|
26 June 2016
Hyderabad
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం `కబాలి`. రజనీకాంత్ సరసన రాధికా అప్టే హీరోయిన్ గా నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెక్షన్ సెంటర్‌లోజరిగింది.
ఈ కార్యక్రమంలో టి.సుబ్బిరామిరెడ్డి, హీరో వరుణ్ తేజ్, హీరో నాని, పుల్లెల గోపీచంద్, పా రంజిత్, సాయిధన్సిక, కలై అరసన్, పరందామన్, నటరాజన్, సంతోష్ నారాయణ్, చాముండేశ్వరినాథ్, జూపల్లి కృష్ణ, రఘురామ కృష్ణంరాజు, పరుచూరి గోపాలకృష్ణ, అభిషేక్ నామ, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ప్రతాని రామకృష్ణగౌడ్, సుధాకర్ కొమాకుల, నవీన్‌కృష్ణ, కేధారి, ధన్యబాలకృష్ణన్, దేవీ చౌదరి, అవంతి శ్రీనివాస్, శ్రీకాంత్ బండారు, రీతూ వర్మ తదితరులు పాల్గొన్నారు.
బిగ్ సీడీ, ఆడియో సీడీలను హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు...
టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ``తెలుగు ప్రజలకు రజనీకాంత్ అంటే చాలా అభిమానం. ఆయన్నెంతో గ్రాండ్‌గా రిసీవ్ చేసుకుంటారు. రజనీకాంత్‌గారు భారతదేశ చలన చిత్రానికి దొరికిన కోహినూర్ డైమండ్. తన యాక్టింగ్, డ్యాన్సుల, ఫైటింగ్స్ చేసిన ఏదీ చేసినా సంచలనమే. నాకు చాలా మంచి స్నేహితుడు. నేను చేసిన జీవనపోరాటం సినిమాలో రజనీకాంత్ నటించారు. ఆయన స్టయిలే వేరు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ ``అంరిలా రజనీకాంత్‌గారిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించిన వారిలో నేను ఒకడ్ని. తెలుగులో సినిమాను విడుదల చేసిన నిర్మాతలు ప్రవీణ్ చౌదరి, కె.ప్రవీణ్‌కుమార్ వర్మచాలా ప్యాషన్‌తో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. నేను రోబో సీక్వెల్ కంటే కబాలి కోసం వెయిట్ చేస్తున్నాను. కబాలి టీజర్, సాంగ్స్ చూస్తుంటే నాకు రజనీకాంత్‌గారి బాషా సినిమా గుర్తుకు వస్తుంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను`` అన్నారు.
పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ``నేను చిన్నప్పుడు రజనీకాంత్‌గారికి పెద్ద ఫ్యాన్. టీం అంతటికీ కంగ్రాట్స్. నిర్మాతలకు అభినందనలు`` అన్నారు.
చాముండేశ్వరి నాథ్ మాట్లాడుతూ ``నేను రజనీకాంత్‌గారి సినిమాలను మొదటిరోజునే చూస్తుంటాం. ఇప్పుడు కూడా ఆయన సినిమా కోసం మా ఫ్యామిలీ సభ్యులు కూడా ఎదురుచూస్తున్నారు`` అన్నారు.
రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ``కబాలి సినిమా ఏడువేల థియేటర్స్‌లో విడుదల కానుంది. ప్రపచంలో ఏ హీరోకు లేనంత ఫాలోయింగ్ రజనీకాంత్‌గారికే సొంతం. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా రియల్ లైఫ్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు. ఈ సినిమా రజనీకాంత్‌గారి కెరీర్‌లోనే పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను`` అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ``గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. రజనీకాంత్‌గారు లుక్ బాషా సినిమాను తలపిస్తుంది. సినిమా తప్పకుండా సూపర్‌హిట్ అవుతుంది`` అన్నారు.
కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ``నిర్మాతలు తెలుగు రైట్స్ ను చేజిక్కించుకోవడంతోనే సక్సెస్ అయ్యారు. వారికి ఆల్ ది బెస్ట్. దర్శకుడు గత చిత్రాలు రెండు మంచి విజయాలను సాధించాయి. తన మూడో సినిమా కబాలి సూపర్ హిట్ అవుతుంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
చైతన్య రాజ్ మాట్లాడుతూ ``మన దేశంలో సినీ జగత్తులో గొప్ప నటుడు, దార్శనికుడు, దానగుణం ఉన్న వ్యక్తి రజనీకాంత్‌గారు. ఈ సినిమా విడుదల కోసం ముప్పై నుండి నలభై దేశాలు వెయిట్ చేస్తున్నాయి. టీజర్‌కే ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ``తెలుగు నిర్మాతలకు కె.పి.చౌదరి, కె.ప్రవీణ్‌కుమార్‌గారికి అభినందనలు. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. ఇండస్ట్రీలో సినిమాపై పెద్ద క్రేజ్ ఉంది. రజనీకాంత్‌గారికి ప్రపంచం అంతటా అభిమానులున్నారు. సినిమా నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ``రజనీకాంత్‌గారు మంచి హ్యుమన్ బీయింగ్, గొప్ప నటుడు. కబాలి వంటి సినిమాను విడుదల చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ``రజనీకాంత్‌గారు చాలా సింపుల్‌గా ఉంటారు. మేమందరం రజనీకాంత్‌గారికి పెద్ద ఫ్యాన్స్. పెద్దనాన్న, రజనీకాంత్‌గారు మంచి స్నేహితులు. బాషా తర్వాత ఇలాంటి రజనీకాంత్ సినిమాను మిస్ అయ్యాం. పా రంజిత్‌గారు బాషాలో రజనీకాంత్‌గారిని చూపిస్తున్నారు. నిర్మాతలకు అభినందనలు`` అన్నారు.
సాయిధన్సిక మాట్లాడుతూ ``నాకు పర్‌ఫెక్ట్ లాంచ్ గా భావిస్తున్నాను. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనవచ్చు. తెలుగులో ఏకవీర తర్వాత నేను నటించి విడుదలవుతున్న చిత్రం. రంజిత్‌గారు, థానుగారి వల్లే రజనీకాంత్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకోగలిగాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
కలై అరసన్ మాట్లాడుతూ ``రంజిత్‌గారి వల్ల రజనీకాంత్‌గారితో కలిసి నటించే అవకాశం కలిగింది. సంతోష్ నారాయణగారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. అందరికీ థాంక్స్`` అన్నారు.
సంతోష్ నారాయణ్ మాట్లాడుతూ ``తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. తెలుగులో సినిమాలు చేయడానికి ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
పా రంజిత్ మాట్లాడుతూ ``సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలు నేరవేర్చగలుగుతానని అనుకుంటున్నాను. తమిళం కంటే తెలుగులో గ్రాండ్ లెవల్లో ఆడియో విడుదలవుతుంది. నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
కె.ప్రవీణ్ కుమార్ వర్మ మాట్లాడుతూ ``నేను షణ్ముక ఫిలింస్ తో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. పెద్ద సినిమా చేయాలని నా భయ్యా కె.పి.చౌదరిగారు అనగానే మాకు కనపడ్డ సినిమా కబాలి. మా కృష్ణ అంకుల్ వచ్చి మోహన్ బాబుగారి వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఫోన్ చేసి సినిమా మాకు రావడంలో ఎంతో హెల్పి చేశారు. ఆయనకు థాంక్స్. అలాగే అల్లు అరవింద్ గారు ఫైనాన్సియల్ గా ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఆయన కూడా కలైపులి థానుతో మాట్లాడారు. దాంతో థానుగారు రైట్స్ మాకిచ్చారు. ఈ స్టేజ్ కు రావడానికి నా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ కబాలి చిత్రాన్ని హిట్ చేసి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
కె.పి.చౌదరి మాట్లాడుతూ ``అందరూ అడగ్గానే మాకు ఎంతో అండగా నిలబడ్డారు. థానుగారు మాకు తండ్రిలా అండగా నిలబడ్డారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: మురళీ, సంగీతం: సంతోష్ నారాయణ్, ఆర్ట్: రామలింగం, ఫైట్స్: అన్బరివు, మాటలు: సాహితి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, వనమాలి. మేకప్: భాను, ఎఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: `దేవి-శ్రీదేవి` సతీష్, సమర్పణ: కలైపులి థాను, నిర్మాతలు: కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్, దర్శకత్వం: పా రంజిత్..
|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|