ది డ్రీమ్ కంపెనీ బ్యానర్ పై బి.గోపాల్ సమర్పణలో భరత్ పారేపల్లి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇష్టసఖి'. ఓ ప్రేమ కావ్యం అనేది ఉప శీర్షిక. వరుణ్, శ్రీ రామ్, భాస్కర్ మరియు అనుస్మృతిలు నటీనటులు. లలిత్ సురేష్ సంగీతాన్నిఅందిస్తునారు. ఇటీవలే హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబందించిన పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక నిర్మాత భరత్ మాట్లాడుతూ....
ఒక అమ్మాయి చుట్టూ తిరిగే ముగ్గురు అబ్బాయిల ప్రేమ కథ ఇది. అంత కొత్త నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. విలన్ గా మధు భాయ్ నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో తిరుమలరావు నటిస్తున్నారు. ఈ షెడ్యుల్లో ఓ పాట సహా రెండు పోరాట సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వరకు విశాక, అరకు మరియు పాడేరులో సాగే షూటింగ్ తో సినిమా పూర్తవుతుంది. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేసి, అక్టోబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధు భాయ్, తిరుమలరావు, వరుణ్, శ్రీ రామ్ మరియు అనుస్మృతిలు సినిమాలో అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రం సక్సెస్ కావాలని అభిలాషించారు.
అజయ్ , బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి కెమెరా: శంకర్ కంతేటి, ఎడిటింగ్:బి కృష్ణంరాజు, ఆర్ట్ :భాస్కర్, పాటలు: మూర్తి, మాటలు:మరుధూరి రాజా, కథ -కథనం-నిర్మాత-దర్శకత్వం:భరత్ పారేపల్లి.్సెస్ కావాలని ఆకాంక్షించారు.