ఆ క్లైమాక్స్ వల్లే సాధ్యమయ్యాయి.

మేము గెలుచుకున్న ఆడియెన్స్ గుండెల్లో ఈ రిపబ్లిక్ నిప్పు ఎప్పుడూ మండుతూనే ఉంటుంది.

ప్రశంసలు (RECEPTION);
ప్రస్థానం విషయంలో పదేళ్ళుగా వచ్చిన ప్రశంసలు, ఫోన్ లు, మెసేజ్‌లు, ట్వీట్లు, సోషల్ మీడియా పోస్ట్‌లు‌ ... రిపబ్లిక్ విడుదలైన పది రోజుల్లోనే వచ్చాయి. రెండో రోజుకే ఇది ప్రస్థానం కన్నా బాగా నచ్చిన “కల్ట్” అని సినిమా నచ్చిన వాళ్ళలో సగం మంది డిక్లేర్ చేశారు. వచ్చిన రెస్పాన్స్ ని కొంత షేర్ చేసుకుంటున్నాను ;

1. వరంగల్‌లో షూటింగ్‌ కోసం వెళ్ళిన ఒక తమిళ్ అసిస్టెంట్ డైరెక్టర్ తిరిగి చెన్నై వెళ్తూ తెనాలిలో ఆగి సినిమా చూసి.. నా ఫోన్ నంబర్ అడిగి తెలుసుకుని కాల్ చేశాడు. ఈ సినిమా చూశాక తనలో బాప్తిస్మం తీసుకున్నంత మార్పు వచ్చిందని చెబుతూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ సినిమాపై పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నానని చెప్పాడు.
2. “రిపబ్లిక్ ఒక సినిమా కాదు.. ఒక సామాజిక గ్రంథం, Outstanding” - idlebrain.com లో శ్రీనివాస్ కంచిభోట్ల.
3. “సమాజానికి తన నగ్నత్వాన్ని తనకే పబ్లిక్ గా చూపించిన నిలువుటద్దం ఈ రిపబ్లిక్. సెల్యులాయిడ్ తో నిగ్గదీసి అడిగాడు సిగ్గులేని జనాన్ని...అగ్గితోటి కడిగాడు సమాజ జీవచ్ఛవాన్ని” - ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిగారు.
4. రిపబ్లిక్ లాంటి సినిమాలు చాలా అరుదు.. ఇందులో నిజాయితీ, కఠినత్వం వుంది. సాయి ధరమ్ తేజ్ అద్భుత నటన, దేవ్‌కట్టా నిజాయితీతో నిండిన అప్రోచ్.. అందరూ తప్పక చూడాల్సిన సినిమా” - గణేశ్ కుమార్ రావూరి.
5. భారీ బడ్జెట్ చిత్రాలను పంపిణీ చేసే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్‌: “కొంత డబ్బు పొగొట్టుకున్నా.. నా కేటలాగ్‌లో రిపబ్లిక్ సినిమా ఉందని జీవితాంతం గర్వంగా చెప్పుకుంటాను సర్”.
6. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ వంటి ప్రింట్ మీడియా రివ్యూస్ అండ్ జీవీ రివ్యూ; ‘‘ A brave experiment”.

సినిమా మీద రాజకీయాల ప్రభావం (IMPACT OF POLITICS ON THE FILM)
ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ, పార్టీకీ సంబంధం లేకుండా కేవలం ప్రజా స్వామ్య పునాదుల గురించి చర్చించిన మా సినిమాని రిలీజ్ కి ముందు అహేతుకంగా ఒక రాజకీయ లక్ష్యంగా మార్చారు. కట్టకుండానే కూలిపోతున్న ప్రజా స్వామ్య పునాదుల గురించి, మన ప్రజాస్వామ్య మూలాల్లో వున్న వ్యాధి గురించి “రిపబ్లిక్” తటస్థంగా ఎలుగెత్తి చెప్పిందే తప్ప ఏ ఒక్క పార్టీనో, వ్యక్తినో టార్గెట్ చెయ్యలేదు. సినిమా రిలీజ్ తరువాత అన్ని రాజకీయ పార్టీ నాయకులూ కాల్ చేసి అభినందించారు. కానీ రిలీజ్ కి ముందు మాత్రం కొంతమంది అభద్రతా భావంతో టార్గెట్ చేశారు. వ్యక్తిగత, రాజకీయాలకు అతీతంగా సినిమాను చూసినవారు దాన్ని సొంతం చేసుకున్నారు. థియేటర్ లో రిలీజ్ అయిన టైమ్ లో అధికార పార్టీ మద్ధతుదారులు తమకు వ్యతిరేకంగా ఉందేమో అన్న అపోహతో సినిమాని దూరం చేసుకున్నారు. తరువాత వాళ్ళే చాలా మంది ఓ.టీ.టీ లో చూసి ఆక్సెప్ట్ చేశారు. సినిమాని చూడకుండానే అసహ్యించుకోవడం మమ్మల్ని బాధించింది. పవన్ కల్యాణ్ గారు వేదిక మీద వివిధ సమస్యలపై తన గొంతు వినిపింంచి ఈ సినిమా స్పూర్తిని ప్రదర్శించాలనుకున్నారు. మరుసటి రోజు ఆ ప్రసంగం వ్యక్తిగత దాడుల యుద్ధంగా మారి పోయింది. సినిమాపై పరోక్ష దాడిగా మారింది. చాలా మంది పరిశ్రమలోని మిత్రులు ఫోన్ చేసి సినిమాని మెచ్చుకున్నారు, కానీ ఈ రచ్చ కారణంగా సోషల్ మీడియాలో ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చెయ్యడానికి వెనుకాడారు. ఇలా మా లాంటి తటస్థ స్వరాలని (neutral voices) నులిమెయ్యడం వల్ల ఎవరికీ లాభం లేదు. ఈ సినిమా వైపు నిలబడ్డ తటస్థమైన సెలెబ్రిటీస్ అందరికీ నా ధన్యవాదాలు. గుడ్డి భక్తితో ఎవరికీ గుడ్డిగా లాయల్టీ ప్రదర్శించకుండా ఫ్రీ మైండ్ తో బతికే వాళ్ళ కోసమే ప్రజాస్వామ్యం పుట్టింది. భయంతో, గుడ్డి లాయల్టీలతో బతికే బానిస మనస్తత్వాల కోసం కాదు. ఇది కూడా “రిపబ్లిక్” కధాంశాల్లో ఒకటి.

ఆర్ధిక చర్చ మరియు థియేటర్ కి వచ్చిన జనం (FINANCIALS AND FOOTFALLS):
రిలీజ్ అయిన రోజు నుంచి రిపబ్లిక్ సినిమా బలమైన పాసిటివ్ టాక్ తో మొదలైనప్పటికీ, రాజకీయ గోలలో ఆశించినంతగా థియేటర్ కి జానాలని రప్పించలేక పోయింది. సినిమా ఉద్దేశం, జానర్ మరియు దాని ఇంపాక్ట్ గురించి మాట్లాడే కెపాసిటీ లేని కొద్ది మంది విమర్శకులు మాత్రం ఈ చిత్రాన్ని ‘‘ మేధావుల కోసం మాత్రమే’’ తీసిన సినిమా, మాస్ జనాలు చూడరు అని తగ్గు చూపు చూశారు. అది కొంత వరకు నిజమే అయినా ఈ సినిమా విషయంలో వాళ్ళ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేను. ఒక చిన్న టౌన్ లో టైర్ షాపును నడుపుతున్న ఒక వ్యక్తి సినిమా గురించి ఆ మేధావుల కన్నా క్రిటిక్స్ కన్నా చాలా లోతుగా అనలైజ్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అలాంటి ప్రేక్షకుల కన్నా విమర్శకుల విశ్లేషణ ఇంకా టెక్నికల్ గా ఉండాలన్నది నా అభిప్రాయం. ఈ మధ్య విడుదలైన రెండు సినిమాల రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం; క్రిటిక్స్ అందరి చేత మంచి “రేటింగ్స్” పొందిన 100 కోట్ల రూపయల బడ్జెట్‌తో నిర్మించిన రెండు సినిమాలు అన్ని భాషల్లో కలిపి, థియేటర్లలో 5 కోట్ల రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోయాయి. పూర్తిగా కాలం చెల్లిన కొన్నిమసాలా సినిమాలు వాటికన్నా అయిదారింతలు ఎక్కువగా కలెక్ట్ చేశాయి. దీనర్ధం ఏంటి? ప్రేక్షకులు హాఫ్ బేక్డ్, ఔట్‌ డేటెడ్ మసాలా సినిమాలు మాత్రమే థియేటర్లలో చూస్తున్నారా..? కంటెంట్ సినిమాలు ఓ.టీ.టీ లో మాత్రమే చూస్తున్నారా? ఈ “22” లో ఏ రెండు ముందని ఆలోచించే బదులు ప్రతి సినిమాని దాని ఉద్దేశ్యం ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఆ జానర్ కి కట్టుబడి ఉందా లేదా అని విశ్లేషిస్తే మంచిదని నా అభిప్రాయం. మంచి సినిమాలు తీయాలి రావాలి అన్నదే మన లక్ష్యం కావాలి కాని, మంచి సినిమాలు తీస్తే చూడరు, ఆడవు, కాబట్టి మీడియోకర్ సినిమాలే తియ్యాలి అన్నది లక్ష్యం కాకూడదు. ఒక రేటింగ్ నంబర్ ఇచ్చి ఇది చూస్తారు, ఇది చూడరు అనడం కన్నా ఆ సినిమా ఇంటెంట్ నీ దాని కంటెంట్ నీ విశ్లేషించి మాట్లాడినప్పుడే క్వాలిటీ సినిమాలు జనాలకు అందుతాయి. ప్రతి ప్రేక్షకుడిలోనూ అన్ని రకాల సినిమాలు చూసే ప్రేక్షకుడుంటాడు. వాడ్ని మనం ప్రోత్సహించాలి కానీ, మసాలా సినిమాని ఒక స్కేల్ తోనూ, జానర్ సినిమాని ఇంకో స్కేల్ తోనూ కొలవ కూడదు. సినిమా గురించి అవగాహన ఉన్న క్రిటిక్ ఆ సినిమా జానర్ కి కట్టుబడి ఉందా లేదా అని చర్చిస్తాడు. అదే ఎప్పటికైనా నిలబడే క్రెడిబిలిటీ అవుతుంది. బాక్స్ ఆఫీస్ మూడ్ నీ నంబర్స్ నీ ఎవడూ కరక్ట్ గా అంచనా వెయ్యలేడు. కొన్ని సినిమాలు బాగా లేవు అంటూనే ఎగబడి చూశారు. ఈ పరిణామాన్ని ఏ నిర్మాతలూ, దర్శకులూ, విమర్శకులూ వివరించలేరు. కొంత మంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ క్లీన్ గా తీసే సీరియస్ సినిమాలు సరిగ్గా ఆడవు.. మీ తొలి సినిమా ‘‘ వెన్నెల ’’ లాంటి కామెడీ చేయొచ్చు కదా అని సలహాలిస్తుంటారు. క్లీన్ సినిమాలు తీయగల కెపాసిటీ ఉన్న దర్శక నిర్మాతలకే ఆ సలహాలిచ్చే అర్హత ఉంది. థియేటర్ లో ఎక్కువ మంది ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ అవ్వాలో అలాంటి దర్శకులు సలహా ఇస్తే అర్ధం ఉంది.

