|
హీరో వరుణ్ సందేశ్ పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు లక్ష్మన్ సినీ విజన్స్ యూనిట్ సమక్షంలో జరిగాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ నిర్మించే ప్రొడక్షన్ నెంబర్ 2 లో వరుణ్ కధానాయకుడు. హరి ప్రియ కధానాయిక. కోనేటి శ్రీను ఈ చిత్ర దర్శకుడు. మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విశేషాలను వరుణ్ పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో తెలిపారు. ఈ కార్యక్రమం లో చిత్ర నిర్మాత లక్ష్మన్ కేధారి, బెక్కం వేణు గోపాల్, రైటర్ సాయి కృష్ణ, కోనేరు శ్రీను తదితరులు పాల్గొని వరుణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ...
నిర్మాత లక్ష్మన్ కేధారి మాట్లాడుతూ ...
మా హీరోకి జన్మదిన వేడుకను మా యూనిట్ సమక్షం లో జరుపుకోవడం చాలా ఆనందం గా ఉంది. మా సినిమా మొదటి షెడ్యుల్ పూర్తయింది. సినిమా బాగా వస్తుంది అని అన్నారు.
దర్శకుడు కోనేరు శ్రీను మాట్లాడుతూ ... .
ఈ రోజు మా హీరో వరుణ్ పుట్టిన రోజు వేడుక మా అందరి సమక్షంలో జరుపుకోవడం చాల అనందం గా ఉంది .రెండు రోజుల్లో రెండవ షెడ్యుల్ మొదలవుతుంది. నాకు సహకరిస్తున్ననా టీమ్ కు, నటీనటులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు .
బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ ...
లక్ష్మన్ కి మొదటి చిత్రం మేం వయసుకి వచ్చాం. పెద్ద హిట్ అయింది. లక్ష్మన్ నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త జోనర్ చిత్రం. వరుణ్ కి మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది అని అన్నారు .
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ...
నా 18 సంవత్సరం నుంచి ప్రతి పుట్టిన రోజును నేను చిత్ర పరిశ్రమలోనే జరుపుకుంటున్నాను. చాలా ఆనందం గా ఉంది. లక్ష్మన్ సినీ విజన్స్ బ్యానర్ లో నేను చేస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ సబ్జెక్టు. మా దర్శకుడు పని చేయించుకొనే తీరు నాకు బాగా నచ్చింది. హీరోయిన్ హరి ప్రియ చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా కన్నా ముందు నీలకంట గారి దర్శకత్వంలో రూపొందుతున్న 'చమ్మకు చల్లో ' మరియు 'ట్విస్ట్' చిత్రాలు విడుదలవుతాయి. అందరి సపోర్ట్ నాకు కావాలి అని అన్నారు .
|