pizza
RX 100 25 days celebrations
`కార్తికేయ` 25 డేస్ సెల‌బ్రేష‌న్స్
You are at idlebrain.com > News > Functions
Follow Us


6 August 2018
Hyderabad

KCW బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన చిత్రం `RX 100`. ఈ చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. An Incredible Love Story అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక పాత్రధారులు. సోమ‌వారం ఈ సినిమా 25 డేస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా..

నిర్మాత సురేశ్ మాట్లాడుతూ - ``చిన్న సినిమాల స‌క్సెస్ ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌సరం. శివం సెల్యూలాయిడ్స్ ద్వారా ఇంత మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

రావు ర‌మేశ్ మాట్లాడుతూ - ``ఏనుగు చ‌చ్చినా వెయ్యే.. బ్ర‌తికినా వెయ్యే అనేలా అమితాబ్‌గారు గ్యాప్ తీసుకుని సినిమా చేసిన‌ప్పుడు.. చిరంజీవిగారు గ్యాప్ తీసుకుని సినిమా చేసిన‌ప్పుడు ఓ ఉప్పెన‌లా ఉంటుంది. అది కొంద‌రికే చెల్లుబాటే అవుతుంది. ఆర్ ఎక్స్ 100 బైక్ మా ఇంట్లో కూడా ఉండేది. అలా దాదాపు అంద‌రి లైఫ్‌ల‌ను ఈ బైక్ ట‌చ్ చేసింద‌నే చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో ఇంత ఎక్కువ మాట్లాడిన‌.. ఎక్కువ డిస్ట్ర‌బ్ చేసిన సినిమా ఇదే. ఓ ర‌కంగా ఇండ‌స్ట్రీకి అసూయ‌ను క్రియేట్ చేసిన సినిమా. భ‌విష్య‌త్‌లో దీన్ని బేస్ చేసుకుని క‌థ‌ల‌ను త‌యారు చేస్తారు. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అయిన ఈ సినిమాలో నేను భాగం కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ - ``సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసినప్పుడు ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని మేం ఎవ‌రం ఊహించ‌లేదు. ఈరోజుల్లో 25 రోజులు సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ కావ‌డం అంటే 250 రోజుల‌తో స‌మానం. 4వ వారంలో సినిమా 70-80 థియేట‌ర్స్‌లో ర‌న్ అవుతుంది. 25-30 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. ఇది మా జీవితాన్ని మార్చేసింది. మేం ఎవ‌రికీ తెలియ‌దు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. కానీ ఇంత పెద్ద స‌క్సెస్ కొట్ట‌డం గురించి అంద‌రూ మాట్లాడుతున్నారు. రాబోయే కాలంలో కొత్త సినిమాల‌కు ఆర్ ఎక్స్ 100 బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. పేరు, డ‌బ్బుల కంటే గొప్ప‌గా స్నేహితుల‌ను ఇచ్చిన సినిమా`` అన్నారు.

అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ - ``స‌క్సెస్ స్వీట్ అని అంటుంటారు. కానీ మా స‌క్సెస్ మాత్రం హాట్‌. హిట్ అవుతుంద‌నుకున్నాం కానీ.. ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌నుకోలేదు. నెక్స్‌ట్ వీక్ సినిమా ఉండొచ్చు, ఉండ‌క‌పోవ‌చ్చు కాబ‌ట్టి.. యూత్ మ‌రోసారి సినిమా చూడాల‌ని కోరుకుంటున్నాను. ప్ర‌తి ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్‌కి పేరు పేరునా థాంక్స్‌`` అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``సాధార‌ణంగా బ‌య‌ట సినిమాలు చేసే చిన్న నిర్మాత‌ల‌ను బ‌య‌టివారు థియేట‌ర్స్ దొర‌క‌వు.. ఇద్ద‌రి ముగ్గురు చేతిలోనే థియేట‌ర్స్ ఉంటాయ‌ని అంటుంటారు. కానీ అందంతా త‌ప్ప‌ని ఈ సినిమాతో రుజువైంది. దిల్‌రాజు స‌హా అంద‌రూ మాకు స‌పోర్ట్ చేశారు. ఎవ‌రైనా కొత్తవాళ్లు ఇండ‌స్ట్రీలోకి వ‌స్తున్నప్పుడు బ‌య‌టివాళ్లు చెప్పే చెత్త మాట‌ల‌ను వినొద్దు. మూవీలో కంటెంట్ ఉంటే అంద‌రూ స‌పోర్ట్ చేస్తారు. హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది కానీ.. హిట్ వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలియ‌దు. నాకు మంచి గుర్తింపు దొరుకుతుంది. మా కుటుంబ స‌భ్యులు అంద‌రూ వీడు ఏమైపోతాడో అనుకున్నారు.. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. అజ‌య్‌గారితో భ‌విష్య‌త్‌లో మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నాను. ఆయ‌న ఆలోచ‌న మ‌న ఆలోచ‌న‌ల‌కు దూరంగా ఉంటుంది. ఆయ‌న బ్రెయిన్‌పై డాక్ట‌రేట్ చేయాల‌నుంటుంది. అజ‌య్‌, ఆర్ ఎక్స్ 100 ఎప్పుడూ నా గుండెలో నిలిచిపోతుంది`` అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఇది డైరెక్ట‌ర్ ఫిలిం. కార్తికేయ కూడా డైరెక్ట‌ర్ అడిగింది చేసిచ్చాడు. సినిమాను రెండు రాష్ట్రాల్లో విడుద‌ల చేశాను`` అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved