pizza
Titanic Music Launch
‘టైటానిక్’ ఆడియో విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

1 May 2016
Hyderabad


రాజీవ్ సాలూరి, యామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘టైటానిక్’. ‘అంత‌ర్వేది టు అమ‌లాపురం’ ట్యాగ్ లైన్. రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు ఈ చిత్రాన్న నిర్మించారు. వినోద్ యాజమాన్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎ.కోదండరామిరెడ్డి, కల్యాణ్ కృష్ణ, దగ్గుబాటి అభిరాం, ఎన్.శంకర్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కోటి, అనిల్ రావిపూడి, ధనరాజ్, కారుమంచి రఘు, జయరవీంద్ర, కాదంబరి కిరణ్, ఆదిత్య నిరంజన్, మాధవ్, వినోద్ యాజమాన్య, రాజీవ్ సాలూరి, దర్శకుడు రాజవంశీ, నిర్మాత కె.శ్రీనివాసరావు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

బిగ్ సీడీని అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. ఆడియో సీడీలను ఎన్.శంకర్ విడుదల చేసి తొలి సీడీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్ కు అందించారు. థియేట్రిక్ ట్రైలర్ ను బి.గోపాల్ విడుదల చేశారు.

ఎ.కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘’రాజీవ్ సాలూరికి, దర్శక నిర్మాతలు అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

బి.గోపాల్ మాట్లాడుతూ ‘’కోటి నాకు ఇష్టమైన దర్శకుడు. అతని తనయుడు రాజీవ్ చేస్తున్న ఈ సినిమా మంచి హిట్ కావాలి. ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’హాలీవుడ్ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను. సాంగ్స్ బావున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్, దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘’రాజీవ్ కు మంచి భవిష్యత్ ఉంది. సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

ఎన్.శంకర్ మాట్లాడుతూ ‘’సాంగ్స్,ట్రైలర్ చూడగానే సినిమాలో సక్సెస్ కళ కనపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అయిన టైటానిక్ టైటిల్ తో తెలుగులో అద్భుతమైన సినిమాను చేశారు. డెఫనెట్ గా టీంకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ ‘’అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సపోర్ట్ చేసిన యూనిట్ మెంబర్స్ అందరికీ థాంక్స్’’ అన్నారు.

కోటి మాట్లాడుతూ ‘’టైటానిక్ పేరు వినగానే అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. హాలీవుడ్ టైటిల్ తో తెలుగులో సినిమా చేయడం ధైర్యమే అనాలి. మంచి కామెడి స్టోరి. సాంగ్స్ బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు రాజవంశీ మాట్లాడుతూ ‘’టైటిల్ వినగానే ప్రొడ్యూసర్ గారు సినిమా చేస్తున్నామని అన్నారు. ఓ లాంచ్ లో అంతర్వేది నుండి అమలాపురం వరకు జరిగే జర్నీయే ఈ సినిమా. చాలా మంచి నిర్మాతలు దొరికారు. వారి రుణం తీర్చుకోలేనిది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

రాజీవ్ సాలూరి మాట్లాడుతూ ‘’టోటల్ ఫ్యామిలీ వెళ్లి చూసే సినిమా. అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది’’ అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘’’టైటానిక్’ చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్‌టైన‌ర్‌. ‘అంత‌ర్వేది నుండి అమ‌లాపురం’ వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో టైటానిక్ అనే లాంచీలో జ‌రిగే క‌థే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా న‌టించాడు. రాజీవ్, యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా చక్కగా యాక్ట్ చేశారు. ర‌ఘుబాబు విల‌న్‌గా న‌టించాడు. అలాగే జ‌బ‌ర్‌ద‌స్త్ టీం కామెడి సినిమాకు ప్ల‌స్ అవుతుంది. డైరెక్టర్ రాజవంశీగారు పక్కా ప్లానింగ్ తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

పృథ్వీ, ర‌ఘుబాబు, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్ః స‌త్య‌, ఫైట్స్ః రాం సుంక‌ర‌, ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి.కె, మ్యూజిక్ః వినోద్ యాజ‌మాన్య‌, ఎడిట‌ర్ః ఎమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీః రామ‌రాజు, స‌హా నిర్మాతః అట్లూరి సురేష్ బాబు, నిర్మాతః కె.శ్రీనివాస‌రావు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: జి.రాజ‌వంశీ.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved