pizza
Guppedantha Prema Music Launch
‘గుప్పెడంత ప్రేమ’ ఆడియో విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

03 May 2016
Hyderabad

ది ఐ వింక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయిరోనక్, అదితి సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం గుప్పెడంత ప్రేమ. వినోద్ లింగాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవనీత్ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. మధరు శ్రీధర్ రెడ్డి, సందీప్ కిషన్ కలిసి బిగ్ సీడీని ఆవిష్కరించారు. సందీప్ కిషన్ ఆడియో సీడీలను విడుదల చేసి వంశీకి అందజేశారు. ఈ సందర్భంగా...

సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘’ఇటీవల ట్విట్టర్ లో ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. నవనీత్ సుందర్ సంగీతం చాలా ఫ్రెష్ గా ఉంది. సాయిరోనక్, అదితి సింగ్, దర్శక నిర్మాతలు సహా యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

మధురశ్రీధర్ మాట్లాడుతూ ‘’దర్శకుడు వినోద్ నా వద్ద ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. తనకు తన వర్క్, సినిమాలే లోకం. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయి తనకు, ఇతర యూనిట్ మెంబర్స్ కు మంచి పేరు రావాలి. మంచి మ్యూజిక్ సినిమా అందరికీ బ్రేక్ ఇవ్వాలి’’ అన్నారు

Aditi Singh Glam gallery from the event

వినోద్ లింగాల మాట్లాడుతూ ‘’ఫస్ట్ లవ్ లో ఉండే ఫీలింగ్స్ గురించి తెలియజేసే చిత్రమిది. అవుటండ్ అవుట్ లవ్ స్టోరీ. నిజమైన ప్రేమ కాలాన్ని, దూరాన్ని ఎలా జయిస్తుందనేదే కథాంశం. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. నవనీత్ సుందర్ సోల్ లాంటి మ్యూజిక్ ఇచ్చారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

నవనీత్ సుందర్ మాట్లాడుతూ ‘’హానెస్ట్ లవ్ స్టోరీ, సాధారణ ప్రేమ కథ కాదు. సినిమాలో ఎనిమిది పాటలున్నాయి. మంచి కనెక్టింగ్ లవ్ పాయింట్ తో తెరకెక్కించారు. అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’’ అన్నారు.

ఐశ్వర్య, ఆనంద్, నోయెల్ సేన్, నవీన్ నేని, ప్రతీక్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్: బసవ పైడిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, మ్యూజిక్: నవనీత్ సుందర్, రచన: వినోద్ లింగాల, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పావని లింగాల, నిర్మాణం: ఐ వింక్ ప్రొడక్షన్స్, దర్శకత్వం: వినోద్ లింగాల.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved