pizza
Lover Boy Music Launch
'లవర్ బాయ్' ఆడియో విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 February 2016
Hyderabad

 

యశోజయ క్రియేషన్స్ ప‌తాకంపై రూపొందుతున్న సినిమా `ల‌వ‌ర్ బాయ్‌`. సంజీవ్ నాయుడు హీరోగా నటించారు. ఆయ‌నే దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'లవర్ బాయ్'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా

సంజీవ్ నాయుడు మాట్లాడుతూ ``ల‌వ‌ర్ బాయ్ అనే టైటిల్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. స‌మాజాన్ని ప్రేమించే ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతుంది. స‌మాజానికి సేవ‌చేసే ప్ర‌తి ఒక్క‌రూ ల‌వ‌ర్‌బాయ్‌లే అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. 5 పాట‌లున్నాయి. మంచి బాణీలు కుదిరాయి. ఉదిత్ నారాయ‌ణ్‌, శ్రేయాఘోష‌ల్ లాంటి పెద్ద సింగ‌ర్స్ పాడారు. ఈ సినిమా క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని తెలిపారు.

Sonia Chowdary Glam gallery from the event



 

వినోద్ నువ్వుల మాట్లాడుతూ ``ల‌వ‌ర్ బాయ్ అనే టైటిల్ పాత్ర నీదే అని డైర‌క్ట‌ర్ చెప్ప‌గానే చాలా సంతోషంగా అనిపించింది. ఇప్ప‌టిదాకా టీవీల్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఇందులో రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించాను. సినిమా ఔట్‌పుట్ బాగా వ‌చ్చింది`` అని అన్నారు.

విశ్వ మాట్లాడుతూ ``సంజీవ్ ఎంబిఏ చదివినా.. సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా తనకు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అని చెప్పారు

ఈ కార్యక్రమంలో సానియా చౌదరి, తమ్మిశెట్టి శ్రీనివాస్, ధూళిపాళ్ళ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved