pizza
Suriya's 24 music launch
‘24’ ఆడియో ఆవిష్కరణ
ou are at idlebrain.com > News > Functions
Follow Us

11 April 2016
Hyderabad

సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’. ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్నారు. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది.

ఈ కార్యక్రమానికి హీరో సూర్య, విక్రమ్ కుమార్, ఎ.ఆర్.రెహమాన్, కార్తీ, అఖిల్, డి.సురేష్ బాబు, కొరటాల శివ, సమంత, భోగవల్లి ప్రసాద్, జ్ఞాన‌వేవ‌ల్ రాజా, జెమిని కిరణ్, నల్లమలుపు బుజ్జి, చంద్రబోస్, అజయ్, అమిత్, హర్ష, వంశీ పైడిపల్లి, దిల్ రాజు, అనూప్ రూబెన్స్, శశాంక్ వెన్నెలకంటి, ప్రవీణ్ పూడి తదితరులు పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్ ను అక్కినేని అఖిల్ విడుదల చేశారు.

ఆడియో సీడీలను హీరో కార్తీ విడుదల చేసి తొలి సీడీని డి.సురేష్ బాబు, భోగవల్లి ప్రసాద్ లకు అందించారు.

సూర్య మాట్లాడుతూ ‘’తెలుగు ప్రేక్షకులు మాపై చూపించే అభిమానాన్ని మరచిపోలేను. ‘24’ సినిమా ాకు చాలా ఇంపార్టెంట్ సినిమా. నా కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా. ‘మనం’ తర్వాత నేను విక్రమ్ ను కలిశాను. నాలుగున్నర గంటల పాటు కథ విని నేను ఆయనకు నా నిలబడి సంతోషంతో క్లాప్ కొట్టాను. కథ అంతా బాగా నచ్చింది. అందువల్ల నేను నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా మారాను. సినిమా చేయాలనుకోగానే రెహహన్ గారిని కలిశాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు, అందుకు ఆయనకు థాంక్స్. ఈ సినిమాలో అజయ్ కీ రోల్ చేశాడు. మంచి నటనను కనపరిచాడు. సమంత, నిత్యామీనన్ సహా అందరూ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సినిమాటోగ్రాఫర్ తిరుణాకరసు గారు సినిమా లుక్ నే మార్చేశారు. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. మాకు తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు కావాలి’’ అన్నారు.

కార్తీ మాట్లాడుతూ ‘’బ్రిలియంట్ టైటిల్. కథ వినగానే టైటిల్ గురించి గంటపాటు ఆలోచించాను. విక్రమ్ ఒక బ్రిలియంట్ డైరెక్టర్. ఓ ఫాంటసీ వరల్డ్ ను క్రియేట్ చేసి మనల్ని అందులో తీసుకెళ్లబోతున్నారు. ఆ ప్రపంచంలో అందర్నీ ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. బ్యూటీఫుల్ స్క్రిప్ట్. అందులో అన్నయ్య మూడు క్యారెక్టర్స్ చేశారు. ప్రతి రోల్ కు బాగా వేరియేషన్ చూపించారు. రెహమాన్ గారు నాకు ఇన్ స్పిరేషన్. ఆయన మ్యూజిక్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన తన మ్యూజిక్ తో ఆ ఫాంటసీ వరల్డ్ పై మనకు నమ్మకాన్ని కలిగిస్తాడు. సాంగ్స్ అన్నీ బావున్నాయి. నిర్మాతలకు, నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

