pizza
Eka Say Love music launch
`ఇక సె..ల‌వ్` పాట‌ల విడుద‌ల‌
ou are at idlebrain.com > News > Functions
Follow Us

26 May 2016
Hyderabad

గ్రీన్ స‌న్ ఇన్నొవేటివ్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఇక సె..ల‌వ్`. జైహిత స‌మ‌ర్పిస్తున్నారు. గ‌న్న‌వ‌ర‌పు చంద్ర‌శేఖ‌ర్‌, డుంగ్రోత్ పీర్యా నాయ‌క్‌, గ్యార ర‌వి నిర్మాత‌లు. నాగ‌రాజ్ ద‌ర్శ‌కుడు. సాయి ర‌వి, దీప్తి జంట‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలోని పాట‌ల‌ను గురువారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. నాగేశ్వ‌ర‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ ``నాగ‌రాజ్ చాలా మంచి ర‌చ‌యిత‌. నాకు ఓ సినిమాకు గోస్ట్ గా ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత అత‌ని కోసం నేను చాలా ఆరా తీశాను. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా క‌నిపించాడు. ఈ సినిమా కాన్సెప్ట్ బావుంది. `నేను చ‌నిపోయిన‌ప్పుడు ప్ర‌పంచం మొత్తం నా వెనుక క‌దిలింది. కానీ నేను ఎవ‌రి కోసం చ‌నిపోయానో ఆ అమ్మాయి మాత్రం రాలేదు`` అని పోస్ట‌ర్స్ పై రాసిన వాక్యాలు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఈ సినిమా త‌ప్ప‌క హిట్ కావాలి`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఇ.వి.వి., ర‌విరాజా పినిశెట్టిగారి ద‌గ్గ‌ర దాదాపు 70 చిత్రాల‌కు పైగా ప‌నిచేశాను. ద‌ర్శ‌కుడిగా నాకు ఇదే తొలి సినిమా. మాన‌వ సంబంధాల‌న్నీ మృగ్య‌మైపోతున్న నేటి స‌మాజంలో ఎలాంటి కాల‌దోషం ప‌ట్ట‌ని ఒకే ఒక బంధం ప్రేమ‌, ఈ విష‌యాన్ని చ‌ర్చిస్తూ తీసిన చిత్ర‌మిదే`` అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ``ఫ‌స్ట్ కాపీ సిద్ధంగా ఉన్న ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జూన్ 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి మ‌ధు నాలుగు అద్భుత‌మైన పాట‌ల‌ను అందించారు. నేప‌థ్య సంగీతాన్ని క‌మ‌ల్ అద్భుతంగా అందించారు`` అని అన్నారు.

సాయి ర‌వి మాట్లాడుతూ ``సోలో హీరోగా నాకు ఇదే తొలి సినిమా`` అని చెప్పారు.

డీఎంకే, కిర‌ణ్‌, ప్రియా శ‌ర్మ‌, ఆర్వీయ‌స్‌, సాగ‌ర్‌, హారిక త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు కెమెరా: వి.శ్రీనివాస‌రెడ్డి, ఎడిటింగ్‌: నాగిరెడ్డి, సంగీతం: మ‌ధు, క‌థ‌-మాట‌లు-స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: నాగ‌రాజ్‌.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved