pizza
U music launch
`యు` మ్యూజిక్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 December 2018
Hyderabad

శ్రీమ‌తి నాగానిక స‌మ‌ర్ప‌ణ‌లో కొవెరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కొవెరా, హిమాన్షి కాట్ర‌గ‌డ్డ హీరో హీరోయిన్‌గా కొవెరా ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌ల‌క్ష్మి కొండా నిర్మించిన చిత్రం `యు`...`క‌థే హీరో` ట్యాగ్ లైన్‌. ఈ సినిమా మ్యూజిక్ లాంచ్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో

హీరో శ్రీవిష్ణు ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

మ్యూజిక్ డైరెక్ట‌ర్ స‌త్య మ‌హావీర్ మాట్లాడుతూ - ``కొవెరాతో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. కొవెర వండ‌ర్‌ఫుల్ ఐడియాతో త‌యారు చేసుకున్న కాన్సెప్ట్ ఇది. ఇది ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఇది. చాలా సింపుల్‌గా.. అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ప్యాష‌నేటింగ్‌గా సినిమాను తెర‌కెక్కించారు. మ్యూజిక్ చాలా బాగా వ‌చ్చింది. సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా ఉంది. ఆర్ ఆర్ అద్భుతంగా కుదిరింది. ప్ర‌తి వ్య‌క్తి మన దేశానికి ఏదో ఒక‌టి చేయాల‌నుకునేలా సినిమా ఉంటుంది. వందేమాత‌రంను కొత్త పంథాలో మార్చి ప్రేక్ష‌కుల‌కు అందించాం`` అన్నారు.

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ - ``టైటిల్ చూసి ఇదేంటి అనుకున్నాను. ఓసారి కొవెర పిలిస్తే వెళ్లాను. ఆయ‌న సినిమా చూపించారు. ఇది చిన్న సినిమా క‌దా.. అని అనుకున్నాను. కానీ సినిమా చాలా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో చాలా బావుంది. కొవెర సినిమాను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు. సినిమాల చాలా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాడు. అన్నీ తానై సినిమాను చేసుకున్నాడు. పాట‌లు బావున్నాయి. కొన్ని స‌ల‌హాలు తీసుకుని ఇంకా బెట‌ర్‌మెంట్ చేసుకుని సినిమాను తయారు చేసుకున్నాడు. ఈ సినిమాలో నిజంగా క‌థే హీరో. సోసైటీలో ఇప్పుడున్న ఓ స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించారు. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

శ్రీవిష్ణు మాట్లాడుతూ - ``కొవెర అస‌లు పేరు రాజేంద్ర‌. నేను త‌ను క‌లిసి ఇంట‌ర్ చ‌దువుకున్నాం. సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత నాతో చాలా విష‌యాలు డిస్క‌స్ చేసేవాడు. ఎగ్రెసివ్ ప‌ర్స‌న్‌. త‌న సినిమాలో సెన్సిబుల్ పాయింట్ ఉంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. కానీ రాజేంద్ర తొలి సినిమాతోనే ఆ ప్ర‌య‌త్నం చేయ‌డం గొప్ప విష‌యం. సినిమాచాలా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స‌త్య మ‌హావీర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కాలేజ్ డేస్ నుండి త‌న‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. ఈ సినిమాతో త‌న‌కు మంచి బ్రేక్ వ‌స్తుందని భావిస్తున్నాను`` అన్నారు.

హీరో, ద‌ర్శ‌కుడు కొవెరా మాట్లాడుతూ - `` బ‌న్ని, అఖిల్‌, శ్రీవిష్ణు ఇలా అందరికీ క‌థ‌లు చెప్పాను. ఓ డైరెక్ట‌ర్ హీరోను ఎలా ఒప్పిస్తాడు? అనే ఆలోచ‌న‌ల నుండి పుట్టిందే ఈ సినిమా. క‌థ బావుంటే డైరెక్ష‌న్ అవ‌కాశం ఇచ్చేయ‌రు. వారితో ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే మ‌న‌ల్ని న‌మ్మి ఓ వ్య‌క్తి కొన్ని కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి పెడతాడు.. ఆ రిస్క్ డైరెక్ట‌ర్ భ‌రిస్తాడా? లేదా? అనే కోణంలో ఆలోచిస్తారు. కేవ‌లం రాజ‌మౌళిగారే 400 కోట్ల రూపాయ‌ల సినిమా ఎందుకు చేయ‌గ‌లిగారు. ఆ రిస్క్‌ను తీసుకోగ‌లిగారు కాబ‌ట్టి పెద్ద బ‌డ్జెట్ మూవీ చేశారు. ఎక్కువ రిస్క్ తీసుకునే డైరెక్ట‌ర్‌కి ఎప్పుడూ మంచి అవ‌కాశాలుంటాయని న‌మ్మాను. అందుక‌నే ఎవ‌రూ తీసుకోని రిస్క్ తీసుకున్నాను. నేనే హీరోగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌క‌త్వం చేసుకున్నాను. ఎక్కువ రిస్క్ తీసుకున్నాను కాబ‌ట్టే ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డానని గ‌ర్వంగా చెప్పుకోగ‌ల‌ను. ఇంత క‌ష్ట‌ప‌డ్డాను త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ జ‌ర్నీలో ముగ్గురికి థాంక్స్ చెప్పాలి. అందులో మొద‌టి వ్య‌క్తి నేచర‌ల్ స్టార్ నాని..ఆయ‌నొక ఇంట‌ర్వ్యూలో చెప్పిన మాట విని సినిమాల‌నే న‌మ్ముకోవాల‌ని నా సాఫ్ట్ వేర్ జాబ్ మానేశాను. రెండో వ్య‌క్తి అల్లు అర్జున్‌గారు... ఆయ‌న‌కు ఓసారి క‌థ చెప్పాల‌ని వెళ్లిన‌ప్పుడు ఆయ‌న సాదార‌ణ చెయిర్‌లో కూర్చుని న‌న్ను సోఫాలో కూర్చొని బెట్టారు. అదేంటి సార్ అని అడిగితే మీరు కొత్త క‌థ తెచ్చారు క‌దా.. కొత్త క‌థ అంటే నేను కొత్త‌గా ఏదైనా నేర్చుకోవాలి క‌దా.. అన్నారు. ఆయ‌న్ను చూసి నాకు సిగ్గేసింది. డాన్సులు, ఫైట్స్ ఇర‌గ‌దీసే అల్లు అర్జున్.. అరవింద్‌గారి అబ్బాయే కొత్త‌గా ఏదో చేయాల‌నుకుంటున్నారు క‌దా.. అనిపించింది. ఏదో ఒక‌టి నేర్చుకోవాల‌నే త‌ప‌న మొద‌లైంది. ఈ సినిమా చేయ‌డానికి నాకు కోటిన్న‌ర ఖ‌ర్చు అయ్యింది. ఇన్ని టాస్కులు చేయాలి. చాలా మంది నువ్వు ఇన్ని చేయ‌లేవ్‌. సాధ్యం కాదు అని అన్నారు. అప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారి జ‌న‌సేన ఆవిర్భావ స‌భ స్పీచ్ విన్నాను. అప్పుడు ధైర్యం వ‌చ్చింది. ఆ ధైర్యాన్నే న‌మ్ముకున్నాను. మ‌న ఫ్యూచ‌ర్ మ‌న చేతిలోనే ఉంటుంది. క‌లలు క‌నండి.. క‌చ్చితంగా నిజ‌మ‌వుతాయి. ఈ సినిమాలో నేను ట‌చ్ చేసిన పాయింట్ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేదు. ఈ సంద‌ర్భంగా నేను మూడు విష‌యాలు చెబుతాను.. అవేంటంటే

