10 March 2016
Hyderabad
మహంతి పీకే దర్శకత్వంలో విషురెడ్డి, వర్ధన్‌రెడ్డి, ఐరా ప్రధాన పాత్రధారులుగా కొండ్రెడ్డి సతీష్ చౌదరి నిర్మించిన చిత్రం 'వాడు వీడు ఓ..కల్పన'. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మంత్రి మాణిక్యలరావు, సినీనటులు సుమన్, అల్లరి నరేష్ తదితరులు హాజరయ్యారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాణిక్యలరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి సుమన్‌కు, అల్లరి నరేష్‌కు అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ జాన్ భూషన్ అందించిన సంగీతం బాగుందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'వాడు వీడు ఓ..కల్పన' సినిమా సక్సెస్ కావాలని చిత్రయూనిట్‌కు విషెస్ తెలిపారు. ప్రొడ్యూసర్ సతీష్ లాంటి యువకులు సినిమాలు తీయాలని కోరారు. టాలీవుడ్‌లో చిన్న చిత్రాలు రావాలని హైదరాబాద్‌లో చిత్రపరిశ్రమ ఘనంగా వర్థిల్లాలని ఆకాంక్షించారు. సినిమా అంటే హైదరాబాద్ అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ప్రకటించారు. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ విధానం ప్రవేశపెడతామన్నారు. చిన్న సినిమాలకు 5వ షో ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు.
ఏపీ మంత్రి మాణిక్యలరావు మాట్లాడుతూ.. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. తమ నియోజక వర్గానికి చెందిన మహంతి ఇప్పుడు డైరెక్టర్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమా అంటే ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని అన్నారు.
Iraa Glam gallery from the event |
|
|
|
కార్పోరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ సతీష్, డైరెక్టర్ మహంతిలకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ను ఇవ్వాలని కోరారు. ఈనాటి సినీ కళాకారుల కోసం తమ ప్రభుత్వం ఫిలింనగర్-2 ఏర్పాటు చేయనుందని, అందులో డబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తామని ప్రకటించారు.
హీరో సుమన్ మాట్లాడుతూ.. ఈ సినిమా మ్యూజిక్, ఫోటోగ్రఫీ బాగుందన్నారు. చిన్న సినిమాలకు ప్రభుత్వం సహాయం అందజేస్తే బాహుబలి రేంజ్‌లో పేరు తెచ్చుకుంటాయన్నారు. చిన్నసినిమాలను, మంచి సినిమాలను బతికించుకోవలన్నారు.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. తమ సినిమాలకు పని చేసిన మహంతి.. ఈ సినిమాతో డైరెక్టర్ కావడం చాలా సంతోషమన్నారు. సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని ఆకాంక్షించారు.
చిత్ర దర్శకుడు మహంతి పీకే మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా దర్శకునిగా నాకు ఇది తొలి సినిమా. ఇక వాడు వీడు కల్పన ఆ ముగ్గురు కూడా కొత్త వాళ్లే. నిర్మాత కూడా కొత్త వ్యక్తి. వీళ్లందరికి ఒక ఐడెంటీ తీసుకురావడం కోసమే ఈ సినిమాను తెరకెక్కించాను. సినిమా బాగా వచ్చింది. టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. యూత్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ఈ సినిమా హిట్ అవ్వడమే కాదు భారీ కలెక్షన్లు తీసుకురావడం ఖాయం.
ఈ ఆడియో విడుదల వేడుకలో చిత్రయూనిట్‌తో పాటు ఏపీ, తెలంగాణ మంత్రులు తలసాని, మాణిక్యలరావు, హీరోలు సుమన్, అల్లరి నరేష్, ప్రసన్నకుమార్, గిరిబాబు, బీజేపీ నాయకురాలు మాలతి దేవి, కార్పోరేటర్ కాజాసూర్యనారాయణ, సీనియర్ ప్రొడ్యూసర్ కాకర్ల కృష్ణ, పద్మిని.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.