pizza
Banthipoola Janaki Music Launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 July 2016
Hyderaba
d

ధన్ రాజ్దీక్షాపంత్షకలక శంకర్అదుర్స్ రఘువేణుచమ్మక్ చంద్రరాకెట్ రాఘవసుడిగాలి సుధీర్ ముఖ్య తారాగణంగా ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణిరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు. బోలె సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో రామ్,  రెజీనా,  నందినీ రెడ్డి, ఆకాష్, అభిరాం దగ్గుబాటి, రాజ్ కందుకూరి, యష్ రంగినేని, జ‌గ‌దీష్‌అచ్యుత్రామ‌స‌త్య‌నారాయ‌ణ‌అదుర్స్ ర‌ఘసిద్ధు, సురేష్ కొండేటి, అభయ్, ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, సాయిరాజేష్, తనీష్, సుడిగాలి సుధీర్, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

బిగ్ సీడీ, ఆడియో సీడీలను హీరో రామ్ విడుదల చేశారు. తొలి సీడీలను ఆకాష్ పూరి, నందిని రెడ్డిలు అందుకున్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ ``బంతిపూల ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌కునిర్మాత‌లు స‌హా టీంకు ఆల్ ది బెస్ట్‌. త‌ను జెన్యూన్‌గా ఉంటాడు. చాలా క‌ష్టాలు దాటుకుంటూ వ‌చ్చాడు. సినిమా మంచి స‌క్సెస్ సాధించాలి. బోలె మంచి సంగీతాన్ని ఇచ్చారు`` అన్నారు.

రెజీనా మాట్లాడుతూ ``ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కుధ‌న‌రాజ్ స‌హా యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ధ‌న‌రాజ్ మాట్లాడుతూ ``చిరంజీవిగారిపై అభిమానంతో తాడేప‌ల్లిగూడెం నుండి నాలుగు వంద‌ల రూపాయ‌ల‌తో పారిపోయి వ‌చ్చాను. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆ డ‌బ్బులు అయిపోవడంతో హోట‌ల్‌లో ప్లేట్లు ఎత్తే ప‌ని చేశాను. తేజగారు జై సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చారు. సుకుమార్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో జ‌గ‌డం చిత్రంలో నాంప‌ల్లి స‌త్తి క్యారెక్ట‌ర్ చేశాను. అప్పుడే రామ్‌గారితో ప‌రిచ‌య‌మ‌య్యాడు. నా కొడుకుకి ఎనిమిదోనెల చేతిలో డ‌బ్బులు లేవు. నాకేమో డ‌బ్బు అవ‌స‌ర‌మైంది ఎవ‌రినీ అడ‌గాలో తెలియ‌లేదు. అప్పుడు రామ్‌గారిని అడిగితే ప‌దివేలిచ్చారు. త‌ర్వాత నా పెళ్లిరోజు వ‌చ్చిన‌ప్పుడు సుకుమార్‌గారు కొంత డ‌బ్బులిచ్చారు. అందుకే నాకొడుక్కి సుక్‌రామ్ అనే పేరు పెట్టాను. అదే ప‌రిచ‌యంతో నేను నిన్న రామ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి ఆడియో ఫంక్ష‌న్‌కు ర‌మ్మ‌ని పిలిచాను. ఆయ‌న అన్న‌మాట ప్ర‌కారం వ‌చ్చారు. నా లైఫ్‌లో సుకుమార్‌గారినిరామ్‌గారిని మ‌ర‌చిపోలేను. ఈ సినిమా చూసి నేను కేవ‌లం హీరోగానే చేస్తాన‌ని ఎవ‌రూ అనుకోవ‌ద్దు. రెండు సీన్స్ ఉన్న సినిమా అయినా నేను చేయ‌డానికి రెడీ. మ‌ధ్య‌లో బంతిపూల వంటి సినిమాలు చేస్తుంటాను. బోలెగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది`` అన్నారు.

