|

మాధవన్, భావన నటీనటులుగా తమిళంలో హిట్ అయిన ఓ చిత్రాన్ని 'ప్రేమనిలయంగా' బేబీ అక్షయ శ్రీ సమర్పణలో కల్పన క్రియేషన్స్ మరియు మ్యాజిక్ లాజిక్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి తెలుగులోకి అనువదిస్తున్నారు. సీమాన్ ఈ చిత్ర దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్ర ఆడియో విడుదల ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది .ఈ కార్యక్రమానికి ఆతిధులుగా సాగర్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సూర్య కిరణ్, అశోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
ప్రసన్న కుమార్ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని సాగర్ గారికి ఇచ్చారు. అనంతరం
సాగర్ మాట్లాడుతూ....
మహేశ్వర రెడ్డి మంచి సినిమాను ఎన్నుకుని తెలుగులోకి డబ్బింగ్ చేస్తునారు. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో అమెరికాను వదిలి మన దేశానికి వచ్చారు.
నీకోసం అనే సినిమాతో చాల మందిని మన పరిశ్రమకు పరిచయం చేసారు. మళ్లీ చాల గ్యాప్ తర్వాత ఈ సినిమాను చేస్తున్నారు. మాధవన్ కి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా అతనికి అభిమానులున్నారు. ప్రేమ నిలయం సినిమా సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ....
ప్రేమ పేరుతో వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అదే విధంగా ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి నిర్మాతకి మంచి సంపద కలగాలని కోరుకుంటూనాను. అలాగే ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులకు ఆర్టిస్ట్ లకు నా అభినందలు తెలుపుతున్నాను అని అన్నారు.
అశోక్ కుమార్ మాట్లాడుతూ...
మంచి సినిమాలు తీయాలని మహేశ్వర రెడ్డి మన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మాధవన్ తమిళ హీరో అయినప్పటికీ మన తెలుగు పరిశ్రమకు చాల కావాల్సిన వ్యక్తి. ఈ మధ్య వచ్చిన అన్ని సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి. అదే తరహ లో ఈ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
సహ నిర్మాత భారతి గణేష్ మాట్లాడుతూ...
ప్రేమ నిలయం చాలా మంచి చిత్రం. ఫ్యామిలీ, సెంటిమెంట్ తో కూడిన ఫీల్ గుడ్ మూవీ ఇది. మాధవన్ కి తమిళ మార్కెట్ పెంచిన చిత్రమిది. దర్శకుడు సీమన్ క్లారిటీ గల వ్యక్తి. యువన్ శంకర్ రాజా సంగీతం గురించి చెప్పనవసరం లేదు. అద్భుతమైన మ్యూజిక్ నిచ్చాడు. తమిళ్ లో పెద్ద హిట్ అయిన సినిమా ఇది. తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని ఆశిస్తునాను అని అన్నారు.
నిర్మాత మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ...
ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా చేస్తున్నాను. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు మరియు ఈ చిత్ర బృందం సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
|