థియేటర్ లో ఆశించినంత ఫలితం దక్కక పోయినా రిపబ్లిక్ ఓ.టీ.టీ లో మంచి సక్సెస్ అవుతుందని థియేటర్ లో చూసిన వాళ్ళ రెస్పోన్స్ తో మాకు నమ్మకం వచ్చించి. రిపబ్లిక్ సినిమా ఓ.టీ. టీ లో మేము ఆశించినదానికన్నా పెద్ద బ్లాక్బస్టరే అయ్యింది. జనాల్లోకి ఒక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఓ.టీ.టీ లో చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్ లో ఎలా మిస్సయ్యామని విస్తుపోయారు. ఈ రోజు వరకు రిపబ్లిక్ సినిమాని చూసిన వాళ్ళ ప్రశంసల్ని మా యూనిట్ ఎంజాయ్ చేస్తూనే ఉంది.

“ఇది మూడు రోజుల్లో మింగి ఊసే మిఠాయి కాదు. వేపరసం లాంటి నిజం కాబట్టి మెల మెల్లగా లోతుగా దిగుతూ ఉంది, దిగుతునే ఉంటుంది.” #రిపబ్లిక్

బడ్జెట్‌ అదుపులో పెట్టుకుని తీయడం వల్ల నిర్మాతలు విడుదలకు ముందే దాదాపు పది కోట్లు లాభ పడ్డారు. నిర్మాతల లాభాలను పరిగణనలోకి తీసుకుంటే థియేటర్ లెక్కలు మారిపోతాయ్. ఓ.టీ.టీ రెస్పాన్స్, ఫ్రాంచైజ్ మరియు రీమేక్‌ అవకాశలతో ఈ సినిమా మరింత విలువను తెచ్చుకుంది. ఓ.టీ.టీ రిలీజ్ తరువాత జీ స్టుడియో వాల్యుయేషన్ లో ఇదోక మంచి ప్రాఫిటబుల్ వెంచుర్ అయ్యింది.

ఒక సినిమా సుక్సెస్ ని కేవలం థియేటర్ నంబర్లతో కొలిచే రోజులు పోయాయి. ఇంపాక్ట్ ఉన్న సినిమా ఏదో విధంగా తన వాల్యూని నిలుపుకునే రోజులొచ్చాయి.

