pizza
Affair music launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

07 October 2015
Hyderabad

‘ఎఫైర్‌’ ఆడియో రిలీజ్‌ చేసిన రాంగోపాల్‌వర్మ!!

శ్రీరాజన్‌ దర్శకత్వం వహిస్తూ ముఖ్యపాత్ర పోషించగా.. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మlలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ఎఫైర్‌’. ఈ చిత్రం పాటలు ‘మ్యాంగో మ్యూజిక్‌’ ద్వారా విడుదలయ్యాయి. ‘ప్రేమకు హద్దులు లేవు’ అనే షేక్స్‌పియర్‌ కొటేషన్‌ స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రానికి ‘ఎ థ్రిల్లింగ్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరి’ అన్నది ట్యాగ్‌లైన్‌. శ్రీరాజన్‌1ప్రశాంతి1గీతాంజలి, ధనరాజ్‌ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియోను దర్శకసంచలనం రాంగోపాల్‌వర్మ రిలీజ్‌ చేయగా.. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ‘ఎఫైర్‌’ ధియేటర్‌ ట్రయిలర్‌ను విడుదల చేసారు. హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర నిర్మాత తుమ్మపల్లి రామసత్యనారాయణ, చిత్ర దర్శకుడు శ్రీరాజన్‌, హీరోయిన్లు ప్రశాంతి, గీతాంజలి, సినిమాటోగ్రాఫర్‌ కర్ణ ప్యారసాని, సంగీత దర్శకుడు శేషు కె.యం.ఆర్‌, రఘు (మహామాయ)తోపాటు ఈటివి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

విభిన్నమైన కథాంశంతో.. అవుట్‌ అండ్‌ అవుట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఎఫైర్‌’ చిత్రం శ్రీరాజన్‌ ప్రతిభకు అద్దం పడుతుందని.. దర్శకుడిగా శ్రీరాజన్‌కు ఉజ్వమైన భవిష్యత్‌ ఉందని రాంగోపాల్‌వర్మ అన్నారు.

‘ఎఫైర్‌’ ఘన విజయం సాధించడం ఖాయమని సి.కళ్యాణ్‌ అన్నారు. సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుద చేయనున్నామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.

విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ‘ఎఫైర్‌’ చిత్రం నేటి యువతరానికి తప్పకుండా నచ్చుతుందని.. తమ నిర్మాత రామసత్యనారాయణ ప్రోత్సాహం, నటీనటులు మురియు సాంకేతిక నిపుణు సహాయసహకారా వ్ల ‘ఎఫైర్‌’ చిత్రాన్ని అనుకున్నవిధంగా అందంగా తీర్చిదిద్దగలిగానని చిత్ర దర్శకుడు శ్రీరాజన్‌ చెప్పారు.

చిత్ర దర్శకుడు శ్రీరాజన్‌ తమ నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ తీసుకొన్నారని, ఈ చిత్రం తమకు చాలా మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉందని హీరోయిన్లు ప్రశాంతి, గీతాంజలి పేర్కొన్నారు. షాని, సంపత్‌రెడ్డి, ఫణిరాజ్‌, హరిత, రాకేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఐ: రఘు (మహామాయ), కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్‌: సోమేష్‌ పోచం, మాటలు : అనిల్‌ సిరిమల్ల , పాటలు: పోతుల రవికిరణ్‌, సంగీతం: శేషు కె.యం.ఆర్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌`దర్శకత్వం: శ్రీరాజన్‌!!

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved