13 April 2016
Hyderabad
మాస్ట్రో డా.గజల్ శ్రీనివాస్, మాధవీలత జంటగా లతాశ్రీ చిత్రాలయమ్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘అనుష్ఠానం’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. కృష్ణవాసా సంగీతం అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ సినిమాను పి.రవిరాజ్ రెడ్డి నిర్మించారు. లగడపాటి శ్రీధర్ ఆడియో సీడీలను విడుదల చేసి తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ఈ సందర్భంగా.....
గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో అసలు కథానాయకుడు చలంగారు. హీరోయిన్ క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో హీరోగా చేయాలని అనుకోలేదు. అయితే కథ వినగానే నాకు బాగా నచ్చి చేశాను. కన్యాశుల్కంలో గిరీశం తరహా డిఫరెంట్ పాత్ర. అలాగే రామసత్యనారాయణ నిర్మాతగా కూడా ఈ ఏడాది ఓ సింగిల్ క్యారెక్టర్ మూవీ చేస్తాను. దాన్ని 2017లో విడుదల చేస్తాను. అనుష్ఠానం విషయానికి వస్తే ఆత్మ వంటి కథ. మాధవీలత అద్భుతంగా నటించింది. తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ భాషల్లో సినిమాను డబ్ చేసి జూన్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘గజల్ శ్రీనివాస్ అసాధ్యుడు. ఇప్పుడు నటుడుగా కూడా మరో అడుగు ముందుకేశాడు. మాధవీలత క్యారెక్టర్ లో ఇమిడిపోయినట్లు కనపడింది. ’సాధారణంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అటువంటి గొడవలను తెలియజేసే సినిమాలు వస్తేనే ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను’’ అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘’గజల్ శ్రీనివాస్ మా ఇంట్లో వ్యక్తి. నచ్చావులే సినిమాలో మాధవీలత అభినయాన్ని చూసి నేను తనను ముందు అభినందించాను. చాలా మంచి నటి. ఈ సినిమాలో మరోసారి అది ప్రూవ్ కానుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత పి.రవిరాజ్ రెడ్డి మాట్లాడుతూ ‘’చలంగారి సాహిత్య స్ఫూర్తితో దర్శకుడు కృష్ణ వాసా చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాం. సినిమా బాగా వచ్చింది. మంచి మ్యూజిక్ కుదిరింది. గజల్ శ్రీనివాస్ గారికి, మాధవీలత గారికి, జయలలిత సహా సహకారమందించిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
సహ నిర్మాత వల్లూరి జయప్రకాష్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా షూటింగ్ చూడటానికి వెళ్లిన నేను కథ విని ఇందులో భాగమవుతానని అనడం, గజల్ శ్రీనివాస్ గారు సరేననడంతో నా ప్రయాణం స్టార్టయ్యింది. ఒక విషయం పట్ల నిబద్ధతతో సమన్వయం చేసుకుంటూ పనిచేయడాన్ని అనుష్ఠానం అంటారు. ఇందులో భార్యభర్తలు తమ ప్రేమాభిమానాలను అనుష్ఠానం ఎలా చేశారనేదే సినిమా. గజల్ శ్రీనివాస్ గారి నుండి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
దర్శకుడు కృష్ణ వాసా మాట్లాడుతూ ‘’నిర్మాత రవిరాజ్ గారు కథ వినగానే వెంటనే చేద్దామని ముందుకు వచ్చారు. అలాగే సినిమా మేకింగ్ విషయంలో గజల్ శ్రీనివాస్ అందించిన సపోర్ట్ మరచిపోలేను. ఆడియో అద్భుతంగా వచ్చింది. గజల్ శ్రీనివాస్ గారు, మాధవీలతగారు అద్భుతంగా నటించారు. అలాగే జయలలితగారు మిగిలిన నటీనటులు తమ వంతు సపోర్ట్ ను అందించారు. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలోజయలలిత, రసరాజు, డిసౌజా, రాజ్ కందుకూరి, వడ్డేపల్లి కృష్ణ, చాముండేశ్వరి నాథ్, చుక్కపల్లి సురేష్, అల్లాణి శ్రీధర్, పద్మిని, మంజుల సురోజ్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు.
గజల్ శ్రీనివాస్ కుమార్తె కుమారి సంస్కృతి నేపధ్య గాయనిగా పరిచయమైన ఈ చిత్రంలో సీనియర్ నటి జయలలిత, రాగిణి, డా. డిసౌజా, సాయి శర్మ, విష్ణు కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, హలీమ్ ఖాన్,కృష్ణకిషోర్ , వెంకట్ మరియు శ్రీనివాస్ (ఫ్లూట్ విధ్వాంసులు ) లు నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్: వెంకటహనుమ, ఎడిటింగ్: కె.ఆంజనేయులు, నేపధ్య సంగీతం: చంద్రలేఖ, ,ప్రచార శిల్పి: ధని ఏలే , సాంకేతిక సహకారం: సింటిల్లా క్రియేషన్స్ ,రూప శిల్పి: బద్రి శ్రీను , కళా దర్శకత్వం: నారాయణ ,సహాయ దర్శకత్వం: ప్రసాద్ రాయుడు ,సాయిశర్మ ,రాజేష్ ఖన్నా, వెంకట్,నిర్మాణ –నిర్వాహణ: సత్యన్నారాయణ, పాటలు డా. వడ్డేపల్లి కృష్ణ, రసరాజు, గోపీనాధ్ , సహ నిర్మాత: వల్లూరి జయప్రకాష్, సహ దర్శకత్వం: గోపీనాథ్, సహనిర్మాత: వల్లూరి జయప్రకాష్, నిర్మాత: ఎమ్.పి.రవిరాజ్ రెడ్డి, సంగీతం, దర్శకత్వం: కృష్ణవాసా.