ఈ సినిమా ఫలితంతో నేనూ, హీరో, డిస్ట్రిబ్యూటర్లూ, ప్రొడ్యూసర్లూ, జీ స్టుడియో లో సహా అందరం గర్వంగా సెలెబ్రేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. వేరే కారణాల వల్ల ఈ సినిమాని ఎలాగైనా ఫ్లాఫ్ అనీ డిజాస్తర్ అనీ టాగ్ అంటగట్టాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం బాధలో ఉన్నారు. ఈ రిజల్ట్ తో నేను తెలుసుకున్నదొక్కటే, మెల మెల్లగా నా సినిమాని చూసే ప్రేక్షకుల్ని పెంచుకుంటూ పోవడమే లక్ష్యంగా సినిమాలు తీయాలి అని.

రీమేక్ చేస్తే చెయ్యాల్సిన మార్పులు…(REGRETS AND REMAKES);
రిపబ్లిక్‌ని మళ్ళీ రీమేక్ చేస్తే, ఈ కింది మార్పులతో కధ ఇంకా ఆకట్టుకునే విధంగా ఉంటుందని నా అభిప్రాయం;

1. నేనూ, ఎడిటర్ ప్రవీన్ థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు, క్లైమాక్స్ పాట పూర్తవకుండానే విజువల్స్‌ని లెటర్‌ బాక్సింగ్ చేసి, రోలింగ్ టైటిల్స్ తీసుకు రావడం చాలా పెద్ద తప్పు అనిపించింది. ఆ విజువల్స్‌లో రమ్యకృష్ణ క్యారెక్టర్‌కి ఒక ముగింపు కూడా వుంది. ఇది కధలో చాలా ముఖ్యమైన అంశం. రోలింగ్ టైటిల్స్ ప్రారంభమైన వెంటనే థియేటర్‌లో కూర్చొన్న వారిలో దాదాపు 60 శాతం మంది లేచి వెళ్లిపోతారు. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు దాట కూడదు అని మొండిగా తీసుకున్న నిర్ణయం ఇది. దీని ద్వారా మేము నేర్చుకున్న పాఠం; సినిమా నిడివి ఎంత ముఖ్యమో, ఏ నిమిషాలు ట్రిం చెయ్యాలి, ఏ నిమిషాలు ట్రిం చెయ్యకూడదు అన్న విచక్షణ కూడా అంతే ముఖ్యం.
2. సినిమాలో ఉన్న మొదటి రెండు పాటల్లో సినిమా మూడ్ ని ఎలివేట్ చేసే విధంగా ఆడియో అండ్ విజువల్స్ డిజైన్ చేస్తే ఇంకా బావుంటుంది.
3. మణిరత్నం గారి లాంటి మాస్టర్ ఫిల్మ్ మేకర్స్ ఈ తరహా కంటెంట్‌ని ఎలా అప్రోచ్ చేస్తారో ఆలోచిస్తే, ప్రతి సన్నివేశంలోనూ స్టేజింగ్, బ్లాకింగ్‌ను మరింత ప్రభావవంతంగా చెయ్యొచ్చు.
4. ‘‘వార్ ఆఫ్ ద మాబ్స్”; సినిమా సెకండ్ హాఫ్ లో చెరువు కట్ట మీద జరిగే యుద్ధం చాలా మందికి నచ్చిన సన్నివేశాల్లో ఒకటి. రాజమౌళి గారు లాంటి డైరక్టర్ ఆ సీక్వెన్స్‌ని ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తారో ఆలోచిస్తే, దాన్ని ఇంకా బాగా తీయొచ్చు అనిపిస్తోంది.
5. కంటెంట్ వారీగా డార్విన్ థియరీ సీక్వెన్స్ (సెకండాఫ్‌లో రమ్యకృష్ణ- తేజూ మధ్య వచ్చే సీన్) రిపబ్లిక్ సినిమా మొత్తానికి అయువు పట్టు. ఈ సీన్‌ గురించి చాలా ప్రశంసలు వచ్చినప్పటికీ, విజ్యువల్‌గా, ఇంకా బాగా చిత్రీకరించవచ్చు అనిపిస్తోంది.

