pizza
Nagarjuna-Karthi's Oopiri music launch
'ఊపిరి' ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

01 March 2016
Hyderabad

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలోకె.రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, అమల, కార్తీ, ప్రకాష్ రాజ్, జయసుధ, పివిపి,వంశీపైడిపల్లి, సుమంత్, గాబ్రియల్, జెమిని కిరణ్, కళ్యాణ్ కృష్ణ, ఎడిటర్ మధు, అశ్వనీదత్, సుశాంత్, హరీష్ శంకర్, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్త్రి, దిల్ రాజు, రఘరాంరాజు, అడవి శేష్, శ్రీచరణ్, కాజల్ అగర్వాల్, దశరథ్, అలీ తదితరులు పాల్గొన్నారు.

ఆడియో సీడీలను అక్కినేని అమల విడుదల చేశారు. ఆడియో సీడీలను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘’’మనం’, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి వరుస విజయాలతో ప్రేక్షకులు నాపై ప్రేమను కురిపించారు. చైతన్య ఇప్పుడు ‘సాహసమే శ్వాసగా సాగిపో’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఆ టైటిల్ నాకు ఎంతో ఇష్టమైన టైటిల్. ఎందుకంటే నేను సాహసంతో గీతాంజలి, నిన్నేపెళ్ళాడతా, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలు చేశాను. ‘ఊపిరి’ విషయానికి వస్తే ఇది పెద్ద జర్నీ. నాలుగేళ్ళ క్రితం నేను, అమల ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ‘ఇన్ టచ్ బుల్స్’ చూశాం. ఇద్దరికీ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాను ఎవరైనా తెలుగులో చేస్తే బావుంటుందని, అందులో నేను రోల్ చేస్తే బావుంటుందని అనుకున్నాను. గట్టిగా కోరుకుంటే జరుగుతుందని ఎవరో అన్నట్టు మూడేళ్ళ తర్వాత వంశీ ‘ఇన్ టచ్ బుల్స్’ సీడీ ఇచ్చి సినిమా చూడమన్నాడు. నేను వీల్ చెయిర్లో కూర్చొనే రోల్ చేశానని ఎవరూ అనుకోవద్దు. సినిమాలో కాళ్ళు,చేతలు పడిపోయినా మనసు పరిగెత్తుతూనే ఉంటుంది. ఎంటర్ టైన్మెంట్, లవ్, ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. వంశీ అన్నీ చక్కగా చూపించాడు. మనిషికి ఒక తోడు కావాలి. ఆ తోడు ఎంత అవసరమో ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సినిమాలో నాకు కార్తీ తోడుగా నటించాడు. కార్తీ ఫెంటాస్టిక్ యాక్టర్. గుడ్ ఫ్రెండ్. సినిమా గ్యారంటీ హిట్టవుతుంది. ఈ సినిమాతో నాకొక ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు. ఈ సినిమాకు మరో ఊపిరి పివిపి. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. శివ, గీతాంజలి, అన్నమయ్య సినిమాకు వచ్చినంత మంచి పేరు ఈ సినిమాకు వస్తుంది’’ అన్నారు.

కార్తీ మాట్లాడుతూ ‘’వంశీ మన నెటివిటీకి తగిన విధంగా బ్యూటీఫుల్ అడాప్టెషన్ తో ఊపిరి సినిమాను చేశాడు. నాగార్జునగారు ఈ సినిమాలో నటిస్తున్నారనగానే ఈ సినిమాలో నటించడానికి డబుల్ ఓకే చెప్పాను. ఆయనతో నటించడం లైఫ్ లాంగ్ గిఫ్ట్ దొరికినట్టయింది. బెస్ట్ ఇవ్వాలని అందరూ ప్రయత్నించాం. అందరూ ఈ సినిమాను లవ్ చేసి వర్క్ చేశాం. ఎమోషన్స్, సెన్సిబిలిటీ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా ఇంత బాగా వచ్చినందకు పివిపిగారు ముఖ్య కారణం. గోపీ సుందర్ గారు బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఎంటైర్ లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఎలా సెలబ్రేట్ చేయాలో తెలిసిన వ్యక్తిగా నాగార్జునగారి పెర్ ఫార్మెన్స్ చూసి అందరం ఏడ్చేశాం. రేపు ఆడియెన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

పివిపి మాట్లాడుతూ ‘’నాగార్జున, కార్తీలే ఈ సినిమాకు ఊపిరి. ఎంతో సపోర్ట్ చేశారు. వారితో సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘’నాగార్జున, కార్తీ, పివిపి, తమన్నా అందరినీ చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. వారి వ్యక్తిత్వాలే ఈ సినిమా చేయడానికి కారణమైంది. నాగార్జునగారు ప్రతి విషయంలో కొత్తగా చూపెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఊపిరి సాధ్యమైంది. కార్తీ ప్రతి సినిమాను డిఫరెంట్ గా ఉండేలా చూస్తున్నారు. అలాగే పివిపిగారు ప్రతి సినిమాను ప్యాషనేట్ గా చేస్తున్నారు. వంశీతో మూడో సినిమా. తను ఇలాంటి సినిమా చేస్తాడని నమ్మలేదు. కొత్తగా ప్రయత్నించాడు. నేను కూడా విలక్షణమైన పాత్రలో కనపడతాను. మన మనసు, అనుభవం, అనుబంధాలతో చూడాల్సిన సినిమాయే ఊపిరి’’ అన్నారు.

