|

నూతన నటీనటులు నవీన్ చంద్ర, రాహుల్, లావణ్యలు ప్రముఖ పాత్రల్లో హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అందాల రాక్షసి'. వారాహి చలనచిత్రం పతాకం పై సాయి కొర్రపాటి మరియు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాదన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర విడుదల విశేషాలను ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, రాజమౌళి , సాయి కొర్రపాటి, దర్శకుడు హను లు పాల్గొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ....
ఒక నెల క్రితం ఈ సినిమా పాటలు, ప్రోమోస్ విడుదలయాయి. ప్రోమోస్ చూసి చాల మంది ప్రేక్షకుల్లో క్యురియసిటీ పెరిగింది. ఆ ప్రేక్షకుల్లో నేను ఒకడిని. ఒక రోజు సాయి నాదగ్గరకొచ్చి సినిమా తీస్కోమని అడగకుండా సినిమా చూడమన్నాడు. చూసాను చాల సెన్సిబుల్ సబ్జెక్టు. నాకు బాగా నచ్చింది. అందరూ కొత్త వారితో తీసినప్పటికీ అలాంటి ఫీల్ ఎక్కడా కలగలేదు. దర్శకుడు మంచి ప్రతిభావంతుడని నాకు అర్థమయింది. ఈ సినిమా మొత్తం ఎస్.వి.సి సి ద్వారా నేనే విడుదల చేస్తునాన్ను. ఆగస్ట్ 10 వ తేదిన 'అందాల రాక్షసి' విడుదల ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ...
హనుమంతు ఈ కథను చాలా ప్రేమించి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మొదటి నుంచి నేను భాగస్వామిని కాదు. ఈ సినిమా కి బాగస్వామిని కావడానికి మూడు కారణాలు. ఒకటి ఎయిడ్స్ మీద హను తీసిన ఒక షార్ట్ ఫిలిం కారణం . అందులోని ఎమోషన్స్ నన్ను ముగ్దుడ్ని చేసాయి. సినిమాని బాగా తీసుంటాడని గట్టి నమ్మకం కలిగింది. మరో కారణం సాయి గారు. ఈగ కథ ఆయనకి చెప్పినపుడు అందులోని ఎమోషన్స్ ని ఆయన బాగా గ్రహించి నన్ను ప్రోత్సహించారు. మూడవ కారణం..మనం డబ్బు పెడితే మళ్లీ మన డబ్బు మనకు వస్తుంది అనేలా ఈ కథ ఉంది. నిర్మాత గా నా పేరు తొలిసారి తెర మీద చూసుకోబోతునందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మంచి హిట్ అయి హనుమంతు కి మంచి పేరు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సాయి కొర్రపాటి, దర్శకుడు హను సినిమా సక్సెస్ కావాలని అభిలాషించారు. |