జీ 5 లో దర్శకుడి కమెంటరీ వర్షన్ (DIRECTORS COMMENTARY VERSION ON ZEE 5):
ఓటీటీలో దర్శకుడి కామెంటరీతో సినిమా రిలీజ్ చేయమని జీవీ సూచించినప్పుడు అదొక అద్భుతమైన ఐడియా అనిపించింది. రిపబ్లిక్ సినిమాలో అంతర్లీనంగా సూక్ష్మ నైపుణ్యాలు, థీమ్‌లు, లేయర్‌లు వున్నాయి. అవి తొలిసారి చూసినప్పుడు పూర్తిగా అర్ధం కాకపోవచ్చు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లను బట్టి, సినిమా నచ్చిన వాళ్ళు చాలా మంది థియేటర్ లోనే రెండు మూడు సార్లు చూసి అంతే ఇంపాక్ట్ ఫీల్ అవుతున్నారని గ్రహించాం. జనాలు విశ్లేషించుకోడానికి డైరెక్టర్స్ కామెంటరీ వెర్షన్ బాగా ఉపయోగ పడుతుందనిపించింది. అందుకే ప్రేక్షకులకు జీ5 యాప్‌లో రెండు వెర్షన్లు అందుబాటులో ఉంచాం. ఒకటి సినిమా యథాతథంగా, రెండోది దర్శకుడి వ్యాఖ్యానంతో కూడినది. ఇందులో నేను, ఎడిటర్ ప్రవీణ్ కే.ఎల్, స్క్రీన్ ప్లే పార్ట్‌నర్ కిరణ్ కుమార్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ కలిసి ఈ సినిమాలో ఉన్న సూక్ష్మ నైపుణ్యాలు, ఆలోచనా విధానం, కధనాన్ని నడిపే నిర్ణయాలు, షూటింగ్ లో కష్టాల గురించి చర్చించాం. ప్రేక్షకులు దీనిని చూసి ఇంకా లోతైన అనుభూతికి గురవుతారని ఆశిస్తున్నాం.

తదుపరి (NEXT STEPS);
ప్రస్తుతం ఒక కొత్త అయిడియా మీద పని చేస్తున్నాను... స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైంది. ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలని ఆసిస్తున్న ఒక హీరోకి దీన్ని నరేట్ చేద్దామనుకుంటున్నాను. నా దగ్గర మంచి టాలెంట్ ఉన్న రచయితలు, దర్శకుల టీమ్ ఒకటి వుంది. వాళ్ళతో కలిసి ఒక ఓ.టీ.టీ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కించే ఆలోచన ఉంది.

చివరి మాట (END NOTE);
రిబబ్లిక్ సినిమా మనందరిదీ. మనల్నిమనకి పరిచయం చేస్తూ.. ఉన్నతమైన ప్రజా స్వామ్య నిర్మాణానికి మనందరినీ ఏకం చేసే సినిమా. ఒక దృక్కోణానికి, ఒక వ్యక్తికి, ఒక పార్టీకి గుడ్డిగా విధేయత చూపడం ద్వారా మనం బానిసలౌతాం కానీ స్వేచ్ఛా పౌరులం కాము. మన విధేయత లాయల్టీ కేవలం ప్రజాస్వామ్యం విలువలకే పరిమితమవ్వాలి. వ్యక్తులకు, పార్టీలకూ కాదు. అన్నిటి కన్నా ముందు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి..? అది ఎలా పనిచేస్తుంది..? మనం ఏ స్థితిలో వున్నామో అర్ధం చేసుకోవడమే ఒక బానిసకీ బాధ్యత గల పౌరుడికీ ఉన్న తేడా. సినిమా రూపంలో ఈ చర్చ చాలా అవసరం. నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకుంటూ ఒక తటస్థ గొంతుకగా (as a nutral voice) ఈ కధాంశాన్ని మీకు అందించాను. నా తమ్ముడు సాయి తేజ్ ద్వారా ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వేచ్ఛగా వుండి, అందరికీ సమంగా పనిచేసే వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేద్దాం. దయచేసి సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాలను పంచుకోండి. ప్రస్థానం లాగానే రిపబ్లిక్ సినిమా స్క్రీన్‌ ప్లేను కూడా త్వరలో పబ్లిష్ చేస్తాను. త్వరలో మరో కథతో థియేటర్లలో కలుద్దాం.. థాంక్యూ.


english version

INTRODUCTION
On the eve of REPUBLIC landing on Zee5 OTT platform, I would like to take this opportunity to revisit the entire journey of REPUBLIC and retrospect for the record.

