pizza
Lajja Music Launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 February 2015
Hyderabad

మ‌ధుమిత‌, శివ‌, వ‌రుణ్ కీల‌క పాత్ర‌ల్లో శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ సినిమా ప‌తాకంపై న‌ర‌సింహ నంది ద‌ర్శ‌క‌త్వంలో బూచేప‌ల్లి తిరుప‌తి రెడ్డి నిర్మాత‌గా రూపొందిన చిత్రం ‘ల‌జ్జ‌’. సుక్కు సినిమా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమవారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌ లో విడుద‌లైంది.

ఈ కార్య్ర‌క‌మంలో న‌ల్గొండ ఎం.ఎల్‌.సి కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌, ద‌ర్శ‌కుడు నర‌సింహ నంది, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, సాగ‌ర్‌, వీర‌శంక‌ర్‌, పి.ఎన్‌.కె.రెడ్డి, బూచేపల్లి యోగేశ్వ‌ర్‌, సుక్కు త‌దిత‌రులు పాల్గొన్నారు.

బిగ్ సీడీని కోమ‌టిరెడ్డి రాజగోపాల్ విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ విడుద‌ల చేసి సాగ‌ర్‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు నరసింహ నంది మాట్లాడుతూ ``ఇది రొమాంటిక్ సినిమా. ప్ర‌తి అమ్మాయి పెళ్లైన త‌ర్వాత త‌న భ‌ర్త ప్రేమ త‌న‌కే సొంతం కావాల‌ని అనుకుంటుంది. అలాంటిది భ‌ర్త ద‌గ్గ‌ర్నుంచి ప్రేమ‌ను పొంద‌లేక‌పోయిన‌ప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి మాన‌సిక ప‌రిస్థితుల‌కు లోన‌వుతుంది? త‌న‌ను భ‌ర్త అర్థం చేసుకోవ‌డం లేద‌ని తెలిసిన‌ప్పుడు ఎలా ఫీలవుతుంది? తీరా త‌న మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తి దొరికితే ఎలా భావిస్తుంది? వ‌ంటి అంశాల‌తో తీసిన క‌థ ఇది. న‌టి మ‌ధుమిత చాలా అద్భుతంగా న‌టించింది. మంచి సినిమా చేయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాం. మ‌ధుమిత లేక‌పోతే ఈ సినిమాను చేసేవాడిని కాదు. ఈ చిత్రంలో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి. సుక్కు మంచి సంగీతం అందించాడు. డిఫ‌రెంట్‌గా చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా`` అని తెలిపారు.

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ మాట్లాడుతూ ``నేను రాజ‌కీయాల్లోఉన్న‌ప్ప‌టికీ నాకు ఫిలిం ఇండ‌స్ట్రీతో మంచి ప‌రిచ‌య‌మే ఉంది. నాకు కూడా ఒక సినిమా తీయాల‌ని ఉంది. అది కూడా తొమ్మిది భాష‌ల్లో చేయాల‌ని ఉంది. ఇక ల‌జ్జ సినిమా విష‌యానికి వ‌స్తే సాంగ్స్‌,ట్రైల‌ర్స్ చూస్తుంటే డిఫ‌రెంట్ ప్ర‌య‌త్నంగా క‌న‌ప‌డుతుంది. సినిమా పెద్ద విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నిర్మాత బూచేప‌ల్లి తిరుప‌తిరెడ్డి మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు న‌ర‌సింహ నందిపై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌మ‌న్నాను. సినిమాను చాలా చ‌క్క‌గా చేశాడు. ఆయ‌న మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ ``1940లో ఓ గ్రామం అనే సినిమాను తొలిసినిమాగా చేసిన న‌ర‌సింహ నంది, మంచి చిత్రాలు తెలుగులో రావ‌డం లేద‌ని అనుకునే చాలా మంది ద‌ర్శ‌కులు త‌లెత్తుకునేలా చేశాడు. త‌న వంతుగా మ‌రోసారి నర‌సింహ నంది చేసిన ప్ర‌య‌త్న‌మే ల‌జ్జ చిత్రం. ట్రైల‌ర్స్‌,సాంగ్స్ బావున్నాయి. సుక్కు మంచి మ్యూజిక్ అందించాడు. న‌టీన‌టులు బాగా యాక్ట్ చేశారు. టీం అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

సాగ‌ర్ మాట్లాడుతూ ``స్టేట్ అవార్డ్‌, నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న ద‌ర్శ‌కుడు న‌ర‌సింహ నంది, ఈ సినిమాతో అవార్డులతో పాటు రివార్డులు కూడా గెలుచుకోవాలి`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ సుక్కు మాట్లాడుతూ ``ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మంచి పాట‌లు కుదిరాయి. డిఫ‌రెంట్‌గా ఉండే క‌మ‌ర్షియ‌ల్ మూవీ. న‌రసింహ నందిగారి వ‌ల్లే మ్యూజిక్ బాగా చేయ‌గలిగాను`` అన్నారు.

మ‌ధుమిత మాట్లాడుతూ ``న‌న్ను నమ్మి ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. చాలా బోల్డ్ క్యారెక్ట‌ర్ చేశాను. న‌ర‌సింహ నందిగారు నన్ను ఎంక‌రేజ్ చేయ‌డంతో బాగా చేయ‌గ‌లిగాను. తొలి సినిమాకే ఇంత ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ చేసినందుకు ఆనందంగా ఉంది`` అన్నారు.

వ‌రుణ్ మాట్లాడుతూ ‘’నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సుక్కుగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇంత మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చినంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

శివ మాట్లాడుతూ ``ఈ సినిమాలో స‌లీం అనే క్యారెక్ట‌ర్ చేశాను. లీడ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయికి మ‌ధ్య ఉండే ప్రేమ‌,. డిఫ‌రెంట్ మూవీ`` అన్నారు.

ఈ సినిమాకు స‌హ నిర్మాత‌లు: పి.ఎల్‌.కె.రెడ్డి, పాశం వెంక‌టేశ్వ‌రులు, కె.ర‌విబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: బుజ్జి, ఎ.శ్రీనివాస్‌, కృష్ణ‌, బ్ర‌హ్మ‌వ‌లి, కెమెరా: ఎస్‌.ముర‌ళీమోహ‌న్‌రెడ్డి, ఎడిట‌ర్‌: వి.నాగిరెడ్డి, సంగీతం: సుక్కు, పాట‌లు: వ‌న‌మాలి.

 

 


 
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved