
Brahmanandam is going to play the title role of Gajadonga. Muhurat of this film was organized in Ramanaidu studios today morning. Chaitanya and Prakruti are playing lead roles. Marudhuri Raja pens the dialogues. It is about how a thief helps two loves to unite.U Srinivas produces it and RS Suresh is the director.
బ్రహ్మానందం, చైతన్య, ప్రకృతి ముఖ్య పాత్రలు పోషిస్తూ, భవాని మూవీస్ బ్యానర్ పై యు.శ్రీనివాసరావు నిర్మిస్తున్న 'గజదొంగ' చిత్ర ప్రారంభోత్సవం ఈరోజు రామానాయుడు స్టూడియోలో జరిగింది . ఆర్ ఎస్ సురేష్ ఈ చిత్రాని కి దర్శకుడు. పూజా కార్యక్రమాల అనంతరం వైజాగ్ సత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, మరుధూరి రాజా కెమెరా స్విచ్ ఆన్ చేసారు, సురేష్ దర్శకత్వంలో తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు .అనంతరం
దర్శకుడు సురేష్ మాట్లాడుతూ...
దర్శకుడిగా నాకిది మొదటి చిత్రం. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీ రోల్ పోషిస్తున్నారు. కామెడి నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుంది.ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది . 3 షెడ్యుల్లో సినిమాని పూర్తిచేస్తాము అని అన్నారు .
నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ .....
బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్ నారాయణ వంటి ఆర్టిస్టులతో ఓ కామెడి సినిమా చేయాలనేది నా కోరిక , ఆ కోరికను ఈ గజదొంగ చిత్రం ద్వారా తీర్చుకుంటునాను. గజదొంగ గా బ్రహ్మానందం నటిస్తున్నారు. ఆయన చుట్టూ ఈ కధ తిరుగుతుంది . మా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు .
నటి ప్రకృతి మాట్లాడుతూ....
నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకిది రెండవ చిత్రం. ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
మాటల రచయిత మరుధూరి రాజా .....
చిన్న సినిమాలకు పని చేయడం, ప్రోత్సహించడం అంటే నాకు ఎంతో ఇష్టం. ఇద్దరు ప్రేమికులు ఒక్కటి అవ్వడానికి గజదొంగ ఏవిదంగా సహాయ పడ్డడనేది ఈ చిత్ర కధాంశం. రెండున్నర గంటలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే చిత్రం ఇది అని అన్నారు .
ఈ చిత్ర కథానాయకుడు చైతన్య ఈ సినిమాలో అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసారు.
నటీనటులు మరియు సాంకేతికనిపుణులు.....
బ్రహ్మానందం, చైతన్య, ప్రకృతి , జీవా, ధనరాజ్ , రఘుబాబు , అలీ, కొండవలస, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కధ : శ్రీనివాస్ డి , మాటలు:మరుధూరి రాజా, కెమెరా: రాహుల్ , ఎడిటింగ్: ఉపేంద్ర , నిర్మాత: యు శ్రీనివాస్, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఆర్ ఎస్ సురేష్.