THE GENESIS

ll my stories start with a pitch-line and a basic perspective. I keep layering it brick-by brick. “We are living under the illusion that we are a democracy but we are yet to discover it”. That’s the seed of REPUBLIC. I came to that conclusion about our country while writing Autonagar Surya. I know it’s a strong statement but it’s an absolute fact that most of us agree 100%. Who is responsible for this illusion? Who is responsible for this failed state in the name of “democracy”? Is it our lack of understanding or our irresponsible behaviour or our culture of thought?. Our political ambiance is nothing but our culture of thought. Most of the time, we take decisions that are dead against our long-term self-interests. I wanted to explore and expose and debate all these questions thematically in Republic. What is a perfect system? Is it even possible? We cannot expect all human beings to be good natured and rational, for most of the time they are irrational. That quest is REPUBLIC. I should not only talk about the symptoms, disease but I must also talk about a possible close to perfect solution. For this I must define and illustrate a functioning democracy through a particular case. We call that “plot devise” in screenplay terminology. The same plot devise must be used to demonstrate/reflect the present failed scenario wholistically as a metaphor and incriminate everyone (not just the filmy antagonist) responsible for the failure, though I need an antagonist for effective storytelling. If I follow the routine superhero solution in the story, I’m only adding to the problem I want to expose, address, and debate. We have seen many superhero films or rather we are only seeing superhero films. For once I wanted to make a film with a real-life hero, the real-life soldier/martyr who dies defining/protecting the borders of an effective democracy.

“Man’s capacity for justice makes democracy possible, but man’s inclination to injustice makes democracy necessary.” — Reinhold Niebuhr

THE INTENT
We are all fighting for our life. Our breaches and our moralities are all defined by that fight for life. The basic (five or six) needs/desires of 800 Crore people are the same across the world but the paths we choose to fulfil those needs/desires are different from each other. That’s what makes us 800 Crore different characters. What keeps us form becoming violent feudal creatures while fulfilling those needs/desires is law, order, and governance. But at the same time, we are “ONE LIFE”. A “system” draws lines to protect that LIFE…all life. My philosophy of good and evil is simple; whatever is “Pro-Life” is good and whatever is “Anti-Life” is bad. This is explained in the metaphorical Devil Fish sequence in the beginning of the film itself and how it is alluded to the subject as a perspective.

THE RESEARCH
To achieve my goal, I needed to understand effective governance/polity starting from the very genesis of democratic thoughts of Greek philosophers, the first Republic Roman Empire and all the way up to modern scholars like Jayaprakash Narayan. I must understand the “natural law” that unifies environment, life, man, and society to define an orderly governance. An effective understanding of law, order and governance only comes from a deeper understanding of interconnected nature of the very phenomenon called LIFE. I have listened to hundreds of hours of podcasts on Amit Varma’s “The Seen and The Unseen”, read several books all the way from Plato’s Republic, Nietzsche “Thus Spoke Zarathustra” to “How to Win An Indian Election” by Shivam Shankar, “Malevolent Republic” by Kapil Komireddi. The first thing I discovered through my research is that my plot devise must be an environmental issue to have a wholistic view. The most relevant environmental issue I could discover is Kolleru. It’s part of our culture. Since I took it only as a metaphor to the system, I changed the name to “Thelleru” as everything shown in the film about Kolleru is only partly true and rest is fiction. The plot devise provided all the elements needed to layout my themes and disturbances; the common man struggling to make ends meet in which one is killing environment and the other is trying to protect it as both their livelihoods depend on the lake. The first dharma here is to protect that life-source. It brings in a manipulative power thirsty politician, the caste equations, mob mentality, street rowdies, police, civil servants, health officers, doctors, victims, criminals and what not. Everything comes as a package with this plot devise. Based on the researched facts on the issue, I changed the name to “Thelleru” because I needed to fictionalise the story to achieve the impact as my mission is to reflect and define the system, not the lake. The lake is only a metaphor. I first defined the thematic tent poles, chose characters, their backstories, motives with opposite perspectives within that world.

TIMELINES
Though the seed of the story have been there for several years, effectively it took me 4 months to lock the screenplay, 3 months to prep for the film, 64 days of shoot and 3 months of post-production to complete the film.

CASTING
“We are living under the illusion that we have a governance and we are a democracy but we are yet to discover it”. That’s all I needed to utter to Tej one day when we were working out in gym. He latched onto the idea and kept me focussed on it until we realised it as our dream project. If it wasn’t for the strength with which he came after the project, I might have chosen a more light-hearted script as my next venture. I am now very glad that we did Republic. During the first draft of our script, the villain character was called Markandeyulu, a seventy year old career politician. It was Tej who came up with the idea of switching the character into a female. That infused a lot more poetry and meaning to the whole subject during my second draft of writing. The Darwin theory scene was born after making this change. It became the heart of the subject matter. Right from the first draft I couldn’t imagine anyone other than Jagapathi Babu gaaru for Dasaradh’s character (father) who represents the day-in-day out fallen hero within the grind of the current system that “punishes the right and rewards the wrong”. Being a big fan of Aishwarya Rajesh from Kakka Muttai, felt this is the right project to work with her. Most of the rest of the casting we auditioned and finalised. I somehow felt Rahul Ramakrishna can play lot more than a sidekick in films. So wanted to see him as a serious character in the. We feel very happy about our casting choices now.

BEING SINCERE TO THE IDEA
Tej always used to tell me “Sai Dharam Tej is doing Deva Katta’s film and not the other way around”. As I am still chasing that elusive instant theatrical blockbuster in my career, it is easy to side-track and detach from the mood of the story. I have decided if I want to make comedy I will make a comedy film, if I want to have songs, I will make a musical. Let me rather stick to the genre instead of trying offer a buffet like everyone else. My kinds usually fall through those cracks and I have fallen before. Whatever we do must come from our heart. Worst that can happen is even if the film doesn’t become an instant theatrical mass puller, it will bring back the respect I lost after Prasthanam as a sincere filmmaker. So, staying sincere to the idea was our primary goal with this film. We decided to work on a gripping/engaging narrative within those boundaries.

GENERAL AUDIENCE’ VERSUS CLIMAX IMPACT
Right from the ideation phase, myself, Tej, Satish (Creative Producer) and Screenplay partner Kiran knew if we change the last ten minutes of the film it will become a regular commercial film and the movie may do lot a more numbers but will be forgotten in the long run. Even though we may lose the masses with their cultivated taste of watching films, we wanted to serve for those who meet with our sensibilities in theatre as our primary target. Each of those hearts we have won with the film are equal to thousand voices. It’s a “gutsy” film, “brave” film, “experimental” film, “unique” film all this is only possible because we did not have any second thoughts about the last 10 minutes of the film. Many from the film industry suggested that we should have to ended the film on a high note in the tribunal court. That’s their film on a short run but this is our film in the long run.

RECEPTION
The kind of personal messages, calls, tweets, SM postings and comments below every interview within ten days after the release were more in magnitude than what I received for Prasthanam in a year. By the third day we realized those who saw the film were deeply shocked, disrupted, disturbed, and impacted by the film assuring that it will keep growing into our lives just like Prasthanam. I made sure to hit the like button and preserve them on my twitter timeline. Just sharing very few of those moments that I can think of on top of my head.

- A Chennai based Assistant Director who was shooting in Warangal, watched the movie in Tanali on his way back to Chennai, called and wept for half an hour saying that he felt like he is baptized after watching the film. A YouTube comment saying that “I want to do a PhD on this film”.

-Srinivas Kanchibhotla’s ramblings on idlebrain.com quoting “Dev Katta's "#Republic" is not merely a movie; it is a social treatise about the systemic malaise. Outstanding!”; http://idlebrain.com/research/ramblings/republic.html

-Journalist Murthy gaaru’s comment: “సమాజానికి తన నగ్నత్వాన్ని తనకే పబ్లిక్ గా చూపించిన నిలువుటద్దం ఈ రిపబ్లిక్. సెల్యులాయిడ్ తో నిగ్గదీసి అడిగాడు సిగ్గులేని జనాన్ని…అగ్గితోటి కడిగాడు సమాజ జీవఛ్ఛవాన్ని”

-Ganesh Ravuri’s tweet stating “Films like #Republic are very rare. Brutally honest and hardhitting. @IamSaiDharamTej's earnest performance and @devakatta's sincere approach makes it a must watch.”

- Our West Godavari distributor calling and saying that he distributes all the big, budgeted films and he is immensely proud to have REPUBLIC in his catalogue even if he loses some money on it.

- Apart from public and freelancers, all the print media reviews like Indian Express, The Hindu, Times of India and Hindustan Times. Jeevi’s review headline “A brave experiment”

IMPACT OF POLITICS ON THE FILM
Yes I do have to confess that the movie became a political target having nothing to do with the ongoing politics. It’s rather about the disease at the roots of our democracy and not about parties or persons. Those who watched the film have owned it that way beyond personal political affiliations. The ruling party supporters alienated the film thinking that it’s against them because the tone of the film is anti-establishment. In that tone whoever is in power would tend to view it that way. They have decided to hate the film without watching it. I’m sure they will regret if they watch it now. Pawan Kalyan gaaru wanted to exhibit the spirit of the film by voicing his thoughts on various issues on the stage. That entire speech turned into a war of personal attacks and an indirect attack on the film. On the other hand, the opposition party thought as if it as Janasena agenda and distanced themselves. Many industry friends called me and appreciated the film deeply but were scared to voice it on social media due to this noise. I thank those whoever voiced for the film strongly despite this unfair polarisation of neutral voices. It’s a very dangerous symptom of the very disease our democracy is currently suffering. I’m sure watching on OTT everyone will realize our film didn’t deserve that alienation or hatred during its theatrical run.

