|

జి.వి.కే ఆర్ట్స్ పతాకంపై జి.విజయ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం యమహో యమ:. జితేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి, సాయి రామ్ శంకర్, పార్వతి మెల్టన్ లు నటీనటులు. మహతి సంగీతాన్ని అందిస్తున్నారు. పబ్లిసిటీ లో బాగంగా తొమ్మిది సంవత్సరాల బేబి స్ఫూర్తి పాడిన 'టాకీస్ టాకీస్' అన్బే ఐటం సాంగ్ ను ఇంటర్ నెట్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీహరి, సాయి రామ్ శంకర్, జితేంద్ర , నిర్మాత విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ హరి మాట్లాడుతూ...
యమహో యమ: నా కెరియర్ కి ఒక ఆల్బంలా దాచుకొనే సినిమా అవుతుంది. మన తెలుగు సినిమాల్లో ఎంతో మంది ప్రముకులు యముడి వేషాలు వేసారు. అలాంటి ఓ మంచి పాత్రను నేనీ సినిమాలో చేశాను. యముడ్ని అమెరిక తీస్కేలిన ఘనత చిత్ర దర్శకుడు జితేంద్ర కే దక్కుతుంది. ఈ పాత్ర చేసినందుకు నేను చాలాగర్వం గా ఫీల్ అవుతున్నాను. సినిమా హిట్ అయ్యి మా అందరికి మంచి పేరుతో పాటు నిర్మాతకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ..
ప్రమోషన్లో భాగంగా మేము ఈ రోజు యు ట్యూబ్ లో ఓ ఐటంసాంగ్ ను విడుదల చేసాము. 9 ఏళ్ళ స్ఫూర్తి ఈ పాటను పాడింది. మహతి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా బాగా వస్తోంది. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తునాము. అని అన్నారు.
నిర్మాత విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ...
ఆర్టిస్ట్ ల సహకారంతో కొన్ని అవాంతరాలు కలిగినప్పటికీ టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. అమెరిక యూనివర్సెల్ స్టూడియోలో చాలా తక్కువ సమయంలో షూట్ చేసాము. మాకు సహకరించిన శ్రీహరి గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెండు పాటల చిత్రీకరణ ఉంది. ఆగస్ట్ 20 నుంచి 25 లోపు ఆడియో విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్లో విడుదల చేస్తాము అని అన్నారు.
దర్శకుడు జితేంద్ర మాట్లాడుతూ...
ఈ సినిమా తొందరగా పూర్తవడానికి శ్రీహరి గారు చాలాసహకరించారు. అలాగే మా హీరో సాయి రామ్ శంకర్ కూడా. మహతి ఇచ్చిన మ్యూజిక్సి అద్భుతం. ఈ సినిమా తర్వాత మహతి మంచి సంగీత దర్శకుడిగా పేరు పొందుతాడు. సినిమా బాగా వచ్చింది. నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్ గారికి నా థాంక్స్ అని అన్నారు.
సాంకేతిక నిపుణులు...
ఈ చిత్రానికి కెమెరా:ఆర్.జనార్ధన్, ఎడిటింగ్ :మార్తాండ్ కె.వెంకటేష్, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: మహతి, పైట్స్ :రామ్- లక్ష్మణ్, పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, కాసర్ల శ్యాం, ఆర్ట్: సాయి మణి, నిర్మాత:జి.విజయ్ కుమార్ గౌడ్ . కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం:జితేంద్ర.వై . |