
మగమహారాజు , స్వాతి ముత్యం , సిరివెన్నెల , సితార , అన్వేషణ, మహర్షి వంటి అద్భుతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన ఎం. వి, రఘు తొలిసారి 'కళ్ళు ' అనే చిత్రం తో తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమయ్యారు. మహాశక్తి బ్యానర్ పై శివాజీ రాజా నటించిన ఈ చిత్రం 1988 విడుదలయింది. ఆ రోజుల్లో 6 సెంటర్ లలో 100రోజులు పూర్తి చేసుకున్న చిత్రమిది. ఈ నెల 23 తేదికి ఈ చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శక రత్న దాసరి నారాయణరావు . మురళి మోహన్ , తమ్మారెడ్డి భరధ్వాజ, శివాజీ రాజా, ఎం.వి రఘు, తనికెళ్ళ భరణి , బిక్షు, కళ్ళు చిదంబరం , గుండు హనుమంతరావు, ఉత్తేజ్, రాజేశ్వరి, ఆర్ నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ ...
గొల్లపూడి గారి కళ్ళు అనే నాటిక చూసి అద్భుతంగా ఉంది సినిమా తీస్తే భావుటుంది అనుకొనే వాడ్ని. ఆ నాటికకు చాలా అవార్డ్ లు కూడా వచ్చాయి. అలాంటి నాటికను రఘు అద్భుతమైన సినిమాగా రూపుదిద్దారు. చాలా మందిని ఎంపిక చేసి అందులో ఎక్కువ మందిని కొత్త వారిని ప్రోత్సహించారు. ఈ చిత్రానికి నంది అవార్డ్ లను వశం. చేసుకుంది. మంచి కథలతో సినిమాలను తీస్తే సమాజానికి ఉపయోగ పడతాయి. విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర బృందానికి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్మి అన్నారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ...
కమర్షియల్ చిత్రాల తరహాలో కళ్ళు చిత్రం నాకు బాగా నచ్చింది. మన చిత్ర పరిశ్రమకి మంచిగుర్తుగా మిగిలిపోయింది ఈ చిత్రం అని అన్నారు.
తమ్మా రెడ్డి భరద్వాజా.మాట్లాడుతూ...
కె. విశ్వనాధ్, దాసరి నారాయణ రావు గార్ల తరువాత ఆ రోజుల్లో రఘు తీసిన ఈ చిత్రానికి అవార్డ్ లు రావడం విశేషం. సామజిక భాధ్యత కలిగిన చిత్రమిది. ఈ టీంకి నా అభినందనలు తెలుపుతున్నాను అని అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ...
నాకు ఈ సినిమా ద్వార ఆర్టిస్ట్ గా నిలబడే అవకాశం కల్పించిన రఘు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ...
నాటకీయ కావ్యంగా రఘు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు చాల భావుంది. ఆ రోజుల్లో 6 సెంటర్లలో 100 రోజులు ఆడిన చిత్రమిది. తెలుగు వారి సృజనాత్మకతను చాటి చెప్పే చిత్రమిది అని అన్నారు.
దర్శకుడు ఎం. వి రఘు మాట్లాడుతూ ...
కళ్ళు ఉంది మనసుతో చూడలేని వారు గుడ్డి వారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీయడానికి పూనుకున్నాను. మగమహారాజు , స్వాతి ముత్యం , సిరివెన్నెల , సితార , అన్వేషణ, మహర్షి చిత్రాలకు కెమెరా మాన్ గా అనుభవం ఉన్న నేను దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందని అలోచించి ఈ సినిమా చేశాను. ఇందులో క్యారెక్టర్ల కోసం చాల మందిని చూడాల్సి వచ్చింది. ఒక తపస్సు లాగా ఈ సినిమా చేసాము. అలాగే తెలుగు సినిమాకి మంచి పేరు తేవాలని కృషితో ఈ సినిమా చేసాం. సీతారామ శాస్త్రి గారు అద్భుతమైన పాటలు రాసారు .అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ జనరేషన్ కి కూడా నాదొక విన్నపం అప్పుడప్పుడు 'కళ్ళు' వంటి చిత్రాలు కూడా తీస్తే మంచిదని నా ఉద్దేశం. నేటి దర్శకులకు నా మాటగా చెబుతున్నాను . నా సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేస్కోవడం చాలా ఆనందం గా ఉంది అని అన్నారు.
దాసరి నారాయణ రావు మాట్లాడుతూ ...
స్వర్ణ యుగాన్ని చుసిన వాళ్ళంతా పై స్థాయిలను చూడాలి కానీ దాని కన్నా కింద స్థాయిని చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఈ వేడుకను చేసుకోవడం చాలా ఆనందం గా ఉంది . ఒక కెమెరా మెన్ దర్శకుడిగా చేసిన చిత్రమిది. అందరు కొత్త వలతో చేసిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ రోజు 25సంవత్సరాల పండుగ చేసుకోక పోతే రఘు ఎవరనేది తెలిసేది కాదు. నాకు బాగా నచ్చిన నాటిక ఇది. నేను తీయాలనుకున్నాను. ఈ సినిమాను.అప్పటికే రామానాయుడు గారు రైట్స్ కొన్నారు. ఆయన తీసుకున్నారని తెలిసి నా ప్రయత్నం మానుకొన్నాను .కొత్త వాళ్ళతో సినిమా తీయాలనే ఆలోచన రఘుకి రావడం అభినందనీయం.అప్పట్లోనే నేను అనుకొన్నాను. రఘు చేసిన ప్రయత్నం పలితాన్నిస్తుందని. దర్శకుడుకి ఉండాల్సిన లక్షణాలన్ని రఘు కి ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లందరికి నా అభినందనలు తెలుపుతున్నాను అని అన్నారు.