వంశీపైడిపల్లి మాట్లాడుతూ ‘’ఈ సినిమా రూపొందడానికి కారణం నాగార్జున, కార్తీ, పివిపిగారే. నేను చెప్పగానే ఆయన ఒక్క క్షణం కూడా జంకకుండా పివిపిగారు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని చూస్తే భయమేసింది. ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన తీరుని మాటల్లో వర్ణించలేను. ఇట్ ఈజ్ బ్రీత్ ఆఫ్ రిలీఫ్. నాగార్జునగారు ఒక ఊపిరి అయితే మరో ఊపిరి కార్తీగారు. డైరెక్టర్ బాధ తెలిసిన హీరో కార్తీ. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నాగార్జున, కార్తీగారు లేకుంటే ఊపిరి సినిమాయే లేదు. వీరి కలయికే ఈ సినిమాకు మ్యాజిక్ లేయర్. వారి మద్య అనుబంధమే ఈ సినిమా. కథ విన్న పివిపిగారు, వంశీ కొత్త సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాడని ఎంకరేజ్ చేశారు. హరి, సాల్మన్, అబ్బూరి రవిల సపోర్ట్ కూడా ఎంతో ఉంది. గోపీ సుందర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. ఆయన తప్ప మరెవరూ చేయలేరనే విధంగా నటించారు. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

Glam galleries from the event

మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మాట్లాడుతూ ‘’ఊపిరి సూపర్ హిట్ చిత్రమవుతుంది’’ అన్నారు.

కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ‘’నాగార్జునగారు క్యాన్సర్ పెషేంట్ క్యారెక్టర్ ను ట్రై చేయడం వల్ల గీతాంజలి వంటి సినిమా మనకు మిగిలింది. అలాగే నిన్నేపెళ్ళాడతా, సోగ్గాడే చిన్ని నాయనా వంటి మంచి సినిమాలు మనకు అందించగలిగారు. అలాగే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోస్ లో ఒకరు ఆడిపాడుతుంటే మరో పక్క వీల్ చెయిర్ లో కూర్చొనే రోల్ చేయడమంటే రిస్క్ చేసినట్లే. కానీ నాగార్జునగారు ఇలాంటి రిస్క్ తీసుకున్నారు కాబట్టి ఊపిరి గొప్ప సినిమా అవుతుంది. అలాగే కార్తీ గారు స్ట్రయిట్ తెలుగు మూవీ ఇది. కానీ ఆయన మొదటి సినిమా నుండి తెలుగు హీరోగానే ఫీలవుతున్నాం. గోపీసుందర్ గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వంశీపైడిపల్లి సినిమాను చక్కగా తెరకెక్కించి ఉంటారు. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘’వంశీ సబ్జెక్ట్ సెలక్షన్స్ బావుంది. తెలుగు, తమిళం, మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. గోపీసుందర్ మంచి మ్యూజిక్ అందించారు. కార్తీ అల్రెడి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా తనకి మరో పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.

అశ్వనీదత్ మాట్లాడుతూ ‘’పివిపి నిర్మాణ శైలి చూస్తుంటే అలనాటి జగపతి వంటి నిర్మాణ సంస్థ గుర్తుకు వస్తుంది. నాగార్జునగారికి ఈ సినిమా హ్యట్రిక్ హిట్ అవుతుంది’’ అన్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘’పివిపి గారు మంచి సినిమాలను ప్యాషన్ తో నిర్మిస్తున్నారు. ఆయనకు హ్యట్సాఫ్. నేను,వంశీపైడిపల్లి ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. వంశీ ‘ఊపిరి’ టైటిల్ చెప్పగానే మాస్ టైటిల్ లా లేదే అనుకున్నాను. అయితే సాంగ్స్ వినగానే థ్రిల్ అయ్యాను. టీజర్ చూసి షాకయ్యాను. ఈ సినిమాకు నాగార్జునగారే ఊపిరి. ఈ సినిమా తెలుగు, తమిళం సినీ రంగంలో హ్యుజ్ డిఫరెన్స్ తెస్తుంది’’ అన్నారు.

సుశాంత్ మాట్లాడుతూ ‘’చిన్న, పెద్ద సినిమాలను నిర్మిస్తూ ఎంకరేజ్ చేస్తున్న పివిపిగారికి థాంక్స్. మావయ్య, కార్తీ, పివిపి సహా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

రఘురామరాజు మాట్లాడుతూ ‘’హీరోలు నాగార్జున, కార్తీ, గోపీసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సోగ్గాడే తర్వాత ఈ సమ్మర్ కు నాగార్జునకు మరో హిట్ అవుతుంది’’ అన్నారు.

జయసుధ మాట్లాడుతూ ‘’నాగార్జుగారు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. కార్తీ చాలా నేచురల్ యాక్టర్. పివిపి గారి బ్యానర్ లో బ్రహ్మోత్సవం తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ ‘’వంశీ మా బ్యానర్ లో మూడు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో తమిళంలోకి ఎంటర్ అవుతున్నాడు. పివిపి గారు డబ్బులు కోసం కాకుండా ప్యాషన్ తో సినిమాలను నిర్మిస్తున్నారు. ఊపిరి సినిమా గురించి తెలుసు. మనసు దోస్తూ, కన్నీళ్ళు తెప్పించే సినిమాగా సమ్మర్ తొలి హిట్ అవుతుంది’’ అన్నారు.

నాగార్జున, కార్తీ, తమన్నా భాటియా, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved