|
వెరా ఫిలిం కార్పోరేషన్ బ్యానర్ పై తనీష్ తషు కౌషిక్, రమ్య నంబీశాన్ నటీనటులుగా ఓ.ఎస్. అవినాష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తెలుగబ్బాయి'. ఎస్ కలై వాణి సమర్పణలో ఎస్ రామకృష్ణ నిర్మిస్తున్నారు. మేజ్జో జోసెఫ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి నాగబాబు, గజల్ శ్రీనివాస్ , కవిత, లోహిత్ మరియు ఈ చిత్ర బృందం హాజరయ్యారు. నాగబాబు ఆడియో సీడీలను ఆవిష్కరించి చిత్ర బృందానికి సీడీలను అందించారు. అనంతరం
నాగబాబు మాట్లాడుతూ....
కథకు తగ్గ టైటిల్ ఈ చిత్రానికి పెట్టారు. ఈ సినిమాలో నేనొక మంచి పాత్ర చేశాను. సినిమాని దర్శకుడు చిత్రీకరించిన తీరు నాకు బాగా నచ్చింది, తనీష్ ఎనర్జీ తో నటించాడు. జోసెప్ ఇచ్చిన మ్యూజిక్ రియల్లీ ఫెంటాస్టిక్. పాటలు, సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
తనీష్ మాట్లాడుతూ...
విదేశాలకు వెళ్తే మన తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మలేషియా ఉంటున్నఓ తెలుగు ఫామిలీలో నడిచే ప్రేమ కథ ఇది. దర్శకుడు కథ చెప్పిన విధంగానే సినిమాని రూపుదిద్దారు. సాంగ్స్ , మ్యూజిక్ బాగా కుదిరాయి. సూపర్ మ్యూజిక్ ని ఇచ్చిన జోసెప్ కి నా థాంక్స్ . నా కెరియర్ కి ఒక స్టయిలిష్ మూవీ ఈ సినిమా అవుతుంది అని అన్నారు.
దర్శకుడు అవినాష్ మాట్లాడుతూ...
గజల్ శ్రీనివాస్ గారు రాసిన పాటను విని దాని ఆధారంగా ఈ సినిమాకు ఈ పేరును పెట్టాము. మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ తెలుగు ప్రేమ కథ ఇది. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టొరీగా తెలుగబ్బాయిని రూపొందించాము. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. తనీష్ లుక్స్ , తషు గ్లామర్ , కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉంటాయి. ముఖ్యంగా మా సంగీత దర్శకుడికి చాలా థాంక్స్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చినందుకు. సినిమా హిట్ అయ్యి మా అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అలాగే నన్ను ప్రోత్సహించిన మా నిర్మాతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.
హీరోయిన్ తషు కౌషిక్ మాట్లాడుతూ...
తెలుగబ్బాయి మంచి సబ్జెక్టు ఉన్న సినిమా.నాకు ఈ సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందం గా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
లిరిసిస్ట్ నివాస్ మాట్లాడుతూ...
చాలా సినిమాలకు నేను పాటలు రాసాను. సింగిల్ కార్డ్ గా రాయడం ఇదే మొదటి సారి. ఈ సినిమాలో 8 సాంగ్స్ , 3బిట్ సాంగ్స్ ఉన్నాయి. కథ డిమాండ్ కొరకు 11 పాటలు పెట్టాల్సి వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు అని అన్నారు.
నిర్మాత ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ...
మంచి తీయాలనే కోరికతో నేను ఇండస్ట్రీ లోకి వచ్చాను. అవినాష్ మంచి కథ తో నన్ను మెప్పించాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినమా తీసాము. ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తునందుకు నాకు చాలా ఆనందం గా ఉంది. ఈ సినిమా మా బ్యానర్ కి మంచి పేరు తెస్తుంది అని అన్నారు.
సంగీత దర్శకుడు జోసెప్ అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సినిమా సక్సెస్ కావాలని అభిలషించారు. |