FINANCIALS AND FOOTFALLS
The movie took off with a very strong Word Of Mouth, but we wish it translated into more footfalls in theatres. I disagree with some critics branding our film as “only for intellectuals” and not for masses etc. Someone who owns a tyre shop in a small town put up a video vouching/explaining the film better than many intellectuals. I’m wondering if someone can explain the footfalls in the following cases; A couple of 100 Cr films with unanimously raved reviews couldn’t draw 4-5 Cr share in theatres with all languages put together but a couple of totally rejected films by critics with a completely outdated masala content posts better numbers than these lauded 100 Cr films. A recent Telugu film with a very good Word Of Mouth doesn’t even post one fifth of the numbers of what a slap stick comedy posted. People rushed to theatres for half-baked films with bad Word Of Mouth and came out with complaints. Which rating system can explain this phenomenon? Are most audience only looking for celebrative movies in theatres even if there are half-baked and outdated? Are they waiting for content films only on OTT? I don’t know and I don’t think anyone knows. I wish we rather stick to evaluating the intent and impact of every film instead of trying to catch this “22”. One thing is sure in our case, if we weren’t politically isolated by a section, I wouldn’t even be having this section in this article. One can only aim to make a “good” film and not a “bad” film. We succeeded in that and we will forever celebrate that. I also don’t need those filmmakers discouraging me from making clean films and encouraging me to make comedies like my debut Vennela etc. etc. I would only listen to those filmmakers who can make clean films and advise me on how to connect with wider audience with such films. All said and done, for the budget within which we made the film, the producers made close to a double-digit Cr before release. Though the distributors were short by 4.5 Cr, taking the producers profit into account, we are still 5-6 Cr ahead overall. I’m hoping Zee will realize more value through remakes as we go forward.

REGRETS AND REMAKES
If I’m given an opportunity to remake Republic these are the only things I would change to protect the integrity of the subject:

- Post release while watching the movie in theatre, both myself and editor Praveen felt that the biggest blunder we made is bringing in rolling titles by letterboxing the climax song visuals. There is a closure to Ramya’s character as well in those visuals. 60% of the theatre obviously get up and walk out as soon as the rolling titles starts. This decision was taken to keep the movie length strictly around 2hrs30 minutes. The lesson is…sometimes it’s not only about those minutes we save, but it is also about those we keep

- Will approach the first two songs of the film differently. Would make them more integral with the mood of the film throughout. I have been thinking a lot about how the master filmmakers like Mani Rathnam approach the same content.

-Would approach the staging and blocking of every scene more effectively.

- Though it is one of the most favourite scenes for many, there is a lot more untapped cinematic energy in the “war of the mobs” sequence - the lake battle in the second half of the film. I’m wondering how magnificently Rajamouli gaaru would have conceived and shot that sequence.

- Though content wise the Darwin theory sequence (Ramya and Tej encounter in the second half) is the heart of the film and widely lauded, visually, and aesthetically it can be shot much better.

DIRECTOR’S COMMENTARY VERSION ON ZEE 5
When Jeevi suggested to release a version of the film with Director’s Commentary on OTT it struck as a brilliant idea to me. Yes the movie does have a lot of nuances, themes and layers that may not sink fully on first watch. After reading many social media postings where some people have seen in it 2 or 3 times in theatres and discovering newer details, we felt they deserve a Director’s Commentary version to analyse. The viewers will have two versions available on Zee5 app. One, movie as is, two, movie with Director’s Commentary where I was discussing the nuances, thought process, decisions, shoot challenges etc. along with my Editor Praveen KL, Screenplay partner Kiran Kumar and Creative Producer Satish BKR. You deserve this effort from us and hope you enjoy it.

NEXT STEPS
Currently working on a very exciting new idea which is almost ready in full shape. Will soon be pitching it to a hero with whom I’ve been dreaming to work with for a long time. I have a very sensible team of writers and director aspirants with whom I would like to venture into OTT project in parallel once the movie project gets on track.

END NOTE
The film belongs to all of us, reflects all of us and unifies us all. By being blindly loyal to one perspective, one person or a party, we are only living as slave “subjects”, not free “citizens”. Our only loyalty should be to protect the core values of democracy. For that we need to understand what democracy is, how it functions and what state are we at this point. This debate was necessary on film medium and I am so glad that I had this opportunity to educate myself and present it to you as a neutral voice. Let’s be free and work towards building a system that works for all. Please share your thoughts after watching the film. Will soon publish REPUBLIC screenplay just like what I did for Prasthanam. Thank you and see you soon in theatres with another story.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved