pizza
Ee Premalo Anni Ekkuve audio success
కువైట్ లో 'ఈ ప్రేమలో అన్ని ఎక్కువే' ఆడియో సక్సెస్ సంబరాలు
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 March 2014
Hyderabad

రచన ఫిలింస్ & అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ సంయుక్తంగా అనూజ్ రామ్, శ్రీముఖి హీరో హీరోయిన్లుగా వెంకట్ వర్థన్ దర్శకత్వంలో అపురూప్ (శివ), గంప సిద్దలక్ష్మిలు నిర్మించిన వెరైటి లవ్ ఎంటర్ టైనర్ 'ఈ ప్రేమలో అన్ని ఎక్కువే'. ఇటీవలే కాఫి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆడియో సక్సెస్ సంబరాలు కువైట్ లోని మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ కువైట్ ఆధ్వర్యంలో వేలాది తెలుగు ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ చేజర్ల ఇంద్రకుమార్ రాజు ఆడియో సక్సెస్ సీడీలను ఆవిష్కరించి మా అధ్యక్షులు అలీ, గౌరవ అధ్యక్షులు ఇమ్రాన్, కార్య నిర్వాహకులు చంద్రరాజు, ప్రభాకర్, మోహన్, జగన్, షంషేర్, ప్రసాదరాజు, అన్వర్, అన్సార్, సాధిక్, షాహిద్, జప్రూ మరియు యునైటెడ్ గల్ఫ్ కన్స్ స్ర్టక్షన్ కంపెని కువైట్, టెండరింగ్ మేనేజర్ శ్రీ అమరనాధ్ రెడ్డిలకు అందజేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అపురూప్ (శివ) మాట్లాడుతూ - ''మా సంగీత దర్శకులు వలీషా బాబ్జీ అందించిన ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. పాటలకు విశేష స్పందన లబించింది. కాఫీ మ్యూజిక్ వారు మా ఆడియోను సోషల్ నెట్ వర్క్ ద్వారా ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా సినిమాని ఆడియోను ఆదరించినందుకు కువైట్ లోని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను'' అని అన్నారు.

ఇంకా చిత్రంలో నటించిన చమ్మక్ చంద్ర, సుడిగాలి సుదీర్, రచ్చ రవి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు శ్రీ కృష్ణ కౌశిక్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved