Idlebrain.Com
home
audio
movie
celeb
box-office
research
nostolgia
usa special
bollywood
hyd scene


Oka college story music launch
Home > News > Functions
Hyderabad
26 July 2012
Follow Us

శ్రావణ్, మోనాల్ గజ్జార్ నటీనటులుగా టి. ప్రభాకర్ దర్శకత్వంలో లైం లైట్ సినిమా బ్యానర్ పై టి. రాజారాం రెడ్డి, కిరణ్ తోటలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఒక కాలేజ్ స్టొరీ'. దర్శకుడే ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా సమకూర్చారు .ఈ చిత్ర ఆడియో విడుదల ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. దాసరి నారాయణ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, సాగర్, ఎర్రబెల్లి దయాకరరావు(టి డి పి), మధుర శ్రీధర్, ప్రసన్నకుమార్ తదితరుల తో పాటు ఈ చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు.

దాసరి నారాయణ రావు ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి సీడిని యెర్రబెల్లి దయాకర రావు (టి డి పి) కి ఇచ్చారు అనంతరం

దాసరి నారాయణ రావు మాట్లాడుతూ ...
ఇలాంటి పరిస్తితులలో సినిమా ని తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతను అభినందిచాలి .ఈ రోజు అత్యదిక ధియేటర్ల లో విడుదల చేసి మూడు రోజులోనే డబ్బు గుంజాలని చూస్తున్నారు. మంచి సినిమాలను తీసే సమర్ధులు ఉన్నారు. చూసే ప్రేక్షకులు ఉన్నారు. వీరి మద్యలో ఒక గోడ ఉంది ,ఆ గోడను ప్రేక్షకులే తొలగించాలి. ప్రభాకర్ తీసిన "బతుకమ్మ" చిత్రం అంటే నాకు చాల ఇష్టం, ఆ సినిమాని ఒక దృశ్య కావ్యంలా మలిచాడు, అలాంటి చిత్రాన్ని తీసిన ప్రభాకర్ కాలేజీ స్టొరీ చిత్రాన్ని తీసాడని విన్నాక చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఆతను తీసిన సినిమాలో ఒక మంచి సందేశం ఉంటుంది .రేగింగ్ మీద తీసాడని విన్నాను, ఇది మంచి కాన్సెప్ట్. నేటి యువత ఇలాంటి చిత్రాన్ని తప్పకుండ చూడాలి.ఈ సినిమా విజయవంతం కావాలని అని అన్నారు.

హీరో శ్రావణ్ మాట్లాడుతూ ..
మంచి లవ్ స్టొరీగా ఈ చిత్రం రూపుదిద్దబడింది. పాటలు అన్ని బాగా వచ్చాయి. సినిమా విజయవంతమై మా అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ ....
ప్రభాకర్ గారు కష్టపడే మనస్తత్వం గల వారు. మంచి సందేశాత్మక సినిమాలు తీస్తారు. ఈ చిత్రం లో పాటలన్నీ బాగున్నాయి.ఈ సినిమా హిట్టయి ఈ సినిమాకు పని చేసిన అందరికి మంచి పేరు రావాలి అని అన్నారు.

దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ...
గతంలో నేను కీరవాణి, కోటి గార్ల దగ్గర పని చేశాను.ఆ అనుభవం తోనే ఈ సినిమాకు నేనే సంగీతాన్ని సమకూర్చాను.నాకు సహకరించిన నా టీం కు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.

నిర్మాత తోట కిరణ్ మాట్లాడుతూ...
సినిమా చాలా బాగా వచ్చింది.రెండు బాషలలో ఈ చిత్రాన్ని రూపుదిద్దాము. ఆగస్ట్ రెండో వారంలో సినిమాని విడుదల చేస్తాము అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ...
ప్రభాకర్ తీసే ప్రతి సినిమా లో ఓ కొత్త దనం చూపిస్తూ చేయడం గొప్ప విషయం.ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే మంచి నిర్మాతలు మన పరిశ్రమకి వస్తారు అని అన్నారు.

emailabout usprivacy policycopy rightsidle stuff