మురళీ మోహన్ మాట్లాడుతూ - ``సాయినాథునిపై పాటలు ఎప్పుడు విన్న బాగానే ఉంటాయి. శ్రీనివాస్ బోని, పార్వతినాయుడు చేసిన ఈ ప్రయత్నం చాలా బావుంది. నరేన్ చక్కని సంగీతాన్ని అందించారు. మంచి సాహిత్యంతో స్వరసుందర్ పాటలను చక్కగా రాశారు. నేను 350 సినిమాలకు పైగా నటించిన నటుడినే ఓ వ్యక్తి నన్ను ఓ సందర్బంలో కలిసి సాయిబాబాపై వేటూరిగారు రాసిన పాటను బాలుగారు ఆరగంట పాటు పాడారని, ఆ పాటలో నన్ను సాయిబాబా భక్తుడిగా నటించమని అన్నారు. నేను కూడా నిజమైన భక్తుడిలా కనిపించాలని, ఒక నెల రోజులు గడువు టైం కావాలని చెప్పి, ఏ మేకప్ లేకుండా గడ్డం పెంచి తర్వాత నటించాను. ఆ పాట ఇప్పటికీ టీవీ చానెల్స్‌లో వస్తుంటుంది. అంత పెద్ద పాటను రెండు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశామంటే కారణం సాయిబాబానే అని నేను భావిస్తుంటాను. ఆ పాట విన్నవారందరూ ఆ పాటలో నేను బాగా చేశానని మెచ్చుకోవడం విన్నప్పుడంతా, నాకు సంతోషంగా ఉంటుంది. `పిలిచినా పలుకుతావనీ..`ఆల్బమ్ చేసిన అందరికీ నచ్చే పాటలతో చక్కగా ఉంది. ఈ నిర్మాతలు భవిష్యత్‌లో మరిన్ని మంచి ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ - ``పిలిచినా పలుకుతావనీ` పాటలు చాలా బావున్నాయి. నిర్మాతలు శ్రీనివాస్, పార్వతినాయుడు, సంగీత దర్శకుడు నరేన్‌లకు నా అభినందనలు`` అన్నారు.
అనిల్ చంద్ర మాట్లాడుతూ - ``దేవుడి భక్తిని ఇలా తెలిపిన నిర్మాతలకు మంచి భవిష్యత్ ఉంటుంది. నరేన్ చాలా మంచి సంగీతం అందించాడు`` అన్నారు.
ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, డా.జయంతిరెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనఱ్ సుదాన్ష్ తదితరులు పాల్గొన్నారు.