pizza
Rakshaka Bhatudu music launch
`ర‌క్ష‌క‌భ‌టుడు` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 April 2017
Hyderabad

ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. కంటెంట్‌ను హీరోగా పెట్టి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేసిన ఈ చిత్రం మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌ర‌బాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. పాట‌ను మారుతి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

మారుతి మాట్లాడుతూ - ``జ‌క్క‌న్న మూవీ స‌క్సెస్ త‌ర్వాత డైరెక్ట‌ర్ వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా ఇది. ఆంజ‌నేయ‌స్వామికి పోలీస్ గెట‌ప్ ఉన్న మోష‌న్ పోస్ట‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంద‌రిలో ఓ క్యూరియాసిటీని పెంచింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తి క‌లిగింది. కాసర్ల‌శ్యాం రాసిన పాట బావుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

చిత్ర నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - ``రియ‌ల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నాకు సినిమాలంటే ఎంతో ఆస‌క్తి ఉంది. అందువ‌ల్ల‌నే నేను ఈ సినిమాతో నిర్మాత‌గా మారాను. జ‌క్క‌న్న సినిమాలో నేను కూడా ఒక క్యారెక్ట‌ర్ చేశాను. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో వంశీకృష్ణ‌గారు నాకు ఈ క‌థ‌ను వినిపించారు. బాగా న‌చ్చ‌డంతో సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యాను. ముఖ్యంగా వంశీ చెప్పిన క్లైమాక్స్ విని ఒళ్ళు జ‌ల‌ద‌రించింది. క‌థ‌ను ఎలా చెప్పారో అలాగే తెర‌కెక్కించారు. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నేదే ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో, ఆంజ‌నేయ‌స్వామి గెట‌ప్‌లోఉన్న దెవ‌ర‌నే ప్ర‌శ్న అంద‌రిలో క్యూరియాసిటీని క‌లిగింది. శేఖ‌ర్ చంద్ర మంచి మ్యూజిక్‌ను అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్‌గా కుదిరింది`` అన్నారు.

కాస‌ర్ల‌శ్యామ్ మాట్లాడుతూ - ``జ‌క్క‌న్న సినిమాలో రెండు సాంగ్స్ రాశాను. ఈ సినిమాలో ఒక సాంగ్‌ను రాసే అవ‌కాశం నాకు ఇచ్చిన ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌, నిర్మాత గురురాజ్ గారికి థాంక్స్‌`` అన్నారు.

రిచా ప‌న‌య్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో న‌టించ‌డం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గురురాజ్‌గారు, వంశీకృష్ణ‌గారు ఇచ్చిన ఇన్‌స్పిరేష‌న్‌తోనే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం`` అన్నారు.

శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - ``నేను హ‌ర్ర‌ర్‌, ల‌వ్ సినిమాల‌కు సంగీతం అందించాను. కానీ ర‌క్ష‌క‌భ‌టుడు సినిమా డిఫ‌రెంట్ జోన‌ర్‌లో ఉంది. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేయ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ కొత్త ఐడియాతో సినిమాను చేశారు. ఈ జ‌ర్నీ నాకు బాగా న‌చ్చింది. డెఫ‌నెట్‌గా సినిమా స‌క్సెస్‌నిస్తుంది`` అన్నారు.

వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ - ``శేఖ‌ర్ చంద్ర‌గారి గ‌త చిత్రాల మ్యూజిక్ విని మాస్ ట‌చ్ ఉండే మ్యూజిక్ చేస్తాడా అనిపించింది నాకు, కానీ శేఖ‌ర్ చంద్ర‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. ప్రొడ్యూస‌ర్ రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారో, సినిమా రంగంలో కూడా అలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకోవాల‌ని కోరుకుంటున్నాను. మోష‌న్ పోస్టర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంజ‌నేయ‌స్వామి గెట‌ప్‌లో ఉన్న హీరో ఎవ‌ర‌నే ఆస‌క్తి అంద‌రిలో కలిగింది. మే ప్ర‌థ‌మార్థంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved