Idlebrain.Com
home
audio
movie
celeb
box-office
research
nostolgia
usa special
bollywood
hyd scene


Devudu Chesina Manushulu releasing on 15 August
Home > News > Functions
Hyderabad
23 July 2012
Follow Us

Puri Jagan’s latest film Devudu Chesna Manushulu is all set to release on 15 August. Here are the details of press meet -

Novel screenplay and nice treatment - Puri Jagan
Puri Jagan said, “The final copy was ready long back. We had been waiting for the release eagerly like the audiences. The movie release got postponed due to other film releases. DCM has turned out to be a very good film. It is little different from the films I have done in the past. Screenplay of the film is novel and treatment is going to be a highlight. We have chosen an old title like DCM for variety. You will realize the suitability of the title after watching the movie.”

My character does settlements - Ravi Teja
Ravi Teja said, “I am doing the role of a guy who does settlements for living. It is a complete entertainer and 100% family oriented movie. Prakash Raj’s role in amazing. The producer is a gentleman. Raghu Kunche got fame with the album of DCM”

You will laugh at least 20 times - Raghu Kunche
Raghu Kunche said, “Since there is a huge gap between the film and music release, the songs have reached the public and got very popular. DCM songs are featured in South India’s top 10 songs list. DCM music will promote my career as music director. The audiences will laugh at least 20 times while watching DCM film.”

Bhaskarabhatla expressed his satisfaction over working for this movie.

రవితేజ, ఇలియానా నటీనటులుగా పూరి జగనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఎస్ వి సి సి బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రఘు కుంచె సంగీతాన్ని సమకూర్చారు. ఆగస్ట్ 15 విడుదల కానున్న ఈ చిత్ర విశేషాల గురించి ఈ చిత్ర బృందం ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. రవితేజ , పూరి జగనాథ్, రఘు కుంచె , భాస్కర భట్ల , భోగవల్లి ప్రసాద్ గాబ్రిఎల్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ...
'కథ లేని కథ ఉన్న చిత్రమిది. ఫుల్ కామెడితో ప్రేక్షకులను రెండు గంటలు నవ్విస్తుంది. మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. ఆగస్ట్ 15 న మా సినిమాను విడుదల చేస్తున్నాము. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

పూరి జగనాథ్ మాట్లాడుతూ...
సినిమా మొత్తం రెడీ అయ్యి చాల రోజులయింది . విడుదల కోసం ప్రేక్షకులలానే మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఇతర సినిమాల వలన విడుదల కొంచెం లేట్ అయింది . సినిమా చాల బాగా వచ్చింది. రవితేజ, నా పాత చిత్రాల కన్నా ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలను మించి ఈ చిత్రముంటుంది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. సినిమా ట్రీట్ మెంట్ ఒక హైలెట్ గా ఉంటుంది. వెరైటి కోసం ఈ పాత టైటిల్ ను పెట్టాము. ఈ టైటిల్ కరెక్టా కదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది అని అన్నారు .

రవి తేజ మాట్లాడుతూ ...
ఇందులో సెటిల్ మెంట్స్ చేసే క్యారెక్టర్ నాది. రెండు గంటల పాటు ఫుల్ గా నవ్వించేలా ఈ సినిమా ఉంటుంది . 100 శాతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది . మా నిర్మాత చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా ఆడియో సక్సెస్ తో రఘు కి మంచి పేరు వచ్చింది. ప్రకాష్ రాజ్ పాత్ర అత్యద్భుతంగా ఉంటుంది అని అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ...
ఆడియో విడుదల అయిన తరువాత సినిమా విడుదలకు 40రోజులు గ్యాప్ రావడం ఈ సినిమా పాటలు ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి . సౌత్ ఇండియా టాప్ టెన్ సాంగ్స్ లో బా సినిమా ఆరు పాటలు ఉండటం చాలా ఆనందంగా ఉంది . నా మ్యూజిక్ కెరియర్ కి ఈ సినిమా ప్రమోషన్ గా భావిస్తున్నాను. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు కనీసం 20 సార్లు నవ్వుకొనేల ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.

భాస్కర భట్ల మాట్లాడుతూ...
రవితేజ, పూరిల కాంబినేషన్ లో నేను చాలా ఎక్కువ పాటలు రాసాను. ఈ సినిమా నాకో బంపర్ ఆఫర్ లా భావిస్తున్నాను .భోగవల్లి ప్రసాద్ గారితో మొదటి సారి పని చేశాను. చాలా సౌకర్యం గల నిర్మాత. ఆయనతో పని చేయడం హ్యాపీ గా ఉంది అని అన్నారు.

గాబ్రియల్ మాట్లాడుతూ ...
దేవుడు చేసిన మనుషులు టీం నాకు బాగా నచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్ అని అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)
emailabout usprivacy policycopy rightsidle stuff