ఐపిఎల్ బెట్టింగ్ ఒక హైద‌రాబాద్‌లోనే రెండు వంద‌ల కోట్లు జరుగుతాయి. మ‌రి ఇండియా అంత‌టా ఎన్ని వేల కోట్ల బెట్టింగ్ వ్యాపారం జ‌రుగుతుందో క‌దా.. మ‌రి ఆ డ‌బ్బులు అంతా ఎక్క‌డున్నాయి. ఏ బ్యాంకుల్లో ఉండ‌వు క‌దా.

విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ బ్యాంకు అకౌంట్స్ సీజ్ చేసేశారు క‌దా.. మ‌రి వాళ్లు లండ‌న్‌లో లాయ‌ర్స్‌ను ఎలా పెట్టుకుంటున్నారు. వాళ్లు ప్యాన్ కార్డు కూడా ప‌నిచేయ‌దు. అలాంటిది లండ‌న్‌లో లాయ‌ర్ పెట్టుకోవాలంటే రెండు కోట్ల రూపాయలు ఎక్క‌డి నుండి వ‌స్తున్నాయి.

ఖ‌మ్మంలో మా త‌మ్ముడు ఓటుకి మూడు వేలు అన్నారు. ఎల‌క్ష‌న్‌లో చూపింది వంద కోట్ల ఆస్థి.. కానీ ఎన్నిక‌ల్లో తిప్పిన ట‌ర్నోవ‌ర్ ఇర‌వై వేల కోట్ల రూపాయ‌లు.. మ‌రి ఆ డ‌బ్బులు ఎక్క‌డి నుండి వ‌స్తున్నాయి. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు మీకు డిసెంబ‌ర్ 14వ తారీఖున స‌మాధానం దొరుకుతాయి. కాబ‌ట్టి మా `యు` సినిమాను త‌ప్ప‌కుండా చూడండి`` అన్నారు.

కొవెరా, హిమాన్షి కాట్ర‌గ‌డ్డ‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, స్వ‌ప్న రావ్‌, ల‌హ‌రి(మ‌ళ్ళీరావా ఫేం), ఉప్ప‌ల‌పాటి నారాయ‌ణ‌రావు, రాఘ‌వ‌, నాగి, రోహిణి, సంధ్య‌, దొర‌బాబు త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి పాట‌లు: గురుచ‌ర‌ణ్‌, కిస్సు విస్సాప్ర‌గ‌డ‌, సురేశ్ బ‌నిశెట్టి, కొరియోగ్ర‌పీ: విజ‌య్ పోలాకి, స‌తీష్‌, ఫైట్స్‌: షావోలిన్ మ‌ల్లేష్‌, డైలాగ్స్‌: మ‌హి ఇల్లింద్ర‌, క‌రుణ్ వెంక‌ట్‌, స్క్రీన్ ప్లే: కొవెర‌, మ‌ధు విప్ప‌ర్తి, ఆర్ట్‌: రాజీవ్ నాయ‌ర్‌, మ్యూజిక్‌: స‌త్య మ‌హావీర్, సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్‌: రాకేష్ గౌడ్ మైసా, కో ప్రొడ్యూస‌ర్‌: మూర్తి నాయుడు పాదం, లైన్ ప్రొడ్యూస‌ర్: ర‌మేష్ కైగూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: నాగ శివ‌గ‌ణ‌ప‌ర్తి, ఎ.ఆర్‌.శౌర్య‌రాజ్‌, నిర్మాత‌: విజ‌యల‌క్ష్మి కొండా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కొవెరా.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved