|

ఈగ చిత్రంలో బిందు(సమంత) వర్క్ చేసిన ప్రాజెక్ట్ 511 సంస్థను మేము క్రియేట్ చేసింది కాదు. నిజ జీవితం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కొందరు నిర్వహిస్తున్న ఓ సంస్థ అది. సొసైటికి ఉపయోగపడే కాన్సెప్ట్ అని ఈగ చిత్రంలోవాడాము. ఈ సంస్థ దాదాపు 511 స్కూల్స్ ను ఎంపిక చేసుకొని ఆ స్కూల్స్ కి కావాల్సిన సదుపాయాలను కొందరు ఇచ్చే డొనేషన్స్ తో కల్పిస్తుంది. మా ఈగ చిత్రం లాభాల బాటలో ఉంటే మేము ఈ సంస్థకి ఆర్ధికంగా సహాయ పడదామనుకున్నాము. మా నిర్మాతల అంగీకారం మేరకు ఈ సంస్థకు ఇరవై రెండు లక్షల రూపాయలను మేము అందుస్తున్నాము.అలాగే రోటరీ క్లబ్ వారు కూడా కొంత మొతాన్నిఇస్తున్నారు అని ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ సంస్థ తో మేము అసోసియేట్ అయినందుకు మా ఈగ టీం కి చాల ఆనందంగా ఉంది అని అన్నారు.
ప్రాజెక్ట్ కన్వీనర్ సునీల్ మాట్లాడుతూ...
2004 లో మేము ఈ సంస్థని ప్రారంభించాము. కనీస వసతులు లేని 511 స్కూల్ లను మేము భాద్యతగ తీసుకొని ఈ సంస్థను నడుపుతున్నాము. ఈ సంస్థలో భాగమైన విద్యా సంస్థలకు అవసరమయ్యే వాహనాల భాధ్యతలో భాగంగా ఈగ టీం మాకు సహకరించినందుకు చాల ఆనందం గా ఉంది. రాజమౌళి గారు ఈగ సినిమా కన్నా ముందు నుంచే మా సంస్థకు తన సలహా, సహాయాలను అందిస్తునారు. ప్రైవేటు స్కూల్స్తో తో సమానంగా మా సంస్థలను రూపుదిద్దాలని మా ఆశ. మాకు సహకరించాలనుకొనే ఎవరైనా మా వెబ్ సైట్ ను చూసి మమ్మ్మలిని సంప్రదించగలరు అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డి .సురేష్ బాబు, సాయి కొర్రపాటి మరియు ప్రాజెక్ట్ 511 సభ్యులు పాల్గొన్నారు.
For more info visit www.project511.org


|