Idlebrain.Com
home
audio
movie
celeb
box-office
research
nostolgia
usa special
bollywood
hyd scene


Onamalu releasing on 27 July - a press meet
Home > News > Functions
Hyderabad
24 July 2012
Follow Us

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా, కళ్యాణి కథానాయికగా సన్ షైన్ సినిమాస్ పతాకంపై కె. దుర్గా దేవి సమర్పణలో రూపొందిన చిత్రం 'ఓనమాలు'. మంచి జ్ఞాపకం లాంటి సినిమా అనేది ఉప శీర్షిక. క్రాంతిమాధవ్ ఈ చిత్ర దర్శకుడు. ఈ చిత్ర విడుదల,తదితర విషయాలను ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ , చలపతిరావు, క్రాంతిమాధవ్, ఖదీర్ బాబు మరియు తమ్ముడు సత్యం పాల్గొన్నారు.

జీవితాంతం గుండెల్లో దాచుకునే చిత్రం ఓనమాలు ..........డా. రాజేంద్ర ప్రసాద్
నటుడిగా 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్ననేను నవరసాలోను ప్రేక్షకులకు కనిపించాను. అలాగే నన్ను ఆదరించారు.ఇప్పటి వరకు ఈ అవకాశాల్ని నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు, రచయితలకు నా ధన్యవాదాలు. 35 సంవత్సరాలు సినీ కెరియర్ ఉన్న నాతో క్రాంతిమాధవ్ మల్లి నా చేత ఓనమాలు ఈ చిత్రం ద్వార దిద్దించాడు. టేస్ట్ ఉన్న దర్శక నిర్మాత క్రాంతి. ఆ నలుగురు తరువాత నాకో మంచి చిత్రాన్ని క్రాంతి ఇచ్చాడు. నాకు అదృష్టం గా దొరికిన కథ ఈ ఓనమాలు . ఓ మంచి సినిమాను తీయాలనే తపనతో క్రాంతి మన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. మనకు తల్లి ప్రాణం పోస్తే , తండ్రి మనకు అండగా నిలుస్తాడు. గురువు దశా, దిశలను నేర్పుతాడు. ఆ అద్భుతమైన గురువు గురించి తెలిపే చిత్రమే ఈ ఓనమాలు .ఈ సినిమాని మనసు తో చూసిన ప్రతి ఒక్కరికి పుట్టిన ఊరు, మన కన్నా తల్లి ఒడి, బాంధవ్యాలు, ఆప్యాయతలు మన నిజమైన జీవితాలు గుర్తొస్తాయి. ఈ బిజీ ప్రపంచంలో మనం ఏం కోల్పోతున్నామో మనకు ఈ సినిమా తెలుపుతుంది. నేను అనేకమైన సినిమాల్లో నటించాను. అవన్నీ ఒక ఎతైతే, ఈ సినిమా మరొక ఎత్తు. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో అమ్మ ఒడి వెచ్చదనం నా కళ్ళ ముందు మెదిలింది.తమ్ముడు సత్యం కథకు ఖదీర్ బాబు రాసిన మాటలు, కోటి అందించిన సంగీతం సిరివెన్నెల సాహిత్యం ఎంత అద్భుతమో మాటల్లో చెప్పలేను. మంచి మనసుతో, మంచి కథను సినిమాగా రూపుదిద్దాం. ఈ నెల 27 న అచ్చమైన తెలుగు సినిమాతో మీ ముందుకు రాభోతున్నాం ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు,

చలపతిరావు మాట్లాడుతూ...
ఒక హీరో చెయ్యి ఎత్తిత్తే పది మంది నెల కూలే కమర్షియల్ సినిమాలోస్తున్న ఈ రోజుల్లో చక్కని నేటివిటితో మనసును కదిలించే కథతో అద్భుతంగా రూపొందిన చిత్రమే ఈ ఓనమాలు. రాజేంద్ర ప్రసాద్ సినీ జీవితంలో మరో పెద్ద మెట్టును ఓనమాలు ఎక్కిస్తుంది. ప్రతి సన్నివేశం మనసును కదిలించేలా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ చిత్రం ఇది. ఎటువంటి లాబియింగ్ లు లేకుండా అవార్డులను నిర్ణయిస్తే అన్ని అవార్డ్ లు ఈ సినిమాకే వస్తాయి అని అన్నారు.

ఖదీర్ బాబు మాట్లాడుతూ...
మొదటి సారి ఈ సినిమాకు మాటలు రాశాను. ఒక రైటర్ రాసిన బలమైన మాటలు గొప్ప నటులు చెప్తేనే వాటికి వంద శాతం న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. నేను రాసిన మాటలు నటకిరీటి నోట పలకడం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఉద్ద్వేగ పూరితమైన మాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ఓనమాలు అనే సినిమా భవిష్యత్ లో మన ఇంట్లో పెద బాలశిక్షలా ఉపయోగ పడుతుందని నమ్మకం గా చెప్పగలను అని అన్నారు.

క్రాంతిమాధవ్ మాట్లాడుతూ ...
ఓనమాలు ఒక అచ్చమైన తెలుగు సినిమా.ఈ కథ కోసం దాదాపు 11 నెలలు కష్టపడి పని చేసాము. ఈ కథకు కరెక్ట్ అయిన నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన్నుంచి ఎన్నో నేర్చుకున్నాను. నాకు సహకరించిన తముడు సత్యం గారికి, అద్భుతమైన మాటలను ఇచ్చిన ఖదీర్ గారికి, హరి అనుమోలు గారికి నా ధన్యవాదాలు తెలుపు తున్నాను. నా ఈ తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
శక నిర్మాతలకు నా థాంక్స్ అని అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)
emailabout usprivacy policycopy rightsidle stuff