శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా పాండిరాజ్ దర్శకత్వంలో 'ప్రేమసాగరం' టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై టి.రాజేందర్ నిర్మించిన చిత్రం 'సరసుడు'. ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్. కురళఅరసన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో 5 పాటలు వున్నాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. బిగ్ సీడీని మంచు మనోజ్ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను టి.రాజేందర్ ఆవిష్కరించి తొలి సీడీని శింబుకు అందించారు.
టి.రాజేందర్ మాట్లాడుతూ - ``1983లో ప్రేమసాగరం సినిమా రిలీజైనప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. తర్వాత నా చిత్రాలెన్నింటినిలో తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. తర్వాత శింబు నటించిన చిత్రాలను కూడా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు శింబు నటించిన మరో చిత్రమే `సరసుడు`. శింబు తమ్ముడు కురళ అరసన్ మ్యూజిక్ అందించాడు. శింబు, తన తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. అన్నీ సాంగ్స్ వెరైటీగా ఉన్నాయి. శింబులో లవ్ పేథాస్ సాంగ్‌ను పాడాడు. తెలుగులో సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను`` అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ - ``నేను, శింబు ప్రాణ స్నేహితులం. నాకు మ్యూజిక్‌లో కొంత టెస్ట్ ఉందంటే కారణం శింబుయే. తను అమేజింగ్ టాలెంటెడ్ పర్సన్. శింబు పాటలు పాడటమే కాదు, చక్కగా పాడుతాడు. ఈ చిత్రంలో శింబు తనయుడు కురల్ అరసన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. టి.రాజేంద్రన్‌గారంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో కూడా ఆయన ఓ మాస్ సాంగ్‌ను పాడారు. నేను, శింబు కలిసి ఓ మంచి యాక్షన్ సినిమా చేయబోతున్నాం. శింబు కథను తయారు చేస్తున్నాడు. సరసుడు సినిమా పెద్ద హిట్ సాధించాలి`` అన్నారు.
శింబు మాట్లాడుతూ - ``తెలుగు ఇండస్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులున్నా, మనోజ్ నా ప్రాణ స్నేహితుడు. ప్రేమ జీవితంలో సమస్య ఉంటుంది కానీ స్నేహంలో సమస్యలు ఉండవు. నేను, మనోజ్ స్నేహితుల కంటే ఎక్కువ. తెలుగులో నా సినిమా రిలీజ్ అయ్యి చాలా గ్యాప్ వచ్చింది. పాండ్యరాజ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. నయనతార, ఆండ్రియా, మ్యూజిక్ డైరెక్టర్ కురళ్ సహా అందరికీ థాంక్స్. బ్రిజీ లవ్ స్టోరీ`` అన్నారు.
మహిత్ నారాయణ మాట్లాడుతూ - ``రాజేందర్‌గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.