నందినీరెడ్డి మాట్లాడుతూ ``ధ‌న‌రాజ్‌తాగుబోతు ర‌మేష్‌లంటే నాకు బ్యాడ్ హ‌బిట్స్ లాంటివారు. ధ‌న‌రాజ్ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. త‌ను ఇంకా మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కుమ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ ``ధ‌న‌రాజ్‌గారు ఒక‌ప్పుడు ఇదే స్టేజ్‌పై కామెడి స్కిట్ చేశారు. ఇప్పుడు ఇదే వేదికపై ఆడియో వేడుక చేసుకుంటున్నాడు. టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

Glam galleries from the event

ప్రొడ్యూస‌ర్ రామ్ మాట్లాడుతూ ``ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మంచి ఎంట‌ర్ టైనింగ్ మూవీ చూడాల‌నుకుంటున్నాం. ఆ ఆలోచ‌న‌ల‌తోనే జ‌బ‌ర్ ద‌స్త్ టీంతో ధ‌న‌రాజ్‌గారిని హీరోగా పెట్టి సినిమా చేశాను. దీక్షాపంత్ మంచి క‌మిట్‌మెంట్ ఉన్న న‌టి. ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తూ సినిమాను అనుకున్న టైంలో పూర్తి చేశారు. రెండు గంటలపాటు ఆడియెన్స్ ఎంజాయ్ చేసే చిత్రమిది. మేం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ద‌ర్శ‌కుడు స‌హా స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ ``దర్శ‌కుడిగా నా రెండో చిత్రం. నిర్మాత‌ల స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాం. ద‌న‌రాజ్‌గారు మంచి స‌పోర్ట్ చేశాం. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ``ధ‌న‌రాజ్ ఈ సినిమాకు ఎంతో అండ‌గా నిల‌బ‌డ్డారు. ఈ సినిమాను నేను చూశాను. చాలా బావుంది. సినిమా మంచి విజ‌యాన్ని సాధిస్తుంది. ఇంత మంచి సినిమాను నిర్మించిన నిర్మాత‌ల‌కుదర్శ‌కుడికి అభినంద‌నలు తెలియ‌జేస్తున్నాను`` అన్నారు.

జ‌గ‌దీష్ మాట్లాడుతూ ``టైటిల్‌కే మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది. ధ‌న‌రాజ్ ప‌ర్‌ఫెక్ట్ హ్యుమ‌న్ బీయింగ్‌. త‌ను నాకు ప‌ర్స‌న‌ల్‌గా బాగా తెలుసు. ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే స‌హాయ‌ప‌డుతుంటారు. ఆయ‌న హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అదుర్స్ ర‌ఘు మాట్లాడుతూ ``క‌చ్చితంగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల‌ను అల‌రిస్తుంది. యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ ``ధ‌న‌రాజ్ అంద‌రికీ కావాల్సిన హీరో. సినిమా హిలేరియ‌స్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌. ప్రోమోస్‌ట్రైల‌ర్స్ బావున్నాయి. సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ చంద‌ర్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు`` అన్నారు.

సిద్ధు మాట్లాడుతూ ``నేనుధ‌న‌రాజ్ భీమ‌లి క‌బ‌డ్డీ జ‌ట్టు చిత్రంలో న‌టించాం. త‌ను చాలా స్ట్ర‌గుల్ అవుతూ వ‌చ్చి ఈ స్టేజ్‌కు వ‌చ్చాడు. త‌ను హీరోగా ఇంకా చాలా సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

రాజ్‌కందుకూరి మాట్లాడుతూ ``ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. ధ‌న‌రాజ్‌కు ఈ సినిమాతో హిట్ వ‌స్తుంది. టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

అభిరాం ద‌గ్గుబాటి మాట్లాడుతూ ``ధ‌నరాజ్‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. త‌న‌ని రోజు క‌లుస్తుంటాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ``మంచి యూనిట్ ఈ సినిమాకు ప‌నిచేసింది. బోలెగారు మంచి మ్యూజిక్ అందించారు. సాంగ్స్ అన్నీ బావున్నాయి. ఈ సినిమాను ప్రేమించిఆద‌రించాలి. ధ‌న‌రాజ్ ఇలాంటి సినిమాల‌ను చాలా చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సాయిరాజేష్ మాట్లాడుతూ ``ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కుధ‌న‌రాజ్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

డాక్టర్ భరత్ రెడ్డిఫణికోమలిజీవన్ తదితరులు  ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: డా. శివ వై.ప్రసాద్కెమెరా: జి.ఎల్.బాబుకథ-మాటలు: శేఖర్ విఖ్యాత్సంగీతం: బోలెఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజనిర్మాతలు: కళ్యాణి-రామ్స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved