pizza
Eedo Rakam Aado Rakam Music Launch
‘ఈడోరకం ఆడోరకం’ ఆడియో ఆవిష్కరణ
ou are at idlebrain.com > News > Functions
Follow Us

26 March 2016
Hyderabad

ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై మంచు విష్ణు, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ తాజ్ దక్కన్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మంచు విష్ణు, రాజ్ తరుణ్, అనీల్ సుంకర, సునీల్, నిఖిల్, జి.నాగేశ్వరరెడ్డి, సోనారిక, హేబా పటేల్, వీరుపోట్ల, సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ్ రామస్వామి, బోగవల్లి ప్రసాద్, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.

బిగ్ సీడీని మంచు మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను మంచు మోహన్ బాబు విడుదల చేశారు. తొలి సీడీని సునీల్ అందుకున్నాడు.

మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ‘’నాగేశ్వరరెడ్డిగారితో మంచి అనుబంధం ఉంది. మంచి టెక్నిషియన్. అనీల్ సుంకర మనోజ్ తో తొలి సినిమా చేశాడు. ఎన్నో మంచి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. రషెష్ చూశాను. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల తరహాలో మంచి కామెడి ఎంటర్ టైనర్. విష్ణు కెరీర్ లో మరో మైలురాయి అవుతుంది. ఢీ, దేనికైనా రెడీ కంటే పెద్ద హిట్ సాధిస్తుంది. రాజేంద్రప్రసాద్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అద్భుతమైన నటుడు. నాకు తమ్ముడితో సమానం. రాజ్ తరుణ్ చక్కగా నటించాడు. సాయికార్తీక్ మంచి సంగీతాన్ని అందించాడు. యూనిట్ సభ్యులందరికీ అభినందనలు’’ అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘’చాలా కాలం తర్వాత మంచి కామెడి మూవీ చేశాను. ప్రేక్షకులు తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. నాగేశ్వరరెడ్డిగారి తన దర్శకత్వ ప్రతిభతో మంచి కామెడి ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. సాయికార్తీక్ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. అనీల్ సుంకరగారు కమిట్ మెంట్ తో సినిమాను నిర్మించారు. విష్ణు, రాజ్ తరుణ్ తో నటించడం హ్యపీగా ఫీలవుతున్నాను. అందరికీ అభినందనలు’’ అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ ‘’సాయికార్తీక్ తో రౌడీ సినిమాకు పనిచేశాను. అలాగే రాజేంద్రప్రసాద్ గారు మనోజ్ గాడి ఫేవరేట్ హీరో. తనతో పాటు మాకందరికీ ఆయన పేవరేట్ యాక్టర్. ఆయనతో కలిసి పనిచేయడం అమేజింగ్ ఎక్స్ పీరియెన్స్. నాగేశ్వరరెడ్డిగారితో నటుడిగా రెండో సినిమా. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మనోజ్ తర్వాత నాకు రాజ్ తరుణ్ నాకు మరో తమ్ముడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘’అనీల్ సుంకరగారు బెస్ట్ ప్రొడ్యూసర్. నాగేశ్వరరెడ్డిగారు కూల్ గా ఉండటంతోనే సినిమాను త్వరగా పూర్తి చేశాం. రాజేంద్రప్రసాద్ గారి వంటి సీనియర్ హీరోతో యాక్ట్ చేయడం లక్కీగా భావిస్తాను. విష్ణు భయ్యాతో నటించడం మరచిపోలేని అనుభూతి. చాలా ఎంకరేజ్ చేశారు. సాయికార్తీక్ మ్యూజిక్ చాలా ఫాస్ట్ గా కంపోజ్ చేసేస్తాడు. తను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి’’ అన్నారు.

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘’వేరే కాంబినేషన్ లో నేను చేద్దామనుకున్నా మూవీ. అలాగే అనీల్ సుంకరగారు వేరే సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. చివరకు మేం ఇద్దరం కలిసి విష్ణుతో కలిసి సినిమా చేద్దామనుకున్నాం. తన ఆలోచనతో రాజ్ తరుణ్ ను మరో హీరోగా తీసుకున్నాం. విష్ణు, రాజ్ తరుణ్ మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. రాజేంద్రప్రసాద్ గారిని డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అనీల్ సుంకరగారు అందరినీ కో ఆర్డినేట్ చేస్తూ అద్భుతంగా సినిమాను చేశారు. సాయికార్తీక్ ను మ్యూజిక్ మెషీన్ అనాలి. చాలా ఫాస్ట్ గా ట్యూన్స్ అందించాడు. అలాగే సునీల్ గారు ఓ సాంగ్ కోసం లిరిక్ నేర్చుకుని పాడారు. అందుకోసం ఆయనకు థాంక్స్’’ అన్నారు.

అనీల్ సుంకర మాట్లాడుతూ ‘‘నేను, విష్ణు, నాగేశ్వరరెడ్డిగారు వేర్వేరుగా సినిమాలు తీయాలనుకున్నాం. జంధ్యాలగారి తరహాలో ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తారు. అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ ఫుల్ సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.

సాయికార్తీక్ మాట్లాడుతూ ‘’ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

అనీల్ సుంకర మాట్లాడుతూ ‘’అందరూ బాగా యాక్ట్ చేశారు.

నిఖిల్ మాట్లాడుతూ ‘’కన్ ఫ్యూజన్ కామెడి అంటున్నారు. నాకు కథ తెలుసు. క్లీన్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది.

సిద్ధార్థ్ రామస్వామి మాట్లాడుతూ ‘’దేనికైనా రెడీలో సినిమాలో వర్క్ చేశాను. అంతకంటే మంచి మూవీ ఇది. యూనిట్ సభ్యులకు థాంక్స్’’ అన్నారు.

భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ ‘’ఈ కథ నాకు ముందే తెలుసు. సినిమా మంచి హిట్ అవుతుంది’’ అన్నారు.

అభిషేక్ పిక్చర్స్ మాట్లాడుతూ ‘’యూనిట్ సభ్యులందరికీ ది బెస్ట్’’ అన్నారు.

హేబా పటేల్ మాట్లాడుతూ ‘’నాగేశ్వరరెడ్డిగారు క్లారిటీ ఉన్న దర్శకుడు. ఏ సీన్ అయినా చాలా త్వరగా చిత్రీకరించేస్తారు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.

సోనారిక మాట్లాడుతూ ‘’వండర్ ఫుల్ వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్. నాగేశ్వరరెడ్డిగారు కూలెస్ట్ డైరెక్టర్. ఆయన సెట్ ను సందడిగా ఉంచారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved