pizza
100 Days of Love music launch
`100 డేస్ ఆఫ్ ల‌వ్‌` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 July 2016
Hyderabad

దుల్క‌ర్ స‌ల్మాన్‌, నిత్యామీన‌న్ జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ చిత్రాన్ని తెలుగులో `100 డేస్ ఆఫ్ ల‌వ్‌` పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఎస్ ఎస్ సీ మూవీస్ స‌మ‌ర్ఫ‌ణ‌లో ఎస్‌. వెంక‌ట్ ర‌త్నం నిర్మిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ విడుద‌ల చేస్తోంది. జీన‌స్ మొహ్మ‌ద్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో బుధ‌వారం రాత్రి జ‌రిగింది. నితిన్ సీడీల‌ను విడుద‌ల చేసి నానికి అందించారు. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌లయ్యాయి.

ఈ కార్య‌క్ర‌మంలో సుధాక‌ర్ రెడ్డి, జెమిని సురేశ్‌, క్రాంతి మాధ‌వ్‌, గాంధీ మేర్ల‌పాక‌, కె.పి.చౌద‌రి, ఏషియ‌న్ సినిమాస్ సునీల్‌, యామినీ భాస్క‌ర్‌, అన్నేర‌వి, అడ‌వి శేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నితిన్ మాట్లాడుతూ ``నిత్యామీన‌న్‌తో క‌లిసి ఇప్ప‌టికి రెండు సినిమాలు చేశాను. నాని కూడా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు నిత్యామీన‌న్ పెద్ద స్టార్ రేంజ్‌కి ఎదిగింది. మేం ముగ్గురం క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని ఉంది. అది కూడా వెంక‌ట్‌కే చేయాల‌ని ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ నుంచి డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఇప్పుడు ఈ సినిమా నిర్మాత స్థాయికి ఎదిగాడు వెంక‌ట్‌. త‌న‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.

నాని మాట్లాడుతూ ``నిత్యా గురించి ఎవ‌రు ఎక్క‌డ మాట్లాడినా నాకు గ‌ర్వంగా ఉంటుంది. త‌ను మా `అలా మొద‌లైంది` సినిమాతో తెలుగులో కెరీర్‌ని మొద‌లుపెట్టింది. ఈ సినిమా మ‌ల‌యాళ ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్పుడు చూశాను. చాలా క్యూట్‌గా అనిపించింది. స‌బ్ టైటిల్స్ తో చూద్దామ‌ని అనుకున్నా. ఇప్పుడు తెలుగులో హాయిగా చూడొచ్చు. సినిమా సంగీతం బావుంది. ద‌ర్శ‌కుడు చిన్న‌వాడైనా చాలా కొత్త‌గా తెర‌కెక్కించార‌నిపిస్తోంది. నిత్యా, నేను, నితిన్ క‌లిసి ఓ సినిమా చేస్తే నిజంగానే చాలా బావుంటుంది`` అని తెలిపారు.

Glam galleries from the event

నిత్యామీన‌న్ మాట్లాడుతూ ``ఈ సినిమాను ఫ్రెండ్లీగా చేశాను. ఈ సినిమా టీమ్ అంతా నాకు మంచి ఫ్రెండ్స్. తెలుగు ఆడియ‌న్స్ కి ఈ చిత్రం చాలా కొత్త‌గా ఉంటుంది. క‌ల‌ర్స్, సెట్స్, షాట్స్, మ్యూజిక్ ఇలా ప్ర‌తిదీ చాలా వైవిధ్యంగా ఆలోచించి చేశాం. హాలీవుడ్ స్థాయిలో ఉంటుందీ సినిమా. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. వెంక‌ట్‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఇందులో హృద‌యం అనే పాట నాకు చాలా ఇష్టం. పాట‌లు మ‌ల‌యాళంలో క‌న్నా తెలుగులో ఇంకా బాగా ఉన్నాయి`` అని చెప్పారు.

కృష్ణ‌చైతన్య మాట్లాడుతూ ``నాకు డ‌బ్బింగ్ పాట‌లు రాయాలంటే చాలా భ‌యం. ఆ ఫ్లేవ‌ర్ ఎక్క‌డ ప‌డిపోతుందోన‌ని భ‌య‌ప‌డుతాను. ఈ సినిమాకు మ‌రింత కేర్ తీసుకుని రాశాను`` అని చెప్పారు.

అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ మాట్లాడుతూ ``ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లోనూ మేం విడుద‌ల చేస్తున్నాం`` అని తెలిపారు.

దామోద‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``వెంక‌ట్ ఈ సినిమా చేస్తున్నాన‌ని చెప్పిన‌ప్పుడు ప్రొడ‌క్ష‌న్ ఎందుక‌ని న‌చ్చ‌జెప్పాను. ఈ సినిమాతో ఏదో ఒక‌టి నిర్ణ‌యించుకుంటాన‌ని చెప్పాడు`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మొహ్మ‌ద్ మాట్లాడుతూ ``తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నిత్య ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది`` అని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు యూనిట్ సభ్యులను అభినందించారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved