|

పద్మ శ్రీ మోహన్ బాబు సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మి ప్రసన్న నిర్మించిన చిత్రం ఊ ..కొడతార ఉలిక్కిపడతారా . నందమూరి బాలకృష్ణ , మనోజ్, దీక్షసేత్ నటీనటులు. శేఖర్ రాజ దర్శకత్వం వహించారు. బోబో శశి సంగీతాన్ని అందించారు. ఈ నెల 27 న విడుదల కానున్న, ఈ చిత్ర విశేషాలు మరియు పైరసీ సంబందిత విశేషాలను చిత్ర సమర్పకులు డా.మోహన్ బాబు ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.
మోహన్ బాబు మాట్లాడుతూ...
నా కూతురు సాహసం చేసి తీసిన ఊ ..కొడతార ఉలిక్కిపడతారా సినిమాను దాదాపు పది సార్లు చూసాను. చాల అద్భుతం గా శేఖర్ రాజా తీర్చిదిద్దాడు. అ క్రెడిట్ అంత కూడా అతనికి దక్కుతుంది .మనోజ్ ఈ కథను తను భుజాల పై వేసుకుని మోసాడు. బాలయ్య అద్భుతమైన పాత్రను పోషించాడు. ప్రతి ఫ్రేం ఉలిక్కి పడేలా ఉంది. నాతో పాటు ఈ సినిమాను చుసిన తమిళ , కన్నడ దర్శకులు నా కూతుర్ని ఈ టీంని అభినందిస్తుంటే చాలా ఆనందపడ్డాను. మనోజ్ కి ఈ సినిమాతో స్టార్ డం తప్పని సరిగా వస్తుంది . ఈ నెల 27 న విడుదల కానున్న ఈ చిత్రాన్ని చూసి నా బిడ్డలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
పైరసీ గురించి మోహన్ బాబు మాట్లాడుతూ...
ఎంతో డబ్బుఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఒక్క సినిమా వల్ల 250 కుటుంభాలు బ్రతుకుతున్నాయి. అలాంటి తెలుగు పరిశ్రమను పట్టి పీడిస్తున్న మహమ్మారి ఈ పైరసీ.ఈ పైరసీ నిర్మాతను చంపుతుంది. పంపిణి దారులే పైరసీ లు చేస్తుంటే ఇక మనం ఎం చేయాలి. మన పరిశ్రమ కూడా అన్ని చూసి చూడనట్లు వదిలేస్తుంది. 'యధా రాజా తధా ప్రజా' అన్నట్లు మన పరిశ్రమ వ్యవహరిస్తుంది. ప్రతి నిర్మాత సినిమా విడుదల ముందు తగిన జాగ్రతలు తీస్కోవాలి. ప్రేక్షకులు దర్జాగా సినిమా హాల్ కెళ్ళి సినిమా చూడండి. పైరసీని ప్రోత్సహించకండి. నిర్మాతను బ్రతికించండి.మన చిత్ర పరిశ్రమను కాపాడండి.
అలాగే పైరసీ చేసిన వారి వివరాలను మాకు తెలియజేసిన వారికి పెళ్లి కాకుండా అర్హులైన వారికి నా విద్యా సంస్థలలో మంచి ఉద్యోగం ఇస్తాను. పెళ్లి అయిన వారికి పిల్లలుంటే ఇంజనీరింగ్ ఉచితం గా చదివిస్తాను. అదే కూలీలు మాకు సహకరిస్తే 50000 రూపాయలు బహుమతి ఇస్తాము అని అన్నారు.
లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ...
మా సినిమా అన్ని ప్రింట్ల మీద గల వాటర్ మార్కింగ్ సహాయం తో ఎక్కడ పైరసీ జరిగినా టైం తో సహా తెలిసే విధంగా అన్ని జాగ్రతలు తీస్కున్నాము. అబిమానులకు ప్రేక్షకులకు మా విన్నపం ఒకటే దయ చేసి పైరసీని ప్రోత్సహించకండి.మేం కష్టపడి తీసిన ఈ సినిమా ఆదరించండి అని అన్నారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న గజల్ శ్రీనివాస్ పైరసీ నిర్ములనపై రాసిన ఒక పాటను వినిపించారు.ఇంకా ఈ కార్యక్రమం లో మనోజ్ , శేఖర్ రాజాలు పాల్గొన్నారు.
|