pizza
Rudra IPS music launch
రుద్ర ఐపియస్ ఆడియో విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

18 April 2016
Hyderabad

టి.కృష్ణవేణమ్మ సమర్పణలో అజిత్ క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ కృష్ణ, కీర్తన జంటగా రూపొందుతోన్న చిత్రం రుద్ర ఐపియస్.  బాలకృష్ణ రెడ్డి దర్శకత్వంలో టి.రాజేశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘంటాడి కృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

సాగర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు.

సాగర్ మాట్లాడుతూ ‘’రాజశేఖర్ గారు చసిన ప్రయత్నం బావుంది. నిర్మాతగా ఆయనకు రుద్ర మంచి పేరు తీసుకురావాలి. ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’  అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘’తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది. మినీ థియేటర్స్ కట్టడానికి నిర్ణయం తీసుకోవడం, మల్టీప్లెక్స్ ల్లో ఓ షో చిన్న సినిమాలకు కేటాయించడం. ఈ సినిమా విషయానికి వస్తే రాజ్ కృష్ణ మంచి పెర్ ఫార్మెన్స్ చేశారు. తనకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

దర్శకుడు బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సమాజంలో చెడును ఎలా ఎదిరించాడనేదే కథ. ఘంటాడి కృష్ణగారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ  సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజశేఖర్ రెడ్డిగారి మరచిపోలేను. అందరూ బాగా సపోర్ట్ చేశారు. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’అన్నారు.

నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ‘’రియల్ ఎస్టేజ్ రంగం నుండి సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాను. హీరోగా, నిర్మాతగా చేసిన ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఘంటాడి కృష్ణగారి సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ ‘’సినిమా మంచి కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. అన్నీ టైప్ సాంగ్స్ ఉన్నాయి. రాజశేఖర్ గారికి, బాలకృష్ణారెడ్డికి ఈ సినిమాతో మంచి పేరు, లాభాలు రావాలి’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో బసిరెడ్డి, కశ్యప్ తదితరులు పాల్గొన్ని చిత్రయూనిట్ ను అభినందించారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved