pizza
Venkatapuram music launch
'వెంకటాపురం' ఆడియో లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 April 2017
Hyderabad

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ `వెంకటాపురం`. హ్యాపీడేస్ ఫేం హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. వేణు దర్శకత్వం వహించాడు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర హోం మినిష్టర్ నాయిని నర్సింహారెడ్డి, శర్వానంద్, మారుతి, రాహుల్ రవీంద్రన్, విజయ్ దేవరకొండ, హీరో రాహుల్, మహిమా మక్వాస్, డి.ఎస్‌.రావు, కాశీ విశ్వ‌నాథ్‌, హోమియో కేర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్, డార్లింగ్ స్వామి, గురూజీ సాయి, గోవర్ధన్ రెడ్డి, అచ్చు, దీపు, రఘురాం, అభిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

బిగ్ సీడీని నాయిని నర్సింహ రెడ్డి విడుదల చేయగా, ఆడియో సీడీలను మారుతి విడుదల చేశారు.

కుమారచౌద‌రి మాట్లాడుతూ ``శ్రేయాస్ మీడియా శ్రీనుకి, గుడ్ సినిమా గ్రూప్‌కీ ఆల్ ది బెస్ట్. వీళ్ల ఫ‌స్ట్ సినిమా ద‌గ్గ‌ర నుంచి నేను వీళ్ల‌ని చూస్తూనే ఉన్నా. ఈరోజుల్లో నుంచి వీళ్ల ఆడియో ఫంక్ష‌న్ల‌కి వ‌స్తూనే ఉన్నా. క్రైమ్ స‌బ్జెక్ట్ లాగా అనిపించింది. ట్రైల‌ర్ చాలా బావుంది. పిక్చ‌రైజేష‌న్ బావుంది. పాట‌లు బావున్నాయి. మేకింగ్ సైడ్ శ్రీను చాలా సినిమాలు చేశాడు. చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఆ కోవ‌లోనే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. మారుతి ఓ నిర్మాత‌గా నిల‌బ‌డి, ఈ సంస్థ‌ను కంటిన్యూ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి. సినిమా టైటిల్ కూడా చాలా బావుంది`` అని అన్నారు.

ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ ``హ్యాపీడేస్‌లో ఒక‌రిగా న‌టించిన రాహుల్ ఈ సినిమాతో త‌ప్ప‌కుండా హిట్ కొట్టాల‌ని ఆశిస్తున్నాను. అచ్చు ఇంకా చాలా సినిమాలు చేయాలి. నాతో ఆయ‌న రెండు సినిమాలు చేశారు. స్టార్స్ తో చేయ‌క‌పోయినా అచ్చు సంగీతం ఎప్పుడూ చార్ట్ బ‌స్ట‌ర్స్ తో ఉంటుంది. అచ్చు వెరైటీ ఆప్ష‌న్స్ తో చాలా ఛాయిస్‌లున్న సంగీతాన్ని ఇస్తార‌ని నేను చాలా మందితో చెబుతుంటాను. ఈ సినిమా యూనిట్ మొత్తానికి బెస్ట్ విష‌స్ చెబుతున్నాను. సిటీలో పోస్ట‌ర్స్ చాలా బావున్నాయి`` అని చెప్పారు.

మ‌ల్టీ డైమ‌న్ష‌న్ వాసు మాట్లాడుతూ - ``గుడ్ సినిమా గ్రూప్ శ్రీనివాస్ చాలా హార్డ్‌వ‌ర్క‌ర్‌, ఎన్నో సినిమాల ఆడియో ఫంక్ష‌న్స్‌ను నిర్వ‌హించి ఆడియో వేడుక‌ల‌ను నెక్ట్స్ లెవ‌ల్స్‌కు తీసుకెళ్ళాడు. చాలా మంది కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేశారు. ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి ట్రెండ్ క్రియేట్ చేసింది. హ్యాపీడేస్‌లో ల‌వ‌ర్‌బోయ్‌గా క‌న‌ప‌డ్డ రాహుల్ ఈ సినిమాలో సిక్స్‌ప్యాక్ హీరోగా క‌న‌ప‌డుతున్నాడు. వెంక‌టాపురం పెద్ద హిట్ అయ్యి రాహుల్ స‌హా సినిమాతో అసోసియేష‌న్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు తేవాలి`` అన్నారు.

కాశీ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ - ``వెంక‌టాపురం ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌. డైరెక్ట‌ర్ వేణు ఏడాదిన్న‌ర పాటు స్క్రిప్ట్ త‌యారు చేశాడు. చాలా ఇంట్రెస్టింగ్ క‌థ‌. ఈ క‌థ‌లో నిజాయితీ ఉంది. శ్రీనివాస్‌, వేణు, రాహుల్ ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డారు. డెఫ‌నెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ - ``గుడ్ సినిమా గ్రూప్ నాకు మాతృ సంస్థ‌లాంటిది. మారుతిగారు, శ్రేయాస్ శ్రీనివాస్ ఈ నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేశారు. ఈ బ్యాన‌ర్‌లో ఈరోజుల్లో సినిమాతో స‌క్సెస్ కొట్టింది. వెంక‌టాపురం ట్రైల‌ర్ పెక్యుల‌ర్‌గా ఉంది. రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా ఉంది. అచ్చు మ్యూజిక్ బావుంది. డైరెక్ట‌ర్ వేణుకి కంగ్రాట్స్‌. ట్రైల‌ర్ ఇంత బావుంటే సినిమా ఇంకా బావుంటుంది. రాహుల్‌, శ్రీనివాస్‌, ఫ‌ణిలకు ఈ సినిమాతో పెద్ద హిట్ సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. శ్రేయాస్ శ్రీనివాస్‌, డైరెక్ట‌ర్ వేణు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని స్క్రిప్ట్‌ను ట‌చ్ చేస్తుంటారు. ఆయ‌న గ‌ట్స్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. హ్యాపీడేస్‌లో రాహుల్ ఈ సినిమాలో చాలా ఇంటెన్స్‌తో క‌న‌ప‌డుతున్నాడు. అచ్చు కూడా మంచి స్నేహితుడు. ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంద‌రి కోసం సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

విజ‌య్ దేవ‌ర కొండ మాట్లాడుతూ - ``హ్యాపీడేస్‌లో ఉన్న టైస‌న్‌లా మ‌న‌కు క‌న‌ప‌డ్డ రాహుల్ ఈ సినిమాలో చాలా కొత్త లుక్‌లో క‌న‌ప‌డుతున్నాడు. ట్రైల‌ర్ కూడా చూశాను. చాలా బాగా న‌చ్చింది. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని, ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

మారుతి మాట్లాడుతూ - ``నేను అల్రెడి సినిమా చూశాను. సినిమా చాలా బావుంది. సినిమా చూసిన కెమెరా మెన్ సాయిప్రకాష్, డైరెక్టర్ వేణుయే అసలు హీరోలుగా అనిపించారు. చాలా సిన్సియర్గా కనపడ్డారు. రాహుల్ కథను నమ్మి చేశాడు. ప్రతి ఫ్రేమ్‌ను చెక్కారు. సినిమా చూస్తే, సినిమాలో నిజాయితీ క‌న‌ప‌డుతుంది. మ‌హిమా మ‌క్వాస్ చాలా ఎఫ‌ర్ట్ పెట్టి చేసింది. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ యూనిట్‌ను అభినందిస్తున్నాను`` అన్నారు.

నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ - ``పాటలు బావున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి హండ్రెడ్ డేస్ ఆడాలని కోరుతున్నాను. శ్రీధర్ నన్ను కలవడానికి వచ్చి తెలంగాణ ఉద్య‌మంలో మేం భాగ‌స్వాముల‌మ‌ని చెప్పారు. స‌రేన‌ని నేను కూడా ఈ వేడుకకు వ‌చ్చాను. ఇలాగే తెలంగాణ క‌ళాకారులు సినిమా ఇండ‌స్ట్రీలో ముందుకు వ‌చ్చి తెలంగాణ వాడి, వేడిని చూపించాలి, ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. అలాగ‌ని ఆంధ్ర‌వారిని దూరం చేసుకోవాల‌ని కాదు, హైద‌రాబాద్‌లో, తెలంగాణ‌లో ఉండే ఆంధ్ర‌వాళ్ళంతా తెలంగాణ వాదులే. ఎవ‌రినీ ఎమ‌న‌డానికి వీల్లేదు. వారు ఇప్పుడు మ‌న సోద‌రులు. మ‌నం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, ప‌క్క ప‌క్క‌నున్నాం. అంద‌రి క‌లిసి మెలిసి ఉండాలి. ఇచ్చి పుచ్చుకోవాలి. కానీ అక్క‌డి ముఖ్య‌మంత్రి మ‌న‌ల్నిఅప్పుడ‌ప్పుడు కెలుకుతున్నాడు. ఏదేమైనా మ‌నం మాత్రం క‌లిసుందాం. తెలంగాణ హీరో, హీరోయిన్స్‌ను బాగా పైకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేయాలి. ద‌ర్శ‌కుడు వేణు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చుకి, సినిమాకు అభినంద‌న‌లు`` అన్నారు.

శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ``హీరో రాహుల్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. సిక్స్‌ప్యాక్ చేశాడు. జెన్యూన్ స్క్రిప్ట్. నాకు కథ కూడా తెలుసు. నిర్మాత శ్రీనివాస్ కూడా బాగా తెలుసు. అచ్చు పాట‌లు, రీరికార్డింగ్ ఎప్పుడూ బావుంటాయి. నాకు ఇష్ట‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో త‌ను ఒక‌డు. త‌న‌తో క‌లిసి ఎప్ప‌టికైనా సినిమా చేస్తాను. నాకు ఇష్ట‌మైన అంద‌రూ క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా. హిట్ అయ్యే ల‌క్ష‌ణాలు బాగా క‌న‌ప‌డుతున్న సినిమా ఇది`` అన్నారు.

అచ్చు మాట్లాడుతూ - ``రాహుల్‌, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. మాట‌ల కంటే చేత‌లే మాట్లాడుతాయి. ఈ సినిమా కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డాను. మంచి మ్యూజిక్ కుదిరింది`` అన్నారు.

Mahima Makwana Glam gallery from the event

ద‌ర్శ‌కుడు వేణు మాట్లాడుతూ - ``ఎడిటర్ మ‌ధుగారు సినిమాను చ‌క్క‌గా ఎడిట్ చేశారు. సాయి అన్న స‌పోర్ట్ మ‌ర‌చిపోలేను. అచ్చుగారు నా మ్యూజిక్‌కు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. ఆయ‌న‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకు బెస్ట్ ట్యూన్స్‌తో పాటు అదిరిపోయే రీరికార్డింగ్ ఇచ్చారు. క‌ష్ట‌ప‌డి ఇష్టంతో సినిమా చేశాం. రాహుల్‌గారు ఎంతో స‌హకారం ఇచ్చారు. సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్కిరికీ థాంక్స్‌. మంచి టీం దొరికింది కాబ‌ట్టే మంచి అవుట్‌పుట్ వ‌చ్చింది. ఒక సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను`` అన్నారు.

రాహుల్ మాట్లాడుతూ - ``నాది, డైరెక్ట‌ర్ వేణు, నిర్మాత‌ల‌ది మూడేళ్ళ ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. నిర్మాత‌లు శ్రీనివాస్‌, ఫ‌ణిగారు అనుకున్న బ‌డ్జెట్ క‌న్నా ఎక్కువే అయినా, ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. చాలా ప్యాష‌న్‌తో సినిమా చేశారు. డైరెక్ట‌ర్ వేణు చెప్పిన క‌థ కంటే సినిమాను బాగా తీశారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమాకు ఇంత బ‌జ్ వ‌చ్చిన‌దానికి కార‌ణం కూడా ఆయ‌నే. సాయిప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీతో బ్యాక్‌బోన్‌లా నిల‌బ‌డ్డారు. అచ్చు మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని అంద‌రికీ తెలుసు. ఈ సినిమాతో త‌ను పెద్ద క‌మ‌ర్షియ‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడు. ట్యూన్స్ కంటే మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మ‌హిమ అద్భుతంగా న‌టించింది. అజ‌య్‌, అజ‌య్‌ఘోష్, రాథోడ్‌, శివ స‌హా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. మ‌ధుగారు చ‌క్క‌టి ఎడిటింగ్ ఇచ్చారు. సినిమాను స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నటీనటులు -
రాహుల్, మహిమా మక్వాన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ తదితరులు
సాంకేతిక నిపుణులు -
ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, మ్యూజిక్: అచ్చు, కొ-ప్రోడ్యూస‌ర్: ఉమాదేవి కున‌ప‌రాజు ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్, స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved