Idlebrain.Com
home
audio
movie
celeb
box-office
research
nostolgia
usa special
bollywood
hyd scene


OKOK Telugu on August 10
ఓకే ఓకే పాటల ప్రదర్శన ....
ఆగస్ట్ 10 న విడుదల
Home > News > Functions
Hyderabad
25 July 2012
Follow Us

ఉధయనిధి స్టాలిన్, హన్సికలు నటీనటులుగా ఎం రాజేష్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై హిట్ అయిన ఓ చిత్రాన్ని 'ఓకే ఓకే' పేరుతో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్, గణేష్ బాబులు తెలుగులోకి అనువదిస్తున్నారు. హరీస్ జై రాజ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర పాటల ప్రదర్శన ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంకొండ సురేష్, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్ లు పాల్గొన్నారు.

చంద్రబోస్ మాట్లాడుతూ....
వేసవి సెలవుల్లో చెన్నై వెళ్ళినపుడు ఈ సినిమా చూసాను. చాలా భావుంది. ఆరోగ్యకరమైన హాస్య చిత్రం, అలాగే మంచి ప్రేమకథా చిత్రం. తెలుగులో ఈ సినిమాకు పాటలు రాసే అవకాశం ఇచ్చిన సురేష్ గారికి నా కృతజ్ఞతలు . సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...
ఈ సినిమాకు నేనొక పాట రాశాను.సందర్భానుసారంగా ఆ పాట ఉంటుంది. హారిస్ అద్భుతమైన మ్యూజిక్, శశాంక్ మాటలు అలరించే విధంగా ఉంటాయి. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...
ఇటీవలే విడుదలయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హారిస్ తనదైన శైలిలో సూపర్ మ్యూజిక్ ఇచ్చారు.సంతానం క్యారెక్టర్ చాలా భావుంటుంది. అలాగే ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్ లకు సునీల్,రఘుబాబు ,ఆహుతి ప్రసాద్ లు డబ్బింగ్ చెప్పారు. ఓకే ఓకే సినిమాని ఆగస్ట్ 10 వ తేదిన విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
తెలిపారు.

 

emailabout usprivacy policycopy rightsidle stuff