pizza
Nagabharanam Music Launch
'నాగభరణం' ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 September 2016
Hyderaba
d

అమ్మోరు, అరుంధతి వంటి విజువల్‌ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న మరో అద్భుత చిత్రం 'నాగభరణం'. కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో క్రియేట్‌ చేయడం అనేది ఒక వండర్‌ అని అందరూ ప్రశంసించడం విశేషం. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్‌ మూవీస్‌, ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ స్టూడియో పతాకాలపై జయంతి లాల్‌ గాడా, సాజిద్‌ ఖురేషి, సొహైల్‌ అన్సారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంది. గురుకిరణ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది.

ఈ కార్యక్రమం సూపర్‌హిట్‌ పత్రికాధినేత బి.ఎ.రాజు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం అయ్యింది. థియేట్రికల్‌ ట్రైలర్‌ను సాయికుమార్‌ విడుదల చేశారు. బిగ్‌ సీడీని తెలంగాణ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విడుదల చేశారు. ఆడియో సీడీలను ఎన్‌.శంకర్‌ విడుదల చేయగా తొలి సీడీని సాయికుమార్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా...

మామిడిపల్లి గిరిధర్‌ మాట్లాడుతూ - ''ట్రైలర్‌ అమేజింగ్‌ అమ్మోరు, అరుంధతిని మించి హిట్‌ సాధిస్తుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయి'' అన్నారు.

మకుట గ్రాఫిక్స్‌ దొరబాబు మాట్లాడుతూ - ''బాహుబలి, ఈగ కంటే ఎక్కువగా మూడు సంవత్సరాలు బాగా కష్టపడ్డాం. కోడిరామకృష్ణగారు మంచి ఇన్‌పుట్స్‌ను అందించారు. అందరినీ ఎంటర్‌టైన్‌ చేసే చిత్రమవుతుంది'' అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''దేవతల సినిమాలకు కోడిరామకృష్ణగారు, దెయ్యాల సినిమాకు రాంగోపాల్‌వర్మ ఫేమస్‌. నేను రాంగోపాల్‌వర్మగారితో సినిమా చేశాను కానీ నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చిన కోడిరామకృష్ణగారితో సినిమా చేయలేకపోయాను. అమ్మోరు, అరుంధతిలా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది'' అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ - ''సినిమా కోసం నేను కూడా ఎంతో ఎగ్జయిట్‌ ఎదురుచూస్తున్నాను. తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో నిలిచిన క్రమంలో ఇలాంటి సినిమా విడుదల కావడం ఎంతో ఆనందదాయకం. కోడిరామకృష్ణగారి తరంగిణి చిత్రంలో సుమన్‌ పాత్రకు నా గొంతు అరువిచ్చాను. అలాగే పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన అంకుశం చిత్రంలో రాజశేఖర్‌కు నా గొంతు అరువిచ్చాను. ఆ సినిమాకు కూడా కోడిరామకృష్ణగారే దర్శకుడు. ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌ సినిమాపాత్ర చేశాను. అన్నీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. కన్నడలో రాజ్‌కుమార్‌ తర్వాత దిగ్గజ నటుడు స్వర్గీయ విష్ణువర్ధన్‌గారు. ఆయన్ను ఈ సినిమాలో సాక్షాత్కరింపచేశారు. కన్నడలో విష్ణువర్ధన్‌గారి అభిమానులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందని అడుగుతున్నారు. ఈ సినిమాను అందరూ బాహుబలితో పోల్చుతున్నారు'' అన్నారు.

ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ - ''కోడిరామకృష్ణగారి గురించి ఐదారు పుస్తకాలు, ఐదారు నెలలు పాటు చదివినా సరిపోదు. చాలా గొప్ప దర్శకుడు. అన్నీ జోనర్స్‌లో అరడజను హిట్‌ సినిమాలను ఇచ్చిన దర్శకుడు చరిత్రలో లేడు. కన్నడ నటుడు విష్ణువర్ధన్‌గారి పేరు చెబితేనే సంవత్సరం పాటు సినిమాలు ఆడిన సందర్భాలున్నాయి. నేను ఆయన నటించిన సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. అటువంటి గొప్ప నటుడు మన మధ్య లేకపోయినా ఆయన్ను పది నిమిషాల పాటు తెరపై చూపిండం చాలా గొప్ప విషయం. గొప్ప విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందిన గొప్ప చిత్రమిది'' అన్నారు.

మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ - ''ఓ మిత్రుడు ద్వారా ఈ సినిమాను చెన్నైలో చూశాను. చాలా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో పాము ప్రధాన పాత్రలో సినిమాలు రాలేదు. ఇలాంటి గొప్ప టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో సినిమాను తెలుగు విడుదల చేయడానికి హక్కులను సంపాదించాను. బాలీవుడ్‌లో ప్రముఖ పెన్‌ నిర్మాణ సంస్థ నుండి స్టూడియో గ్రీన్‌ జ్ఞానవేల్‌రాజాగారు హక్కులను కొంటే ఆయన దగ్గర నుండి నేను హక్కులను తీసుకుని సినిమాను విడుదల చేస్తున్నాను. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలన్నింటిలోనూ సినిమాను అక్టోబర్‌ 14న విడుదల చేస్తున్నాం. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అల్రెడి 70 శాతం బిజినెస్‌ పూర్తయ్యింది. ఈ సినిమాకు హీరో, డైరెక్టర్‌ అన్నీ కోడిరామకృష్ణగారే. అలాగే మకుట గ్రాఫిక్స్‌ ఈ సినిమాకు సెకండ్‌ హీరో పాత్రను పోషించారు. అంత మంచి విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సినిమాను రూపొందించారు'' అన్నారు.

చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ మాట్లాడుతూ - ''ఒక మంచి సినిమాను తెరకెక్కించాలంటే గ్రాఫిక్స్‌ ఒక్కటే సరిపోదు. అద్భుతమైన కథ కూడా కావాలి. అలాగే మంచి నిర్మాత కూడా తోడు కావాలి. ఈ కథను చెప్పేటప్పుడు సాజిద్‌ ఖురేషి విన్నాడు. ఈ సినిమా నిర్మాణంలో తాను కూడా భాగస్వామినౌతానన్నాడు. భారీ ఖర్చుతో కూడుకున్న సినిమా అని చెప్పాను. ఎంత కష్టపడైనా సినిమాను పూర్తి చేస్తానన్నాడు. ప్యాషన్‌తో పాటు, ఓపికగా ఈ సినిమాను రూపొందించాడు. కన్నడ అలనాటి సూపర్‌స్టార్‌ విష్ణువర్ధన్‌గారితో సినిమా తీయాలనేది నా కల. ఆయనకు ఈ కథను వినిపించాను. కథను బావుంది, తప్పకుండా సినిమా చేద్దామని అన్నారు. కథను డెవలప్‌ చేయడానికి బ్యాంకాక్‌ వెళ్ళాను. అయితే విష్ణువర్ధన్‌గారు కాలం చేశారు. నాకు ఇష్టమైన విష్ణువర్ధన్‌గారికి పతాక సన్నివేశాల్లో పదినిమిషాల పాటు చూపిద్దామని నిర్మాతసాజిద్‌ ఖురేషిగారు అనడంతో మకుట గ్రాఫిక్స్‌ వారి సహాయంతో విఫక్ణువర్ధన్‌గారిని తెరపై ఆవిష్కరించాం. విష్ణువర్ధన్‌గారు తన చివరి సినిమాలో వచ్చే జన్మలో కూడా నేను నటుడిగానే పుడతానని అన్నారు. ఆయన మాటలకు ఈ సినిమా ఆంకురార్పణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను అక్టోబర్‌ 14న విడుదల చేస్తాం. అందరూ ఎంజాయ్‌ చేసే సినిమ
ా అవుతుంది'' అన్నారు.

కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ - ''శివకుమార్‌గారు నాకు ఆత్మీయుడు ప్రాణ స్నేహితుడు. కోడి రామకృష్ణగారు గొప్ప దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో అమ్మోరు సినిమాను రూపొందించి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు సందేశాత్మక చిత్రాలు కూడా తీయాలని వారిని కోరుకుంటున్నాను'' అన్నారు.

రమ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్‌, దిగంత్‌, ముకుల్‌ దేవ్‌, రవి కాలే, అమిత్‌, రాజేష్‌ వివేక్‌, సాదు కోకిల, రంగాయన రఘు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విఎఫ్‌.ఎక్స్‌: మకుట విజువల్‌ ఎఫెక్ట్స్‌, స్టంట్స్‌: రవివర్మ, థ్రిల్లర్‌ మంజు, ఆర్ట్‌: నాగరాజ్‌, కొరియోగ్రాఫర్‌: చిన్ని ప్రకాష్‌, శివశంకర్‌, ఇమ్రాన్‌ సర్దారియా, సాహిత్యం: కవిరాజ్‌, డైలాగ్స్‌: ఎం.ఎస్‌.రమేష్‌, ఎడిటర్‌: జానీ హర్ష, సినిమాటోగ్రఫీ: వేణు, మ్యూజిక్‌: గురుకిరణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సాజిద్‌ ఖురేషి, దవల్‌ గడ, సోహిల్‌ అన్సారి, దర్శకత్వం: కోడి రామకృష్ణ.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved