చరణ్, రాజ్, హమీద జంటగా ముళ్లపూడి రాంబాబు సమర్పణలో మారుతి టీం వర్క్స్, సాయి వెంకట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రాజేష్‌పులి దర్శకత్వంలో బోణంకృష్ణ సతీష్, అడ్డగర్ల జగన్‌బాబు, ఉప్పూరి బ్రహ్మాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న చిత్రం ‘భద్రం బికేర్ ఫుల్ బ్రదరూ’. సంపూర్ణేష్‌బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. చిత్రం ట్రైలర్‌ను వి.వి.వినాయక్ విడుదల చేయగా, రాజ్‌తరుణ్ విడుదల చేసిన సీడీని మారుతి అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇంకా మారుతి, రాజ్‌తరుణ్, సుమంత్ అశ్విన్, పరుచూరి వెంకటేశ్వరరావు, కళ్యాణ్‌కృష్ణ, చిన్నికృష్ణ,శ్రీవసంత్ విచ్చేశారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త దర్శకులను, కొత్త హీరోలను తెలుగు చిత్రరంగానికి పరిచయం చేస్తున్న మారుతిని మెచ్చుకుని తీరాలి. అలాగే ఈ చిత్రం ద్వారా కోటయ్య గారి అబ్బాయి చరణ్‌ను ఈ సినిమాలో హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అన్నారు.
మారుతి మాట్లాడుతూ ‘‘ఒక మంచి టీమ్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాకు సంగీత దర్శకుడు జె.బి.గారు చాలా కష్టపడ్డారు. అర్థరాత్రిళ్లు కూర్చుని ట్యూన్స్ చేసేవారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం ద్వారా మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి’’ అన్నారు.
యువ హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు మారుతి టీమ్ వర్క్స్ లో ‘లవర్స్’ వంటి విజయవంతమైన చిత్రం చేశాను. మంచి అనుబంధం ఉన్న నిర్మాణ సంస్థ. వీరందరినీ అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను’ అన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీవసంత్ మాట్లాడుతూ ‘‘నేను పాటలు రాయడం మానేసి కొన్ని నెలలు అయింది. అయితే మారుతిగారు, మిత్రుడు జె.బిగారు పిలిచి ఈ చిత్రానికి పాటను రాయించారు. వారి మాటను కాదనలేక రాశాను. సినిమా చక్కని విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత బోణం కృష్ణ సతీష్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు ఒక ముఖ్యపాత్రను చేశాడు. ముగ్గురు హీరోలున్న ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు ఒక పెద్దన్నలా వ్యవహరించి మా అందరికీ అండగా నిలిచారు. మారుతిగారితో అసోసియేట్ అయి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. ముందు ముందు కూడా ఆయనతో కలిసి సినిమాలు చేస్తాం’’ అన్నారు.
నిర్మాత బ్రహ్మాజి మాట్లాడుతూ ‘’ఒక సాధారణ బిజినెస్ మాన్‌గా ఉన్న నన్ను నిర్మాతను చేశారు మారుతి. ఈ సినిమాతో భారీ లాభాు ఆశించడం లేదు కాని, మంచి పేరు రావాలనుకుంటున్నాను’’ అన్నారు.
హీరో చరణ్ మాట్లాడుతూ ‘‘అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న నన్ను మారుతిగారు హీరోను చేశారు. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
చిత్ర దర్శకుడు రాజేష్‌పులి మాట్లాడుతూ ‘‘మారుతి టీమ్‌వర్క్స్ అనే సంస్థను నడిపించే బాధ్యతను నాకు అప్పగించినందుకు మారుతి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం సంపూర్ణేష్‌బాబు చాలా కష్టపడ్డాడు. మూడు డిఫరెంట్ షేడ్స్ లో ఆయన కనిపిస్తాడు. ఒక పాత్ర మేకప్‌కోసం నాలుగు గంట టైమ్ పట్టింది ఆయనకు. ఇది స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం’’ అన్నారు.
సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ ‘‘ఇంత వరకు మారుతి ఇంట్రడ్యూస్ చేసిన అందరిని ప్రేక్షకు ఆదరించారు. నా హృదయ కాలేయం చూసి నన్ను అభినందించిన మొదటి వ్యక్తి మారుతి గారు. ఇందులో నా చేత వైవిధ్యమైన డైలాగ్స్‌ను చెప్పించారు. వాటిని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ‘’ఈ మధ్యకాలంలో మారుతిగారు సక్సెస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. హీరో చరణ్ నాకు చాలా కాలంగా తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, చరణ్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.