Idlebrain.Com
home
audio
movie
celeb
box-office
research
nostolgia
usa special
bollywood
hyd scene


Kevvu Keka film launch
అల్లరి నరేష్ హీరో గా 'కెవ్వు కేక' ప్రారంభం
Home > News > Functions
Hyderabad
25 July 2012
Follow Us

అల్లరి నరేష్ హీరోగా దేవి ప్రసాద్ దర్శకత్వం లో రూపొందబోయే 'కెవ్వు కేక' చిత్ర షూటింగ్ ప్రారంభం ఈ రోజు రామానాయుడు స్టూడియో లోజరిగింది. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ నివ్వగా , కె.ఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దేవి ప్రసాద్ దర్శకత్వంలో తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. అనంతరం

అల్లరి నరేష్ మాట్లాడుతూ ...
బ్లేడ్ బాబ్జి దేవి దర్శకత్వం లో చేశాను సూపర్ హిట్ అయింది. మాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. సతీష్, దేవి,నేనుకలిస్తేఅదితప్పకుండహిట్టే
. బ్లేడ్ బాబ్జిని మించి కామెడి చేయాలని రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్ తయారు చేసారు.గబ్బర్ సింగ్ ఆడియో విడుదల టైములో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసారు. ఈ సినిమాలో కామెడి కేక పుట్టించే విధంగా ఉంటుంది అని అన్నారు.

దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ....
కెవ్వు కేక ఒక కామెడి క్లబ్ లా ఉంటుంది. బ్లేడ్ బాబ్జి హిట్ తో సినిమాలపై భాద్యత పెరిగింది . ఆ సినిమా కన్నా రెండింతలు కామెడి ఈ సినిమాలో ఉంటుంది.టైటిల్ అదిరిందని అందరు అంటున్నారు ప్రేక్షకుల ఆశీస్సులుమాకు కావాలి అని అన్నారు.

వేగేశ్న సతీష్ మాట్లాడుతూ...
'పేకలోనుంచి కేక రావాలి, కేక నుంచి పేక రాకూడదు, కేకంటూ పెడితే మనమే పెట్టాలి,అది కెవ్వు కేక కావాలి అన్నది మన ఫిలాసఫీ అనే డైలాగు తో తొలి సన్నివేశాన్ని చిత్రికరించాము.స్క్రిప్ట్ బాగా వచ్చింది మంచి సినమా అవుతుంది అని అన్నారు.

నిర్మాత చంద్ర శేఖర్ మాట్లాడుతూ...
సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.అక్టోబర్ , నవంబర్ లలో మరో షెడ్యుల్ కోసం బ్యాంకాక్ వెళ్తాము. ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు ఫుల్ గా నవ్వించేలా ఈ చిత్రముంటుంది అని అన్నారు.

సాంకేతిక నిపుణులు:
ఈ చిత్రానికి కథ-మాటలు: సతీష్ వేగేశ్న, ఆర్ట్:కె.వి రమణ, ఎడిటర్:నందమూరి హరి, ఫోటోగ్రఫి:విజయ్ కుమార్ , మ్యూజిక్ :రాజ్-శివ, బీమ్స్, చిన్ని చరణ్, స్టోరి-స్క్రీన్ ప్లే -దర్శకత్వం: దేవి ప్రసాద్.

Photo Gallery (photos by G Narasaiah)
emailabout usprivacy policycopy rightsidle stuff