pizza
Aame Evaru music launch
‘ఆమె ఎవరు...?’ ఆడియో విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

23 March 2016
Hyderabad

ఆర్తీ అగర్వాల్, అనీల్ కల్యాణ్ , మిత్ర, ఎమ్మెస్ నారాయణ ప్రధాన తారాగణంగా శ్రీ సాయిదుర్గ చిత్రాలయ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘ఆమె ఎవరు..?’. రమేష్ ముగడ దర్శకత్వంలో వీరగణేష్ కర్రి, లక్ష్మీ సరోజ ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.చిన్ని కృష్ణ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో సీడీలను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. తొలి సీడీని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందుకున్నారు. ఈ సందర్భంగా..

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘’ప్రొడ్యూసర్ వీరగణేష్ కర్రిగారు చాలా కష్టపడి దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి సినిమాను నిర్మించారు. కానీ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సినిమా నిర్మాణ రంగంలో అవగాహన అవసరం. అవగాహన లేకుంటే ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే. నేను కూడా పదేళ్ల క్రితం నిర్మాణ రంగంలో అనుభవం లేకపోవడంతో డబ్బు పోగోట్టుకున్నాను. అవగాహన పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు డెబ్బై సినిమాలను నిర్మించాను. ఈ సినిమా విషయానికి వస్తే నిర్మాతకు నా వంతు సహకారాన్ని అందిస్తాను. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Mitra Glam Gallery from the event

నిర్మాత వీరగణేష్ కర్రి మాట్లాడుతూ ‘’కళపై ఆసక్తితో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. ప్రతి డిస్ట్రిబ్యూటర్ మొత్తం సినిమా హక్కులను తమకు ఇచ్చేయమంటున్నారు కానీ ఎవరూ అండగా నిలబడటం లేదు. సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నాం. సినిమా బాగా వచ్చింది. సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను‘’ అన్నారు.

దర్శకుడు రమేష్ ముగడ మాట్లాడుతూ ‘’సినిమాను హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందించాం. ఆర్తి అగర్వాల్ గారు ఈ సినిమాలో నటించడం విశేషం. చిన్ని కృష్ణ సంగీతం అందించిన పాటలను, ఏప్రిల్ 1న విడుదలవుతున్న సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని కృష్ణ మాట్లాడుతూ ‘’సినిమాలో మంచి మ్యూజిక్ కుదిరింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సాయివెంకట్, హీరో అనీల్ కల్యాణ్, మిత్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: శానాపతి, మ్యూజిక్: జి.చిన్ని కృష్ణ, ఎడిటర్: మేనగశ్రీను, నిర్మాతలు: వీరగణేష్ కర్రి, లక్ష్మీ సరోజ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ ముగడ.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved