|

పద్మశ్రీ మోహన్ బాబు సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మి ప్రసన్న నిర్మించిన చిత్రం
ఊ ..కొడతార ఉలిక్కిపడతారా. నందమూరి బాలకృష్ణ, పంచిబోర, మనోజ్, దీక్షసేత్ లు నటీనటులు. శేఖర్ రాజా దర్శకత్వం వహించారు. బోబో శశి సంగీతాన్నిఅందించారు.
రేపు విడుదలకానున్నఈ చిత్ర బృందం ఎయిర్ టెల్ గెట్ లక్కీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇనార్బిట్ మాల్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆడియన్స్ మధ్య సందడి చేసారు. ఈ చిత్ర ట్రైలర్స్ ను ప్రదర్శించారు. ఈ చిత్రంలోని డైలాగులను చెప్పిన ఆడియన్స్ కి పంచిబోర, మనోజ్, దీక్షసేత్ లు ఆటోగ్రాఫ్ చేసిన షర్టులను మరియు ఈ చిత్ర పాటల సీడీలను బహుకరించారు.
అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లాష్ మొబ్ లో ఆడియన్స్ తో పాటు ఈ చిత్ర బృందం కూడా ఆడి,పాడి సందడి చేసారు.
లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ...
మేం ఎంతో కష్టపడి తీసిన చిత్రమిది. వరల్డ్ వైడ్ గా రేపు విడుదల అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దయ చేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని అన్నారు.
బాలయ్యతో నటించడం మీకెలా అనిపించింది?
మనోజ్: చిన్నప్పటి నుంచి అయన మాకు పరిచయం ఉన్నప్పటికీ ఎక్కడో కొంచెం భయం. చివరికి ఆయనిచ్చిన సపోర్ట్ తో షూటింగ్ అంతా సజావుగా జరిగింది.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
మనోజ్: కిరాక్ ఉంటుంది. అది తెర పైనే చూడాలి.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?
దేవుడు దయ తలచినప్పుడు అంటూ మనోజ్ సమాదానమిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచిబోర,దీక్షసేత్ లు సినిమా సక్సెస్ కావాలని అభిలాషించారు.




|