విక్రమ్ కుమార్ మాట్లాడుతూ ‘’సూర్యగారు నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. రెహమాన్ గారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన గొప్ప టెక్నిషియనే కాదు, గొప్ప వ్యక్తి కూడా. భవిష్యత్ లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో అజయ్ ఎక్సలెంట్ పెర్ ఫార్మెన్స్ చేశాడు. ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రాఫర్ తిరుణాకరసుగారు, సమంత, నిత్యామీనన్ సహా ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ‘’సూర్య, విక్రమ్ కు థాంక్స్. ఈ సినిమా అందరీ ఆశీస్సులతో పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ ‘’సూర్యగారిని గజినీ సినిమాలో చూసినప్పుడు యాక్టర్ అంటే ఇలా ఉండాలనుకున్నాను. అంత బాగా నటించారు. సమంత నా ఫెవరేట్ హీరోయిన్. రెహమాన్ గారి గురించి మాట్లాడే వయసు లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఫస్ట్ యాక్ట్ చేశాను. ఇలాంటి సినిమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని సినిమాలను చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డి.సురేష్ బాబు మాట్లాడుతూ ‘’’సూర్య ప్రతి సినిమాను చాలెంజింగ్ గా చేస్తున్నాడు. రెహమాన్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సమంతకు, నిర్మాతలకు అందరికీ అభినందనలు‘’ అన్నారు.

భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ ‘’24 సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్‘’ అన్నారు.

అజయ్ మాట్లాడుతూ ‘’డైరెక్టర్ విక్రమ్ గారికి థాంక్స్. మంచి రోల్ ఇచ్చారు. సూర్యగారు వండర్ ఫుల్ ప్రొడ్యూసర్, ఫేబులస్ యాక్టర్. ఇలాంటి ఓ మూవీలో నేను పార్ట్ అయినందుకు గర్వంగా ఫీలవుతున్నాను‘’ అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ ‘’సౌతిండియాలో సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తుంటారు. విక్రమ్ మూడో సినిమాతో తెలుగు, తమిళంలో సినిమా చేస్తున్నాడు. రెహమాన్ గారికి, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సినిమా సమ్మర్ లో పెద్ద హిట్ కావాలి‘’ అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘’నేను కార్తీ వల్ల తమిళ్ డైరెక్ట్ అయ్యాను. సూర్యగారు మా అందరికీ ఇష్టమైన హీరో. సినిమాకు వర్క్ చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్‘’ అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ‘’24 మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. సూర్యగారికి, రెహమాన్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని . సినిమాలోని నటీనటులకు, టెక్నిషియన్స్ కు అభినందనలు‘’ అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ ‘’ఈ మధ్య కాలంలో బాగా వెయిట్ చేసిన సినిమా ఇది. బెస్ట్ టీం వర్క్ చేసిన సినిమా. నాకు ఇష్టమైన డైరెక్టర్ విక్రమ్ కుమార్ గారు, సూర్య, సమంత, రెహమాన్ గారు మంచి టీం వర్క్ చేసింది’’ అన్నారు.

సమంత మాట్లాడుతూ ‘’రెహమాన్ గారితో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. తన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా లిఫ్ట్ చేసేశారు. కథ వినగానే ముందు భయపడ్డాను. విక్రమ్ గారు వేరే లెవల్ లో చెప్పిన దానికంటే బాగా తీశారు. సూర్యగారు ఈ సినిమాలో త్రీ రోల్స్ చేశారు. గ్రేటెస్ట్ పెర్ ఫార్మర్. ఆయన మాత్రమే చేయగల సినిమా ఇది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‘’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫి - కె.తిరునాపుక్కరసు, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, పాటలు - చంద్రబోస్ మరియు శశాంక్ వెన్నెలకంటి, సౌండ్ డిజైన్ - లక్ష్మీ నారాయణన్, సౌండ్ ఎఫెక్ట్స్ – ఇక్బాల్, యాక్షన్ – అన్బరివ్, కొరియోగ్రఫీ - రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - జులియన్ ట్రౌసెల్లియర్, మేకప్ - క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్, కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా, స్టిల్స్ - ఆర్.వెంకట్రామ్, పబ్లిసిటీ డిజైన్ - రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్, పి.ఆర్.ఓ - ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను, నిర్మాత – సూర్య, రచన - దర్శకత్వం - విక్రం కె కుమార్


Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved